జ్ఞాపకం- 59– అంగులూరి అంజనీదేవి

దిలీప్ అలా ప్రోత్సహించిన తర్వాత రాసిన కథే ఇది. ఆమె తలవంచుకుని ఏమి ఆలోచిస్తున్నదో అర్థమైంది దిలీప్ కి.

“ఏదిఏమైనా ఈ కథ నీ సాహితీ కెరీర్ కే మంచి బ్రేక్ ఇస్తుంది సంలేఖా! సాహితీపరుల్లో చిన్నపాటి కలవరం, వూహించని అబ్బురం కూడా కలుగుతాయి. ఇప్పటికే ‘ఎవరీ సంలేఖ! ఎక్కుపెట్టిన బాణంలా సాహితీరంగంలోకి ఒక్కసారిగా దూసుకువచ్చింది’ అని ఉక్కిరిబిక్కిరి అవుతూ వుంటారు. నీ గురించి ఎవరికీ చెప్పరు. నిన్ను చూసినా చూడనట్లే వుంటారు. నీ కథలు చదివినా చదవనట్లే వుంటారు. ఇప్పుడు నీ కథను చదివిన ఉత్సుకతతో ఎవరైనా ‘సంలేఖ కథను చదివారా?’ అని వాళ్లను అడిగితే ‘ఇంకా లేదే!’ అంటారు. నిజానికి ఆ కథను వాళ్లెప్పుడో చదివి అందులో నువ్వు చేసిన కొత్త ప్రయోగాన్ని గ్రహించి విభ్రమ చెందే వుంటారు. అయినా ‘ఆ కథలో వుండాల్సిందేదో లోపించిందని ఎవరో అంటే విన్నాం. అందుకే చదవలేదు’ అని ప్రచారం చేస్తుంటారు. ఇదంతా తమలోని ఈగోని సంతృప్తి పరచుకోవడంలో ఓ భాగం. ఇలాంటివి నీ చెవిన పడినప్పుడు నిరుత్సాహపడకు. వ్యాపారలక్షణాల్లాగే ఇవికూడా కొందరు సాహితీపరుల లక్షణాలు. ఒక జర్నలిస్ట్ గా చాలా సాహిత్య కార్యక్రమాలకి హాజరయిన అనుభవంతో చెబుతున్నాను ఇవన్నీ” అన్నాడు దిలీప్.

షాక్ తిన్నది సంలేఖ. కథలు రాయడమే కాదు. వాటి చుట్టూ చాలా ప్రపంచం వుందని గ్రహించింది.
హస్విత కాఫీ పెట్టాలని కిచెన్ లోకి వెళ్లింది. దిలీప్ సడన్ గా లేచి పక్కకెళ్లి ఫోన్లో మాట్లాడుతున్నాడు.
అతను మాట్లాడేది జయంత్ తో అని సంలేఖ అర్థం చేసుకుంది. వాళ్లిద్దరి స్నేహం ఇంటర్ తో ఆగిపోలేదు. ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. కొద్దికొద్దిగా మాటలు కూడా విన్పిస్తున్నాయి. తన కథ గురించే జయంత్ తో మాట్లాడుతున్నాడు దిలీప్.

అతనలా మాట్లాడుతుంటే ఒకవైపు ఆనందం, ఇంకోవైపు ఇంకేదో భావం పెనవేసుకు పోయాయి సంలేఖలో. దిలీప్ కాల్ కట్ చేసి రాగానే హస్విత వేడివేడి కాఫీ ఇచ్చింది. ముగ్గురు కాఫీ తాగుతూ సంలేఖ కథమీదనే మాట్లాడుకున్నారు. దిలీప్ కాల్ చేశాక తన కథను చదివే ఆ రోజు జయంత్ తమ ఊరు వచ్చివుంటాడు. దిలీప్ ని వెంటబెట్టుకుని హాస్పిటల్ కి కూడా వచ్చాడు. ఎంత ప్రయత్నించినా అతనితో మాట్లాడాలనిపించలేదు. ఆ తర్వాత జయంత్ గురించి హస్వితను అడిగితే బావుండదని అడగలేదు.
కానీ దిలీప్ ద్వారా “నేను సంలేఖను పెళ్ళి చేసుకుంటాను. వాళ్ల ఇంట్లో వాళ్లతో మాట్లాడు” అని చెప్పి పంపటం విని ఆశ్చర్యం కలిగింది. ఆ తర్వాత ఆలోచనలో పడిపోయింది.

ఒక్క కథ తన జీవితాన్నే మార్చేసింది. కానీ తన జీవితాన్నే ఓ కథలా చేసిన జయంత్ ని తన జీవితంలోకి ఎలా ఆహ్వానించాలి? అదే సందిగ్ధంలో వుండగా రాజారాం అన్నయ్య ఫోన్లోంచి వదిన జయంత్ తో మాట్లాడటం విని అదిరిపడింది సంలేఖ. అవతలవైపు నుండి అతనేం మాట్లాడుతున్నాడో విన్పించటంలేదు కాని తనని పెళ్లిచేసుకోటానికి మాత్రం చాలా ఉత్సాహపడుతున్నట్లుగా వుంది. వినీలకి, సంలేఖకి గోడమాత్రమే అడ్డుగా వుంది. అందుకే వినీల ఏం మాట్లాడినా సంలేఖకు స్పష్టంగా విన్పిస్తోంది.
కానీ వదిన అలా ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాక షాకింగ్ గా వుంది.

“చూడు జయంత్! నువ్వెవరో నాకు తెలియదు. నీ శ్రేయస్సు కోరి నీకోమాట చెబుతాను విను. నువ్వు సంలేఖను పెళ్లిచేసుకోవద్దు. ఎందుకంటే నిన్ను నేను హాస్పిటల్లో చూసినప్పుడు నువ్వు అందరిలా లేవు. చాలా క్రమశిక్షణతో ఎదిగిన మనిషిలా అన్పించావు. జీవితాన్ని నిర్లక్ష్యంగా తీసుకునేవాళ్లకి ఏం జరిగినా పర్వాలేదు కాని నీలాంటి వాళ్లకి చెడు జరగకూడదు. నీకు మంచి ఉద్యోగం, హోదా వున్నాయి. నిన్ను పెళ్లిచేసుకుంటే ఏ అమ్మాయి అయినా వాటిని సొంతం చేసుకుంటుంది. దర్జాగా అనుభవిస్తుంది. కానీ ఆ అమ్మాయితోపాటు నువ్వు కూడా సుఖపడాలి కదా! సంతోషంగా వుండాలి కదా! సంలేఖను చేసుకుంటే నువ్వలా వుండలేవేమో?” అంది వినీల.

అది విని బిత్తరపోయింది సంలేఖ. వదిన ఎందుకలా మాట్లాడుతుందో బొత్తిగా అంతుపట్టలేదు. “ఇది నేను సంలేఖను రోజూ చూస్తుంటాను కాబట్టి చెబుతున్నాను జయంత్! ఆమె ఎప్పుడు చూసినా చదువుకుంటూనో, రాసుకుంటూనో, తను రాసినదాన్ని డి.టి.పి చేయించుకుంటూనో, ప్రూఫులు దిద్దుకుంటూనో వుంటుంది. ఆ తర్వాత వాటిని ఏ పత్రికలకో, పబ్లిషర్స్ కో పంపుకుంటూ వుంటుంది. ఇదంతా ఆమె స్వయంగానే చేసుకుంటుంది. కనీసం ప్రూఫులు దిద్దేపని కూడా వేరేవాళ్లకి అప్పజెప్పదు. బహుశా తను రాసిన అక్షరాల్లో వత్తులు, కామాలు, ఫుల్ స్టాపులు తప్పిపోతే అర్థాలే మారిపోయి తన రచనలు వెనక్కి తిరిగి వస్తాయనేమో! దీన్నిబట్టి ఒక బిడ్డ ఈ భూమ్మీదకి రావాలంటే ఇద్దరు కలిసి కష్టపడితే, ఒక రచన బయటికి రావటానికి ఒక్కరే కష్టపడాలి. అలాంటి సంలేఖ నీకోసం తన టైంని ఎంతని కేటాయించగలదు? అసలు టైమంటూ వుంటేకదా నీకోసం కేటాయించటానికి? ఎప్పుడైనా చదవటం అనేది డిగ్రీలు చేతికి వచ్చేంత వరకే వుంటుంది. రచనలు చెయ్యటం అనేది చచ్చేంత వరకు వుంటుందట. ఎవరో చెబితే విన్నాను. అందుకే ఆలోచించమని చెబుతున్నాను” అంది.
ఆశ్చర్యంతో నోరు తెరిచింది సంలేఖ.

వదిన మరీ ఇంత ఘోరంగా మాట్లాడుతుందేమిటి? ఆడపడుచునన్న అభిమానం లేదు. మొహమాటం లేదు. ఒకప్పుడు అన్నయ్యకి పెళ్లయితే వదినలో అక్కనో , చెల్లెనో, స్నేహితురాలినో చూసుకోవచ్చనుకుంది. ఇప్పుడలా లేదు. తను అనుకున్నదానికి ఇప్పుడు చూస్తున్నదానికి చాలా తేడా వుంది? ఇదంతా తనకి జయంత్ తో పెళ్లికావటం ఇష్టం లేకనేగా? అతన్ని పెళ్లి చేసుకుంటే తన హోదా పెరిగి సిటీలో వుంటుందన్న అసూయతోనేగా?

మొన్న పక్కవూరు నుండి తనకో సంబంధం వస్తే “అబ్బాయి వూరుదాటి బయటకెళ్లడు. పొలం పనులు చేయించుకుంటూ వూల్లోనే వుంటాడు. ఇది చాలా మంచి సంబంధం సంలేఖకు” అంటూ సపోర్టుచేసి మాట్లాడింది.

(ఇంకా ఉంది )

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో