నాలో నేను(కవిత )- కాపర్తి స్వరాజ్యం

అశ్రువుల దారలతో
అవని తడిసిపోయినా
అతివ గుండెలోని
ఆవేదన తరిగిపోవునా
నింగిలోని చుక్కలను చూసి
నిలువెత్తు పొంగే హ్రృదయంతో
నిలబడి కలలు కంటూ మురిసే నా
నీటి చుక్క పడి కలలు చెదిరిపోవునే
చిన్న నాటి మధుర జ్ఞాపకాలు
చింతలు మిగిల్చే నా…..
చిదిమే ఆటంకాలను ఎదుర్కొంటూనే
జీవితపు మలుపులను ఆస్వాదిస్తూ
జీవధారయై నిలిచిపోయినా
జీవన జ్యోతియై వెలుగును పంచి
జీవచ్ఛవంలా మిగిలిపోయినా
పెదాలపై చిరునవ్వు వీడనీయక
పెనవేసుకున్న బంధాలకై
పెంచుకున్న మమతానురాగాలను
పెకలించుకోలేక యాతన పడుతూ
నేలమ్మను ముద్దాడే పాదాలే
నీ పయనం ఎందాకని ప్రశ్నించినా
నావ లేని పయనం సాగిస్తూ
నడి సముద్రంలో పడిపోతున్నా
తనను తాను నమ్ముకుని
తమసం బానే జాబిలి లా
తరుణియైనా జడుపులేని
తాండవమే చేయుచు
పరమేశునైనా పాదాలే కింద
పడి వేసే ఆదిశక్తి వై
ప్రళయ మూర్తిలా విజ్రృంభించి
పంతమే నెగ్గించుకునే
పరమానంద మూర్తియై
పరవశము నొంది ప్రసన్న మై
పసిడి రూపమే దాల్చి
ఒదిగిపోనా నాలో నేను

– కాపర్తి స్వరాజ్యం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో