సంఘ సంస్కర్త ,సంగీతనాటక అకాడెమి నిర్వాహకురాలు – పద్మ విభూషణ్ కమలాదేవి చటో పాధ్యాయ – గబ్బిట దుర్గాప్రసాద్


బాల్యం ,విద్య:

1903 ఏప్రిల్ 3 న కర్ణాటక లోని మంగుళూరు లో కమలాదేవి జన్మించింది .తండ్రి అనంతయ్యధరేశ్వర్ మంగుళూరు జిల్లా కలెక్టర్ .తల్లి గిరిజా బాయ్ కర్ణాటక తీరప్రాంత ఛత్రపూర్ సారస్వత భూస్వామ్య బ్రాహ్మణ కుటుంబానికి చెందింది .కమలకు తల్లి లక్షణాలు వారసత్వం గా లభించాయి .నాయనమ్మ పురాణ ఇతిహాసాలలో అసాధారణ పాండిత్యం కలది .తల్లి గిరిజా బాయ్ ఇంటి వద్దనే ట్యూటర్ల వద్ద విద్య నేర్చింది .తలిదండ్రుల విశిష్ట లక్షణాలు కమలాదేవిని తీర్చి దిద్దాయి .బాల్యం నుంచే అరుదైన ధైర్య సాహసాలు ,తెలివి తేటలు ప్రదర్శించి కమల మిగిలినవారి కన్నా భిన్నంగా ఉండేది .ఆనాటి దేశభక్తులైన మహా దేవ గోవింద రానడే ,గోపాలకృష్ణ గోఖలే ,రమా బాయ్ రానడే , అనీబిసెంట్ వంటి వారితో వీరి కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉండేది .అందుకే కమలా దేవికి యవ్వనం లోనే స్వదేశీ ఉద్యమం పై గొప్ప ఆసక్తి కలిగింది .కేరళలోని ప్రాచీన నాటక సంప్రదాయ౦ కుటియాట్ట౦ ను గురువు పద్మశ్రీ మణిమాధవ చాక్యార్ వద్ద ,గురుకులం తిరుక్కురు స్సిమంగళం లోనే ఉంటూ అభ్యసించింది. అత్యంత స్నేహితురాలుగా ఉండే పెద్దక్క సగుణ వివాహమైన కొద్దికాలానికే ,మరణించటం ,తండ్రి కూడా ఆమె ఏడవ ఏట నే చనిపోవటంతో, కమలాదేవి తట్టుకోలేక పోయింది . దీనికి తోడు అంతులేని తన ఆస్తికి వీలునామా రాయకుండానే తండ్రి చనిపోవటం తో ,యావదాస్తి ,బాబాయికొడుకుకు చట్టప్రకారం దక్కి, వీళ్ళకు నెలనెలా పించను మాత్రమె దక్కితే ,తల్లి గిరిజాదేవి, ఆ దయా ధర్మ భిక్షం తిరస్కరించి, స్వయంగా తన కట్నకానుకలతో కూతుళ్ళను పోషించాలని నిర్ణయించింది . చిన్నారి కమల భూస్వామ్య లక్షణాలను తిరస్కరిస్తూ ఇంట్లోని నౌకర్లు చాకర్లతో కలసి మెలసి మెలిగేది .ఇదే ఆమెను గొప్ప స్వాతంత్ర్య సమరయోధురాలిని చేసింది .

వివాహం వైధవ్యం:

కమలాదేవికి 14వ ఏట 1947లో వివాహం జరిగింది .కాని భర్త రెండేళ్లకే చనిపోవటం తో వైధవ్యం ప్రాప్తించింది .మద్రాస్ లో క్వీన్ మేరీస్ కాలేజిలో చేరి ,అక్కడ భారత కోకిల సరోజినీ నాయుడు చిన్న చెల్లెలు సుహాసిని చటోపాధ్యాయ తో పరిచయం కలిగి ,తన అన్నమహా మేధావి హరీంద్ర నాధ చటోపాధ్యాయకు కమలాదేవిని పరిచయం చేసింది.ఈ ఇద్దరూ కళారాధకులవటం వలన బాగా దగ్గరయ్యారు .కమల తన 20వఏట హరీన్ ను పెళ్ళాడింది .ఆనాటి సంఘం విధవా పునర్వివాహాన్ని అంగీకరించక అభ్యంతరం చెప్పింది. అయినా ధైర్యంగా పెళ్ళాడారు .నవ దంపతులకు ఏడాది తిరగాగానే రామ అనే కొడుకు పుట్టాడు

నటన:

.సంఘాన్ని యెదిర్చి కమలా హరీన్ దంపతులు కొత్త ఆలోచనలతో నాటకాలు,స్కిట్స్ రాసి ప్రదర్శించేవారు .అప్పటికి ఇంకా స్త్రీలు సినిమాలలో నటించటానికి భయపడేవారు .కాని కమల కొన్ని సినిమాలలోనూ నటించింది .1931లో శూద్రకమహాకవి రాసిన మృచ్చ కటిక మూకీ సినిమాలో లో వసంత సేనగా ,ఏనాక్షి రామారావు హీరో తో ప్రముఖ కన్నడ దర్శకుడు మోహన్ దయారాం భవాని దర్శకత్వం లో నటించింది .1943లో హిందీ సినిమా తాన్సేన్ లో ప్రముఖ గాయకుడు కె.ఎల్. సైగల్ ,ఖుర్షీద్ లతోనూ ,శంకర్ –పార్వతి లోనూ 1945 లో ధన్నా భగత్ మూకీ లలో కమలాదేవి చటోపాధ్యాయ నటించింది .చాలా ఏళ్ళ తర్వాత పరస్పర అంగీకారంతో భర్తనుంచి విడాకులు పొంది మళ్ళీ సంఘం లో సంచలనం రేపింది .

లండన్ జీవితం:

హరీన్ తో పెళ్లి అయిన కొద్దికాలానికే ,హరీన్ లండన్ వెడితే ,కొన్ని నెలలతర్వాత కమల కూడా వెళ్లి ,లండన్ యూని వర్సిటి లోని బెడ్ ఫోర్డ్ కాలేజిలో చేరి ,సోషియాలజీలో డిప్లమా పొందింది .

భారత స్వాతంత్ర్య సమరం:

లండన్ లో ఉండగానే 1923 లో మహాత్ముని సహాయ నిరాకరణ ఉద్యమం వార్త తెలిసి ,ఇండియాకు తిరిగి వచ్చేసి ,గాంధీజీ సేవాదళం లో చేరి మహిళాభ్యుదయానికి కృషి చేసింది .ఆమె సేవాదళం స్త్రీ విభాగానికి నాయకురాలైంది .దేశమంతటిలోని యువతులకు స్పూర్తి కలిగించి సేవాదళ సభ్యులుగా అంటే సేవికలు గా చేర్పించి గొప్ప శిక్షణనిచ్చి, తర్ఫీదు చేసింది .1926లో అఖిలభారత మహిళా సంఘ సంస్థాపకురాలు మార్గరెట్ కజిన్స్ ను కలిసి ,ఆమె ప్రోద్బలంతో మద్రాస్ ప్రాంతీయ శాసన సభకు శాసన సభ్యురాలిగా పోటీ చేసి, దేశంలోనే శాసనసభకు పోటీ చేసిన మొదటి మహిళ గా రికార్డ్ సృష్టించింది .కానీ 55వోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయింది .

అఖిలభారతీయ మహిళా సంఘం కార్యదర్శి:

AIWC అంటే అఖిలభారతీయ మహిళా సంఘానికి కమలాదేవి సంస్థాపక సభ్యురాలై,వెంటనే మొదటి కార్యనిర్వాహక కార్యదర్శి అయింది .ఆమె నాయకత్వం లో ఆ సంస్థ దేశ మంతటా శాఖోపశాఖలుగా విస్తరిల్లి అనేక అభ్యుదయ కార్యక్రమాలు చేబట్టి మహిళాచైతన్యం తెచ్చింది .శాసనసభ సంస్కణలకూ మార్గదర్శనం చేసింది .ఆమె పదవీకాలం లో అనేక యూరోపియన్ దేశాలు పర్యటించి అక్కడి మహిళాభ్యుదయ కార్యక్రమాలు అధ్యయనం చేసి ,ఇండియాలోకూడా అమలు చేయించి మహిళల చే నిర్వహింపబడే విద్యా సంస్థల స్థాపనకూ అంకురార్పణ చేసిన ముందుచూపు ఉన్న మార్గదర్శకురాలు కమలాదేవి .అంతే కాదు దేశం లోనే మొట్టమొదటి హోం సైన్స్ కాలేజీ గా న్యు ఢిల్లీ లో’’ లేడీఇర్విన్ కాలేజి’’స్థాపించింది .

ఉద్యమనాయకత్వం:

1930లో గాంధీ నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ సంఘం లో ని ఏడుగురిలో కమలాదేవి కూడా ఒకరై ఉండటం మహిళలకు గర్వకారణం .బొంబాయి సముద్ర తీరం లో ఉప్పు తయారు చేసిన మొట్టమొదటి స్త్రీరత్నం కమలాదేవి చట్టోపాధ్యాయ. ఆమెకు సహాయం గా నిలిచిన మరో ధీరవనిత అవంతికా బాయ్ గోఖలే . 1940లో మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమైనప్పుడు కమలాదేవి లండన్ లో ఉంది .అక్కడ నుంచి ప్రపంచ దేశాల పర్యటన చేసి భారత దేశానికిస్వాతంత్ర్యం యెంత అవసరమో అందరికీ తెలియజేసి బాసటగా నిలిచింది .యుద్ధం ముగిశాక పోరాటం తీవ్రతరం చేసింది .

స్వాతంత్ర్యానంతర సేవలు:

భారత దేశంస్వాతంత్ర్యం సాధించినా దేశ౦ ఇండియా ,పాకిస్తాన్ గా విడిపోవటం ,శరణార్ధుల ను ఆదుకోవాల్సిన అవసరం కలిగి, కమల వెంటనే కార్య రంగం లో దిగి’’ఇండియన్ కోఆపరేటివ్ యూనియన్ ‘’స్థాపించి శరణార్ధులను పెద్ద ఎత్తున ఆదుకొన్నది .శరణార్ధుల ఆవాసానికి టౌన్షిప్ను కో ఆపరేటివ్ తోడ్పాటుతో ఏర్పాటు చేసింది .ఎట్టకేలకు ప్రధాని నెహ్రూ ఒప్పుకొని,ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కోరరాదనిమెలికలతో షరతు పెట్టాడు .ఎంతో శ్రమతో ఢిల్లీ బయట ఫరీదాబాద్ లో దేశ వాయవ్య సరిహద్దు నుంచి వచ్చిన 50వేలమంది శరణార్ధులకు ఆవాసం కల్పించిన ధీరోదాత్త మహిళ కమలా దేవి .అక్కడ వారికి ఇళ్ళుకట్టుకోవటానికి ఉద్యోగ , వృత్తులకు,ఆరోగ్యానికి క్షణం తీరికలేకుండా సహాయ పడి వెన్నంటి ఉంది .

కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం:

శరణార్ధుల పునరావాసం తోపాటు వారు పోగొట్టుకొన్న కుటీర ,చేతి వృత్తులకు ప్రోత్సాహం కలిగించి మళ్ళీ వారిలో ఆత్మ స్థైర్యాన్ని నింపి, భారతీయ కళలకు విశ్వ వ్యాప్త కీర్తి ప్రతిష్టల వ్యాప్తికి కారణమైంది .స్వాతంత్ర్యానంతర దేశ పురోగతిలో ఇదొక మైలురాయిగా నిలిచింది .

కళా సాంస్కృతిక రంగ సేవ:

భారతదేశ అభి వృద్ధికోసం ఉత్పత్తులను భారిగా పెంచటానికి ప్రధాని నెహ్రు యాంత్రీకరణ ప్రవేశ పెడుతుండటం కమలాదేవిని కలచి వేసి ,దానివలన భారతీయ కళా సాంస్కృతిక రంగాలకు సంప్రదాయ కటీర, చేతి వృత్తుల వారికీ ,అసంఘటిత వ్యవస్థలోని స్త్రీలకూ గొప్ప విఘాతం కలుగుతుందని గ్రహించింది.దీనికి విరుగుడుగా ప్రత్యామ్నాయం గా వరుసగా అనేక క్రాఫ్ట్ మ్యూజియం లు ,భారతీయ సంప్రదాయ కళ ,వృత్తులకుప్రాచీన భాండాగారాలు (ఆర్కైవ్స్ ) శిక్షణకు నిపుణుల ఏర్పాటు పెద్ద ఎత్తున నెలకొల్పింది .వీటితోపాటు ఢిల్లీ లో’’ థియేటర్ క్రాఫ్ట్స్ మ్యూజియం ‘’ఏర్పాటు చేసింది . హస్తకళాకారుల కు ప్రోత్సాహంగా జాతీయ పురస్కారాలు ఏర్పరచింది .దేశ వ్యాప్తంగా’’ సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియం’’ లను స్థాపించింది .

నాట్య విద్యాలయ స్థాపన:

బెంగుళూరులో కమలాదేవి 1964లో’’ కథక్ నాట్య ,కోరియోగ్రఫీ’’సంస్థను భారతీయ నాట్య సంఘం కు ఆధ్వర్యం లో నెలకొల్పి ప్రసిద్ధ నాట్య శిరోమణి మాయారావు ను డైరెక్టర్ ను చేసింది .

కాలానికంటే ముందుగా ఆలోచించే నేర్పున్న చటోపాధ్యాయ ‘’ఆల్ ఇండియా హాండి క్రాఫ్ట్స్ బోర్డ్ ‘’ఏర్పరచి ,మొదటి చైర్మన్ గా అందరి ప్రోద్బలం తో ఎన్నికై సమర్ధంగా నిర్వహించింది .క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఇండియా కు కూడా ఆమెయే మొదటి ప్రెసిడెంట్ . వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ,ఆసియా ఫసిఫిక్ రీజియన్ కు కూడా ఆమెయే మొదటి ప్రెసిడెంట్ .

సంగీత నాటక అకాడెమీ నిర్వహణ:

నేషనల్ స్కూల్ ఫర్ డ్రామా ను కూడా ఏర్పాటు చేసిన కమలాదేవి ,తర్వాత సంగీతనాటక అకాడెమి నిర్వహణ బాధ్యతలనూ సమర్ధవంతంగా నిర్వహించి,యునెస్కో సభ్యురాలైంది .ఎన్నో బృహత్తర ప్రణాకలు చేబట్టి నిర్వహించిన కమలాదేవి తన స్వీయ జీవిత చరిత్ర ‘’ఇన్నర్ రీసెస్ అండ్ ఔటర్ స్పేసెస్-మెమాయిర్ ‘’ను 1986లో రాసి ప్రచురించింది .

బిరుదు ,పురస్కారాలు:

కమలాదేవి చట్టోపాధ్యాయ సాంఘిక కళా సేవలను గుర్తించి , భారత ప్రభుత్వం 1955లో పద్మ భూషణ్ పురస్కారం అందిస్తే ,1966అంతర్జాతీయ రామన్ మాగ్ సెసే అవార్డ్ ,1974లో అత్యంత అరుదైన సంగీత నాటక అకాడెమి ఫెలోషిప్ ,1977లో హస్తకళలకు ఇచ్చిన ప్రోత్సాహానికి యునెస్కో అవార్డ్ ,1987లో పద్మ విభూషణ్ అనే అత్యుత్తమ పురస్కారాలు పొందింది .శాంతి నికేతన్ సంస్థ కమలాదేవి కి అత్యుత్తమ ‘’దేశికోత్తమ పురస్కారం ‘’అందించి గౌరవించింది .

మహా ప్రస్థానం:

ప్రజాజీవితం లో అత్యుత్తమ సేవలందించి మహిళాభ్యుదయానికి భారతీయ సంప్రదాయ కళలు హస్త కళల అభి వృద్ధికి నిరంతర సేవలందించిన పద్మ విభూషణ్ శ్రీమతి కమలాదేవి చట్టోపాధ్యాయ 85ఏళ్ళ వయసులో 29-10-1988 న పరమ పదించింది .

రచనాప్రస్థానం:

తన స్వీయ జీవిత చరిత్రతో పాటు అవేకెనింగ్ ఆఫ్ ఇండియన్ వుమెన్ ,,జపాన్ ఇట్స్ వీక్నెస్ అండ్ స్త్రెంగ్త్ ,ఇన్ వార్ టార్న్ చైనా ,ఇండియన్ . ఎంబ్రాయిడరి,హాండి క్రాఫ్ట్స్ ఇన్ ఇండియా ,ట్రడిషన్స్ ఆఫ్ ఇండియన్ ఫోక్ లోర్ డాన్స్ ,దిగ్లోరి ఆఫ్ ఇండియన్ హాండిక్రాఫ్ట్స్ ,టువర్డ్స్ ఎ నేషనల్ థియేటర్ ,ఇండియన్ వుమెన్స్ బాటిల్ ఫర్ ఫ్రీడం,,సోషలిజం అండ్ సొసైటీ వంటి 18పుస్తకాలు రాసింది .ఆమెపై ప్రసిద్ధ రచయితలు ఎనిమిదిమంది గొప్ప పుస్తకాలు రాశారు .

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో