నజరానా ఉర్దూ కవితలు – అనువాదం ఎండ్లూరి సుధాకర్

ఆ పూబోడి సోయగాన్ని
చూస్తుంటే ఎంత విచిత్రం ?
ప్రాభాత సమీర స్పర్శకే సుమా !
ఆ సుమగాత్రి అయ్యింది కలుషితం

-ఈషా

నాలో నేనే ఉంటున్నాను
నీ కోసమే పరితపిస్తుంటాను
దినమంతా నీ వీధిలో పడి
దుఃఖపు రాళ్ళను ఏరుకుంటున్నాను

-నాసిర్ కాజ్మీ 

చేతులెత్తి ఒళ్లు కూడా 

విరుచుకోలేక పోయింది 

నన్ను చూడగానే నవ్వి 

అమాంతం హస్తాల దించేసింది 

        -నిజాం రాం పురీ 

కలుసుకుందాం ! అనే మాట 

అలవోకగా అనేసింది 

ఎక్కడ ? అని అడిగే సరికి 

‘కలలో’ అంటూ కదిలిపోయింది 

         – అమీర్ మీనాయీ 

– అనువాదం ఎండ్లూరి సుధాకర్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో