ప్రశ్న(కవిత )- సుధామురళి

 

 

 

 

 

 

నాదైన చోటుకోసం ఓ వెతుకులాట
కొండలు, కోనలు ఎక్కనక్కరలేని

దారుల్లో మనసులో

ఇంత చోటుకోసం తాపత్రయం.

లోయలు, గుహలు చుట్టూ

అవరించివున్న మైదానంలో

ఓ మిట్టమీద అడుగుకై ఆరాటం.

ఏది నేను కోల్పోయింది….

నాపై నా నమ్మకాన్నా!?

నేనంటూ ఎక్కడా మిగలలేదన్న నిజాన్నా!?

ఏది నాకు మిగిలింది…..

నాకంటూ ఓ జీవితం లేదన్న గొప్ప పాఠమా!?

నా నడకా ఏదో వేలి చివరతో ముడిపడివున్న

సహజాతిసహజ లక్షణమా!?

మీకో ప్రశ్న

మనసును ఇస్త్రీ చేసుకోని స్త్రీ ఎక్కడ కనిపిస్తుందో?

విరిగిన జీవితాన్ని నిత్యం సాపు చేసుకుంటూ

రోజు రోజూ చస్తూ పుట్టని ఆడజన్మ

ఎక్కడ దర్శనమిస్తుందో?

అంగుళ జాగా కోసం

ఇష్టాఇష్టాలను తనఖా పెట్టని ఇంతి

ఏ ఇంటిలో నివసిస్తోందో?

చెప్పగలరా

ఎవరైనా!?

ఎప్పటికైనా!?

-సుధామురళి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

One Response to ప్రశ్న(కవిత )- సుధామురళి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో