జూలై సపాదకీయం – అరసిశ్రీ

నిర్భయ చట్టం….

దిశ చట్టం……

దిశ పోలీస్ స్టేషన్……

దిశ అప్ …..

రోజులు గడుస్తున్నా చట్టాలు మారుతున్నా , భద్రతను పెంచుతున్నా కాని అత్యాచారాలు , మహిళలపై హింసలు మాత్రం ఒక్క శాతం కూడా తగ్గడం లేదు. మొన్న జరిగిన తాడేపల్లి ఘటనే అందుకు సాక్ష్యం.  కారణం ఏమిటి ? లోపం ఎక్కడ ? వీటిని గురించి ఒక్కసారి ఆలోచించాల్సి అవసరం ఎంతైనా ఉంది.

నిర్భయ చట్టం:
”నిర్భయ” ఘటన యావత్తు ప్రపంచాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటన జరిగి నేటికి సరిగ్గా రెండేళ్లు. 2012 డిసెంబర్ 16న తన స్నేహితుడితో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతిపై కొందరు దుండగులు అతి పాశవికంగా సామూహిక అత్యాచారం చేసారు. సుమారు 2 వారాల పాటు మృత్యువుతో పోరాడిన ‘నిర్భయ’ డిసెంబర్ 29న కన్నుమూసింది.
ఆ మానవ మృగాల అరాచకాన్ని ధైర్యంగా ప్రతిఘటించిన యువతిని ‘నిర్భయ’గా కీర్తిస్తూ, ఆమెకు మద్దతుగా దేశ యువత, ప్రజలు పెద్దఎత్తున ఆందోళనలను చేపట్టగా, అప్పటి యూపీఏ ప్రభుత్వం మాజీ చీఫ్ జస్టిస్ జే.ఎస్.వర్మ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటుచేసింది. కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం నిర్భయ చట్టం తీసుకువచ్చింది.

ఈ చట్టం ప్రకారం మొదటిసారిగా అత్యాచారానికి పాల్పడితే 20 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష. అదే రెండోసారి పాల్పడితే ఉరిశిక్షను విధించవచ్చు. కాగా, నిర్భయ చట్టం వచ్చినా, మహిళలపట్ల నేరాలు తగ్గలేదు. ప్రతిరోజూ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో ఇప్పటికీ అభద్రతా భావంతో మహిళలు ఉన్నారు

దిశ చట్టం :
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, లైంగిక దాడులను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ చట్టం అనే పేరుతో ఒక కొత్త చట్టాన్ని రూపొందించింది. ఈ బిల్లును హోంమంత్రి సుచరిత 2019, డిసెంబరు 13న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ దిశ చట్టాన్ని శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ చట్టం ద్వారా మహిళలపై అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో 14 రోజుల్లోనే విచారణ పూర్తిచేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం 21 రోజుల్లో రేప్‌ కేసుపై జడ్జిమెంట్‌ రానుంది.

*ఈ దిశ ప్రకారం 14 రోజుల్లోపే విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో నిందితుడికి శిక్ష పడే విధంగా చట్టాన్ని రూపొందించారు.

*ఈ చట్టం లో పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడే వారికి జీవితఖైదుగా లేదా ఉరిశిక్షకూ అవకాశం ఉంది.

*సోషల్‌, మీడియాల్లో వేధింపులకు పాల్పడే వారిని శిక్షించేందుకు ఐపిసిలో 354(ఇ) అనే కొత్త సెక్షన్‌ తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం మొదటి తప్పుకు రెండేళ్లు, రెండవ తప్పుకు నాలుగేళ్లు శిక్ష విధించనున్నారు.

*మహిళలు, పిల్లలపై జరిగే నేరాల విచారణకు త్వరగా జరిగేలా ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నారు.

దిశ పోలీస్ స్టేషన్ :
మహిళల రక్షణ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తొలి దిశ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించింది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఐదు అర్బన్ జిల్లాలతో కలిపి… మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది.

ఇకనుంచి 24 గంటల పాటు దిశ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉండనుంది. మొత్తంగా 13 జిల్లాలకు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెయిటింగ్ హాల్, కాన్ఫరెన్స్ హాల్, పిల్లలకు చనుబాలిచ్చేందుకు గది, ఇతరత్రా సౌకర్యాలు ఉంటాయి. డీఎస్పీ స్థాయి ఉన్న ఇద్దరు అధికారులు, అయిదుగురు ఇన్ స్పెక్టర్లు, 18 మంది కానిస్టేబుల్స్, ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఒక సైబర్ నిపుణుడు ఈ స్టేషన్‌కు సేవలందిస్తారు. ఏపీలో ప్రతి ఏడాది సరాసరి 600 అత్యాచార కేసులు, 1000 పోక్సో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం.

మహిళలు, చిన్నారులను కించపరిచేలా మాట్లాడిన వారిని, వారిపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిపై దిశ చట్టం ద్వారా చర్యలు తీసుకుంటారు. తొలిసారి తప్పిదానికి పాల్పడితే రెండేళ్లు జైలుశిక్ష, మరోసారి తప్పుచేస్తే నాలుగేళ్ల జైలుశిక్ష విధించేలా చట్టంలో పేర్కొన్నారు. లైంగిక దాడులు, లైంగికంగా వేధిస్తే ప్రస్తుతం ఐదేళ్ల వరకు శిక్షించే అవకాశం ఉంది. నేర తీవ్రతను బట్టి నిందితులకు గరిష్టంగా జీవిత ఖైదు విధించేలా దిశ చట్టం రూపొందించారు.

దిశ అప్ :
స్మార్ట్ ఫోన్‌లో ఈ చిన్న యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని.. ఆపద సమయంలో చిన్న బటన్ నొక్కితే ఐదు నిమిషాల్లో పోలీసులు స్పాట్‌కు చేరుకునేలా యాప్‌ను తయారు చేశారు. ఇంతకీ దిశ యాప్ ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ దిశ యాప్ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంలపై అందుబాటులో ఉంది. ఇంటర్నెట్‌ ఉన్నా.. లేకపోయినా పని చేయడం దీని ప్రత్యేకత. మొబైల్‌లో యాప్‌ను ఓపెన్ చేసి.. ఎస్‌ఓఎస్‌ (SOS) బటన్‌ నొక్కితే ఆ ఫోన్‌ లొకేషన్‌ వివరాలతో పాటు ఆ ఫోన్‌ నెంబరు ఎవరి పేరు మీద ఉంది. చిరునామా వంటి వివరాలన్నీ పోలీస్ కంట్రోల్‌ రూంకి వెళతాయి. మొబైల్ ఏ లోకేషన్‌లో ఉంది. 10 సెకన్ల నిడివిగల వీడియో, ఆడియో కంట్రోల్‌ రూంకి చేరతాయి. బాధితురాలు ఎక్కడున్నారో. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేసేందుకు వీడియో, ఆడియో ఉపయోగపడతాయి.

దిశ యాప్‌లో ‘ట్రాక్‌ మై ట్రావెల్‌’అని ఒక ఆప్షన్‌ ఉంది. ఇది కూడా చాలా ప్రత్యేకమైనది. ఇప్పుడు ఓ మహిళ విజయవాడలో బెంజ్‌సర్కిల్‌ నుంచి బస్టాండ్‌కి ఆటో లేదా క్యాబ్‌లో వెళుతుంటే.. ‘ట్రాక్‌ మై ట్రావెల్‌’ ఆప్షన్‌లో బయల్దేరిన ప్రదేశం, ఎక్కడికి వెళుతున్నారో నమోదు చేయాలి. ఆ మహిళ వెళుతున్న మార్గాన్ని కంట్రోల్‌ రూం నుంచి గమనిస్తారు. నమోదుచేసిన మార్గంలో కాకుండా.. మరో మార్గంలోకి ఆటో వెళ్తే వెంటనే పోలీసు కంట్రోల్‌ రూంతో పాటూ లోకల్ పోలీస్ స్టేషన్‌ను అప్రమత్తం చేస్తూ ఓ మెసేజ్ వెళుతుంది. ఆపదలో ఉన్నవారు యాప్‌లో ఎస్‌ఓఎస్‌ (SOS) బటన్‌ నొక్కగానే. ఆ సమాచారాన్ని వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్‌కి, అక్కడికి దగ్గర్లో ఉన్న పోలీసు వాహనాలకు కంట్రోల్‌ రూం నుంచి ఆటోమేటిక్‌ కాల్‌ డిస్పాచ్‌ విధానంలో పంపిస్తారు. జీపీఎస్‌ అమర్చిన పోలీసు రక్షణ వాహనాల్లో ‘మొబైల్‌ డాటా టెర్మినల్‌’ ఉంటుంది. వాహనం ఉన్న ప్రాంతం నుంచి ఆ సందేశం వచ్చిన ప్రాంతం వరకు రూట్‌ మ్యాప్‌ కనిపిస్తుంది.. దీన్ని అనుసరించి ఆ వాహనం ఆ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఈ దిశ యాప్ ద్వారా 100/112 నంబర్లకూ సహాయం కోసం ఫోన్‌ చేయొచ్చు అవకాశం కూడా ఉంది. యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్‌ నంబర్లు, సమీపంలోని పోలీసుస్టేషన్ల వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఆప్షన్లు ఉన్నాయి.

దిశ చట్టాన్ని తీసుకొచ్చిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. దిశ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించింది. అలాగే ఆపదలో ఉన్న మహిళలకు సాయం అందించేందుకు దిశ యాప్‌ను తీసుకొచ్చింది.

కాని ఇంత వరకు ఎంతమంది వీటి ద్వారా రక్షణ పొందారు. ప్రస్తుతం దిశ చట్టం గురించి ఇప్పటికి ఎంతమందికి అవగాహన ఉంది అనేది మొదట వేసుకోవాల్సిన ప్రశ్న. అలానే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన దిశ అప్ ని కూడా ఎలా ప్రజలకు చేరువ చేయాలి అనేది ఒక్క ప్రభుత్వం బాధ్యతే కాదు తల్లిదండ్రులు, స్వచ్చంద సంస్థలు , విద్యా సంస్థలు , కార్యాలయాలు అన్నీ ఒక్క మాటలో చెప్పాలి అంటే మహిళలు ఉన్న ప్రతి చోట వీటి గురించిన కనీస అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనేదే.
విద్యార్ధుల పాఠ్య పుస్తకాలలో వీటిని చేర్చడం, ప్రభుత్వ ఉద్యోగులు , సేవా కార్యకర్తల ద్వారా వివరించడం, మాధ్యమాలలో ముఖ్యంగా సాంఘిక మాధ్యమాలో విసృతంగా ప్రచారం చేయడం ఒక ఎత్తు అయితే ప్రభుత్వం కొన్ని అంశాలను తప్పనిసరి చేయవలసిన ఆవశ్యకత కూడా ఉంది.

ఎన్ని చట్టాలు ఉన్నా , ఎన్నెన్ని మార్పులు జరిగినా వాటి మీద అవగాహన ప్రజలకు లేనప్పుడు వాటి ఫలితం శూన్యం.

– అరసిశ్రీ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయంPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో