72రోజుల్లో భూ ప్రదక్షిణం చేసిన నెల్లీ బ్లై (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్

జననం:

ఎలిజబెత్ జేన్ కొక్రాన్ అనే పేరుతొ 1864 మే నెల 5 వ తేదీన అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్ బర్గ్ లోని ఆరం స్ట్రాంగ్ కౌంటి సమీపం లోని కొక్రెన్ మిల్స్ లో జన్మించిన ఎలిజబెత్ కొక్రెన్ సీమన్, నెల్లీ బ్లై అనే కలం పేరుతొ జగత్ ప్రసిద్ధమైంది .ప్రసిద్ధ రచయిత జూల్స్ వెర్న్ రాసిన 80 రోజుల్లో భూ ప్రదక్షిణం చదివి అందులోని’’ ఫిలియాస్ ఫాగ్’’ అనే పాత్ర లాగా తనూ భూ ప్రదక్షిణం చేయాలని కలలుకని, సాధించింది .పరిశోధనాత్మక జర్నలిస్ట్ గా ప్రపంచ ప్రసిద్ధి పొందింది .తండ్రి మైకేల్ కొక్రెన్ మిల్లు లో కార్మికుడు గా జీవితం ప్రారంభించి ,క్రమంగా ఆమిల్లు యజమాని అయి ,చుట్టు ప్రక్కల స్థలాలు కొని ఫారం హౌస్ ఏర్పాటు చేసుకొన్నాడు .తర్వాత వ్యాపార వేత్తగా ,పోస్ట్ మాన్ గా ,కొక్రెన్ మిల్స్ అసోసియేట్ జస్టిస్ గా ఎదిగాడు .మొదటి భార్యకు 10మంది ,రెండవ భార్య మేరీ జేన్ కెన్నేడికి మన హీరోయిన్ ఎలిజబెత్ తో సహా 5గురు సంతానం .ఎలిజబెత్ ఆరవ యేటనే తండ్రి చనిపోయాడు .

పింకీ –కొక్రెన్-రచనకు శ్రీకారం –నెల్లీ బ్లై:

పింక్ బట్టలు కట్టటం తో ఎలిజబెత్ ను’’ పింకీ’’ అని పిలిచేవారు .యవ్వనం లో తన ఇంటి పేరును కొక్రెన్ గా మార్చుకొంది.1879లో నార్మల్ స్కూల్ లో చేరి ఒక టర్మ్ మాత్రమె చదివి డబ్బులేక మానేసి౦ది .1880లో కుటుంబాన్ని తల్లి పిట్స్ బర్గ్ కు మార్చింది .’’పిట్స్ బర్గ్ డిస్పాచ్’’ పేపర్ కు ఆడపిల్లలు దేనికి సరిపోతారు అనే వ్యాసాన్ని ‘’లోన్లీ ఆర్ఫాన్ గర్ల్ ‘’అనే మారు పేరుతొ రాస్తే ,ఎడిటర్ జార్జ్ మాడెన్ చదివి సంతోషించి అసలు పేరు తెలియజేయమని కోరగా ,అలానే తనను తానూ పరిచయం చేసుకొన్నది .తనకాలం పేరుతోనే ఆ పత్రికకు మరో వ్యాసం రాస్తానని నచ్చ చెప్పి రాసి పంపించింది .మొదటి వ్యాసం ‘’ది గర్ల్ పజిల్ ‘’లో విడాకుల వలన స్త్రీలకు ఏర్పడే సమస్యలపై చర్చించి రాసింది .ఆమె రచనలోని సృజనను మెచ్చి ఎడిటర్ ఆమెకు పూర్తికాలం ఉద్యోగం ఇచ్చాడు .ఆకాలం లో ఆడవాళ్ళు మారుపేరుతోనే రాయటం పరిపాటుగా ఉండేది.స్టీఫెన్ ఫాస్టర్ రాసిన ప్రసిద్ధమైన ఒకపాట లోని పాత్ర’’ నెల్లీ బ్లై’’ఈమెకు తగిన పేరు అని ఎడిటర్ మాడిసన్ సూచించి ఖాయం చేశాడు .

పిట్స్ బర్గ్ డిస్పాచ్ పేపర్ లో పని చేస్తూ నెల్లీ బ్లై,వివిధ రంగాలలో పని చేస్తున్న స్త్రీల సమస్యలపై విస్తృతంగా పరిశోదనాత్మకం గా రాసింది .కానీ ఫాక్టరీ యజమానులు తీవ్ర అభ్యంతరాలు తెలియ జేయటం తో ,స్త్రీల పేజీలలో ఫాషన్ ,సమాజం ,గార్డెనింగ్ మొదలైన విషయాలపై రాసింది .కానీ ఎందుకో చాలా అసంతృప్తికి లోనైంది .అప్పటికి ఇంకా 21 ఏళ్ళు మాత్రమే ఉన్నా , తాను మిగిలిన బాలికలకంటే ప్రత్యేకం గా ఏదో సాధించాలి అనే నిర్ణయానికి వచ్చింది .ఫారిన్ కరెస్పా౦డెంట్ గా మెక్సికోకు వెళ్లి ,ఆరు నెలలు ఉండి,అక్కడి ప్రజల ఆచార వ్యవహారాలపై విస్తృతమైన రచన చేసింది. ఆవ్యాసాలన్నీ ‘’సిక్స్ మంత్స్ ఇన్ మెక్సి కో ‘’పుస్తకంగా ప్రచురించింది .అప్పుడే ప్రభుత్వాన్ని విమర్శించినందుకు ఒక మెక్సికన్ జర్నలిస్ట్ ను అరెస్ట్ చేసినందుకు నిరసన వ్యక్తం చేసింది .పోర్ఫియో డయాజ్ నియంతృత్వాన్నిచీల్చి చెండాడింది .మెక్సికన్ ప్రభుత్వాధికారులు ఆమెను అరెస్ట్ చేస్తామని బెదిరించి ,దేశం విడిచి పోయేట్లు ఒత్తిడి తెచ్చింది .సురక్షితంగా స్వదేశం చేరి డయాజ్ ను క్రూర నియంత గా ,అపర జార్ చక్రవర్తిగా ,మెక్సికన్ ప్రజల హక్కులను అణచి వేస్తున్నరాక్షసుడి గా ,పత్రికా స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నకాలయముడిగా తీవ్రంగా నిరసన తెలిపింది . .

పులిట్జర్ పత్రిక లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ,స్టంట్ గర్ల్ జర్నలిస్ట్:

పత్రికకు నాటకాలు, కళలపై రాసే పని ఎక్కువై పోయినందున ,నెల్లీ బ్లై1887లో పిట్స్ బర్గ్ డిస్పాచ్ ను వదిలేసి, న్యూయార్క్ చేరింది .ఏ పత్రికలోనూ ఉద్యోగం ఇవ్వలేదు నాలుగు నెలలు చేతిలో పెన్నీ లేకుండా దుర్భర దారిద్ర్యం, వేదన అనుభవించింది .తర్వాత జోసెఫ్ పులిట్జర్ పత్రిక ‘’న్యు యార్క్ వరల్డ్ ‘’లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా చేరింది ,ఇప్పుడు రూజ్ వెళ్ట్ ఐలాండ్ గా పిలువబడుతున్న బ్లాక్ వెల్స్ ఐలాండ్ లోని ‘’ఉమెన్స్ లునటిక్ అసిలియం ‘’లోని స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను ,దౌష్ట్యాన్నికళ్ళకు కట్టినట్లు రాసింది .ఆ ఆశ్రమ లో ప్రవేశించటం అంత తేలికైన పనికాదు .తెలివిగా టెంపరరి హోమ్స్ ఫర్ ఫిమేల్స్ లో చేరి ,రాత్రిళ్ళు ఆశ్రమం లో మతి స్థిమితం లేని స్త్రీలపై జరిగే అన్యాయాలను కళ్ళారా చూసి ,ఒక పోలీస్ ఆఫీసర్, ఒక జడ్జి ,ఒక డాక్టర్ తోకలిసి ఆశ్రమానికి వెళ్లి ,10రోజులు బాగా పరిశీలించి స్త్రీమానసిక రోగుల దయనీయ స్థితిగతులపై పూర్తి సమాచారం సేకరించి,విలువైన వ్యాసాలు రాసి ,తర్వాత ‘’ది టెన్ డేస్ ఇన్ ఎ మాడ్ హౌస్ ‘’పుస్తకంగా ప్రచురించింది .ఆశ్రమం లో జరగాల్సిన సంస్కరణలు ,కల్పించాల్సిన వసతులు వగైరాలను మొహమాటం లేకుండా అందులో చర్చించి అందరి అభిమానం సంపాదించింది నెల్లీ బ్లై.అమెరిక మహిళా సంస్కృతిపై గొప్ప ప్రభావం చూపించింది .ఆ ఆశ్రమ పరిధి దాటి స్త్రీల విషయమై సానుభూతి చూపుతూ ‘’స్టంట్ గర్ల్ జర్నలిజం ‘’కు నాంది పలికి మార్గదర్శి అయింది నెల్లీ .1893నాటికి నెల్లీ బ్లై ఒక సెలెబ్రిటి అయింది .మతిస్థిమితం లేని స్త్రీ రోగులపాలిటి దేవత అనిపించుకొన్నది .

ప్రపంచ ప్రదక్షిణ కోరిక ,తీర్చుకొన్న వైనం ,ప్రపంచ రికార్డ్ స్థాపన:

న్యూయార్క్ వరల్డ్ సంపాదకుడికి బ్లై 1884లో 1873లో ‘’అరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 డేస్’’అనే కాల్పనిక నవల లోని యదార్ధ విషయాలను తెలుసుకోవటానికి తాను మొట్టమొదటిసారిగా ప్రపంచ పర్యటన చేబడుతానని చెప్పి ,ఒక ఏడాది తర్వాత 14-11-1889న ఉదయం 9-40 గం .లకు రెండు రోజులు ముందుగా నోటీస్ ఇచ్చి బయల్దేరింది .హాంబర్గ్ అమెరికా లైన్ కు చెందిన ఆగస్టా విక్టోరియా స్టీమర్ ఎక్కి ,40,070కిలోమీటర్ల ప్రయాణం ప్రారంభించింది .వేసుకొన్న డ్రెస్ ,ఒక స్టడీఓవర్ కోట్,కొన్ని అండర్ వేర్ లు ,టాయ్ లెట్రి సామాను మాత్రమే ,ఒక చిన్న ట్రావెల్ బాగ్ లో సర్దుకొని వెంట తీసుకు వెళ్ళింది .ఇంగ్లిష్ బాంక్ నుంచి తీసుకొన్న 200పౌండ్ల నోట్లు ,కొంత బంగారం ,కొంత అమెరికన్ కరెన్సీ మాత్రమే ఒక చిన్న బాగ్ లో పెట్టుకొని దాన్ని మెడకు కట్టుకొని బయల్దేరింది .

న్యూయార్క్ పేపర్ ‘’కాస్మోపాలిటన్’’ ఒక రిపోర్టర్ ఎలిజబెత్ బిస్లాండ్ ను స్పాన్సర్ చేసి నెల్లీ బ్లై వెంట పంపింది .ఫిలియాస్ ఫాగ్ కంటే తక్కువ కాలం లో ఈ పర్యటన పూర్తి చేయాలని వీరిద్దరూ భావించి అతడు వెళ్ళిన దానికి వ్యతిరేక దిశలో ,అతడు ప్రారంభించిన రోజునే బయల్దేరారు .హాంగ్ కాంగ్ కు చేరేదాకా బిస్లాండ్ ప్రయాణం లోని ఆంతర్యం గురించి నెల్లీ కి తెలియదు .ఈ నీచ పోటీ ని ఆమె అసహ్యించుకొని ‘’నేను పోటీ పడను .ఎవరైనా పోటీ పడాలనుకొంటే అది వారి ఇష్టం ‘’అని తేల్చి చెప్పింది.న్యూయార్క్ వరల్డ్ పత్రిక ఉత్కంఠ కలిగించటానికి ‘’నెల్లీ గ్లై గెస్సింగ్ మాచ్ ‘’ఏర్పాటు చేసి, ఆమె తిరిగి వచ్చే సమయాన్ని ఊహించి సెకండ్లతో సహా ఖచ్చితంగా చెప్పినవారికి ‘’గ్రాండ్ ప్రైజ్ ‘’ను ,ముందుగా యూరప్ ట్రిప్ ను, తర్వాత దానికి అయ్యే ఖర్చు భరిస్తామని ప్రకటించింది .

ప్రపంచ ప్రదక్షిణ యాత్రలో నెల్లీ బ్లై,ఇంగ్లాండ్ ,ఫ్రాన్స్ లమీదుగా వెడుతూ, అమెరికాలో జూల్స్ వెర్న్ ను కలిసి ,బ్రిండిసి,సూయజ్ కెనాల్ ,కొలంబో ,సింగపూర్, హాంగ్ కాంగ్ ,జపాన్ ల మీదుగా ప్రయాణం చేసింది .సబ్ మెరీన్ కేబుల్ నెట్ వర్క్ ,ఎలెక్ట్రిక్ టెలిగ్రాఫ్ లద్వారా ఎప్పటికప్పుడు తన ప్రయాణ పురోగతిని చిన్న చిన్న పేరాలుగా రాసి పంపేది.పెద్ద వ్యాసాలను పోస్ట్ ద్వారా పంపేది .ఇవి పత్రికకు ఆలస్యంగా చేరేవి .స్టీం షిప్ లు, రైల్ రోడ్ ప్రయాణం కొంత ఇబ్బంది కలిగించేవి .చైనాలో లెపర్ కాలని సందర్శించింది .సింగపూర్ లో కోతి పిల్లను కొన్నది .ఫసిఫిక్ సముద్రం దాటుతుంటే వాతావరణం అనుకూలించక ఇబ్బంది పడింది .సాన్ ఫ్రాన్సిస్కో కు ‘’వైట్ స్టార్ లైన్ కు చెందిన ‘’ఓషియానికి షిప్ ‘’‘’పై ప్రయాణించి ,జనవరి 21న అనుకొన్నదానికంటే రెండు రోజులు ముందుగానే చేరింది .న్యూయార్క్ వరల్డ్ పత్రిక ఎడిటర్ పులిట్జర్ ఒక ప్రైవేట్ ట్రెయిన్ ను స్పాన్సర్ చేయగా ,తాను బయల్దేరిన న్యు జెర్సీకి 25-1-1890 మధ్యాహ్నం 3-51 కి చేరుకొన్నది . హోబోకేన్ లో బయల్దేరిన కేవలం 72 రోజుల్లోనే నెల్లీ బ్లై తన పరపంచ ప్రదక్షణ పూర్తి చేసి,ప్రపంచ రికార్డ్ నెలకొల్పి,న్యూయార్క్ చేరింది .భూగోళాన్ని దాదాపు ఒంటరిగా చుట్టి వచ్చిన ధీర వనితగా గుర్తింపు పొంది ధైర్య సాహసాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది నెల్లీ..ఈమెతో బయల్దేరిన బిస్లాండ్ న్యూయార్క్ కు నెల్లీ చేరిన నాలుగున్నర రోజుల తర్వాత చేరింది .నెల్లీ న్యూయార్క్ చేరే సమయానికి ,ఆమె అట్లాంటిక్ సముద్రం తో కుస్తీ పడుతోంది .నెల్లీ బ్లై ప్రపంచ పర్యటన చరిత్రలో ఒక ప్రపంచ రికార్డ్ గా నిలిచిపోయింది..

నవలా రచయిత్రి:

ప్రపంచ ప్రదక్షిణ యాత్ర పూర్తవగానే బ్లై ,రిపోర్టింగ్ కు గుడ్బై చెప్పి ,’’న్యూయార్క్ ఫామిలీ స్టోరీ పేపర్’’ కు సీరియల్ నవలలు రాయటం మొదలు పెట్టి౦ది.ఈవా హామిల్టన్ నిజజీవితగాథ ను ‘’ఈవా ది అడ్వెంచరెస్’’పేరుతొ రాయగా, ఆమె న్యూయార్క్ కు తిరిగి వచ్చేసమయానికి అది పుస్తకంగా ముద్రణ పొందింది .1889నుంచి 1995 వరకు 11నవలలు రాసింది .కొన్ని పేజీలుమాత్రమే లభించిన ఈ నవలలు 2021 వరకు కాలగర్భం లో కలిసిపోయాయని అందరూ భావించారు .రచయిత డేవిడ్ బ్లిక్స్ట్ ఆ నవలలు సజీవంగా ఉన్నాయని ప్రకటించి లోకానికి ఊరట కలిగించాడు .నవలలు రాస్తూనే, మళ్ళీ 1893లో వరల్డ్ పత్రికకు రిపోర్టర్ గా పని చేసింది .

వివాహం ,ఆదర్శ మహిళా పారిశ్రామిక వేత్త ,పేటెంట్ లు:

1895లో కోటీశ్వరుడైన73ఏళ్ళ రాబర్ట్ సీమన్ ను, బ్లై తన 31వ ఏట పెళ్ళాడింది .భర్త అనారోగ్యం వలన రిపోర్టర్ పని మానేసి ,మిల్క్ కాన్స్, బాయిలర్స్ ఉత్పత్తి చేసే అతని ‘’ఐరన్ క్లాడ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ’’ నిర్వహణ చేబట్టి సమర్ధవంతంగా నిర్వహించింది .1904లో భర్త సీమన్ చనిపోగా ,కంపెనీని మోడల్ సోషల్ వెల్ఫేర్ గా , పనివారి ఆరోగ్యం ,వినోద సౌకర్యాలు కలిపించింది .కానీ ఆర్ధిక స్థితి గతులు తెలియక పోవటం చేత ,అంతాపోగొట్టుకొని,ఆర్ధిక లావా దేవీ చిక్కుల్లో ,పడి దివాలా తీసింది .1904లో ఆ కంపెనీ 55గాలన్ల స్టీల్ డ్రమ్ములను ఉత్పత్తి ప్రారంభించి ఆదర్శంగా నిలిచింది .అమెరికాలో ఇప్పటికీ అవే డ్రమ్ములను ఉపయోగిస్తారు .ఈ కంటైనర్ నిర్మాణపు ఆలోచన ‘’బ్లై’’ దే అని అందరూ గట్టిగా నమ్ముతారు కాని, పేటెంట్ హెన్రి వేహ్రాన్ కు దక్కింది .కానీ నెల్లీ బ్లై- యు ఎస్ పేటెంట్ 697,553 లను తన సృజనాత్మక మిల్క్ కాన్ నిర్మాణానికి ,యు.యెస్.పేటెంట్ ,703,711లను స్టాకింగ్ గార్బేజ్ కాన్ నిర్మాణానికి ‘’ఎలిజబెత్ కొక్రెన్ సీమన్’’ పేరుమీద పొందింది .ఆకాలం లో ఆమె అమెరికాలో’’ లీడింగ్ వుమన్ ఇండ స్ట్రియలిస్ట్ ‘’గా గుర్తింపు పొందింది .కాని ఆమె నిర్లక్ష్యం ,ఫాక్టరీ మేనేజర్ అవకతవకల వలన ఆ కంపెనీ దివాలాకు దారి తీసింది .

తొలి వార్ జర్నలిస్ట్:

ధైర్యం తో మళ్ళీ రిపోర్టర్ గా పని చేస్తూ మొదటి ప్రపంచ యుద్ధం లో యూరప్ ఈస్టర్న్ ఫ్రంట్ లోని కథలు రాసి పేరు పొందింది ..యుద్ధకాలం లో సెర్బియా,ఆస్ట్రియా లలోని యుద్ధ జోన్ లో పర్యటించిన మొదటి మహిళ గా ,విదేశీయురాలిగా గుర్తింపు పొందింది .అజాగ్రత్త వలన బ్రిటిష్ స్పై కి చిక్కి,అరెస్ట్ అయింది.

మహిళా వోటుహక్కు ఉద్యమ రిపోర్టర్:

న్యూయార్క్ ఈవెనింగ్ జర్నల్ కు 1913లో జరిగిన ‘’మహిళా వోటుహక్కు ఉద్యమం ‘’ను ప్రత్యక్షంగా చూసి రిపోర్ట్ రాసింది .ఈ వ్యాసాలకు ‘’ సఫ్రేజిస్ట్స్ ఆర్ మెన్స్ సపోర్టర్స్’’అని శీర్షిక పెట్టింది .ఆ వ్యాసాలలో అమెరికాలో ఆడవారికి వోటు హక్కు 1920 లోపు ఇవ్వబడుతుందని ముందే ఊహించి రాసింది .

తిరిగిరాని లోకాలకు ప్రయాణం:

1922జనవరి 27న ప్రపంచ ప్రదక్షిణ చేసిన సాహసవనిత ,నవలారచయిత ,పత్రికా రిపోర్టర్,మహిళా పారిశ్రామిక వేత్త ,పేటెంట్ హక్కులు పొందిన నెల్లీ బ్లై న్యూయార్క్ సిటి లోని సెయింట్ మార్క్స్ హాస్పిటల్ లో 57వ ఏట మరణించింది .న్యూయార్క్ లోని వుడ్లాండ్ సెమిటరి లో ఖననం చేశారు .

రచనా సర్వస్వం:

1-టెన్ డేస్ ఇన్ ఎ మాడ్ హౌస్ 2-సిక్స్ మంత్స్ ఇన్ మెక్సికో 3-ది మిస్టరి ఆఫ్ సెంట్రల్ పార్క్ –న్యూయార్క్ 4-అరౌండ్ ది వరల్డ్ ఇన్ సెవెంటి టు డేస్.

నవలలు :

ఈవా ది అడ్వెంచరెస్,న్యు యార్క్ బై నైట్ ,ఆల్టా లిన్,వైన్స్ ఫైత్ఫుల్ స్వీట్ హార్ట్ ,లిటిల్ లుకీ ఆర్ ప్లేయింగ్ ఫర్ హార్ట్స్ ,డాలీ ది లూకెట్టీ,ఇన్ లవ్ విత్ ఎ స్త్రేన్జ్ ఆర్ థ్రు ఫైర్ అండ్ వాటర్ టు విన్ హిం ,ది లవ్ ఆఫ్ త్రీ గర్ల్స్ ,లిటిల్ పెన్నీ చైల్డ్ ఆఫ్ ది స్ట్రీట్ ,పెట్టీ మెర్రిబెల్లీ ,ట్విన్స్ అండ్ రైవల్స్ .

గుర్తింపు ,అవార్డ్ లు:

నెల్లీ బ్లై చేసిన సాహసయాత్ర ,రచనలకు1998లో ‘’నేషనల్ వుమెన్స్ హాల్ ఆఫ్ ఫేం’’ ఆమె పేరు చేర్చారు .అమెరికా ప్రభుత్వం ఆమె గౌరవార్ధం నాలుగుసార్లు పోస్టేజ్ స్టాంప్ విడుదల చేసింది .అమండా మాథ్యూస్’’ది గర్ల్ పజ్జీ ప్రైజ్ ‘’ను 16-10-2019న ప్రకటించాడు .నెల్లీ బ్లై కబ్ రిపోర్టర్ జర్నలిజం అవార్డ్ ‘’ను న్యూయార్క్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసింది .1946లో బ్రాడ్వే మ్యూజికల్ నెల్లీ బ్లై అనే ప్రదర్శన 16సార్లు నిర్వహించారు .’’డిడ్ యు లై నెల్లీ బ్లై అనే నాటకాన్ని లిన్ స్క్రిక్తైట్ రాసి, ప్రదర్శించాడు .ఆమె జీవితం పై టివి షోలు, సినిమాలు తీశారు. ప్రజా హృదయం లో నెల్లీ బ్లై సుస్థిర స్థానం సంపాదించింది .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో