గజల్-22 – ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

తెలుగు గజల్ ప్రేమికులకు నమస్సులు. ఓ అంత్యప్రాస గజల్ తో మీ ముందుకి వస్తున్నాను ఈరోజు.
సముద్రుడు తానున్న చోటునుండి కదలకున్నా నదులు సంగమించేందుకు ఉరకలతో సాగరాన్ని చేరుకుంటాయి. కడలి అలలతో చుట్టేస్తుంటే అడ్డుపడవు. మధువులను చిందించే పూలు తేనెటీగలను పిలుస్తుంటే తోటముందే ఆగిపోవుకదా. చినుకుపూలు… మన్నుకి పరిమళాలను పూయకుండా ఆగవు. కొలనులోని నీరు పద్మాల సిగ్గులను కరిగించుకుని తొలిపొద్దుని చూపుతున్నట్లు కనబడుతుంది. నెలరాజు రాకకోసం నిరీక్షించే నక్షత్రాలు సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడా అని చూస్తూ ఉంటాయి.
ఇలాంటి భావాల సమాహారమే ఈ గజల్ …

                                         *****

ఏ నదులూ సిగ్గుపడవు కడలిలోన కలిసినపుడు.
కెరటాలను అడ్డుకోవు జలధి కౌగిలించినపుడు.

ఎగురుతున్న జుంటీగలు వనులముందు ఆగిపోవు
మరందాలతో నిండిన తోటపూలు పిలిచినపుడు.

పుడమిలోని కణాలలో పరిమళాలు చిందుతాయి
వానకారు మబ్బులలో చినుకుపూలు విరిసినపుడు.

నీరంతా తొలిపొద్దుకి దర్పణమై వెలుగుతుంది
కొలనులోని సరోజాల బిడియాలే జారినపుడు.

జాబిలికోసం తారలు చూస్తుంటవి “నెలరాజా”
పరుగెత్తిన సూరీడే పడమరలో మునిగినపుడు.

– ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, కాలమ్స్, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో