జనపదం జానపదం- 13-తెలంగాణ గిరిజనల జీవన విధానం -భోజన్న


‘గిరి’ అనగా కొండ అని, ‘జనులు’ అంటే మనుష్యులు అని అర్థం. గిరి దగ్గరి ప్రాంతాలలో, లేదా కొండల్లో నివసించే వారిని గిరిజనులు అని పిలుస్తారు. ఆంగ్లంలో ఈ పదాన్నే తెగ (tribes) అని అంటారు. ఈ పదం ప్రాచీన రోమన్ పదమైన ట్రైబస్ నుండి పుట్టింది. ఈ పదాన్ని జాతికి (race) అనే పదానికి పర్యాయపదంగా కూడా వాడబడుతుంది. రాయ్ బర్మన్ ప్రకారం భారతదేశంలో 427 తెగలు ఆంత్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ప్రకారం 314. భారత ప్రభుత్వం 212 నమోదు చేసింది. ఈ తెగల జనాభ దేశ జనాభాలో 8% ఉంది.

“తెగ అంటే ఒకే మాండలికం మాట్లాడుతూ ఒకే నిర్ణిత భౌగోళిక ప్రదేశంలో నివసిస్తున్న ప్రజా సమూహమే తెగగా పెర్రీ (perry) తెలియజేశారు. భారతదేశంలో తెగలను రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ఆదివాసి, వనవాసులు, వన్యజాతులు, జనజాతులు, ఆదిమజాతులు, వీరినే ప్రాచీన కాలంలో విషాదులు, కిరాతక, దాస్యులు, ద్రావిడులని పిలువడినట్లు చారిత్రిక ఆధారాలున్నాయి. గిరిజన తెగలలో లక్షణాలను గమనిస్తే 1.ఆదిమ సంస్కృతి లక్షణాలు (primitive traits) 2.ప్రత్యేక సంస్కృతిని కలిగిఉండటం (distinctive culture) 3.భౌగోళిక వృథ:కరణ (geographical isolaition) 4.బయటి ప్రపంచంతో సంబంధాలు కల్గించుకొనుటకు సిగ్గుపడటం 5.వెనకబాటుతనం (backwardness) ఈ లక్షణాలను ఎక్కువగా గిరిజన తెగలు పాటించడం కనిపిస్తుంది. కొన్ని తెగలలో వారితో వారు మరియు ఇతర తెగల వారితో మరియు నాగరికులతో మాట్లాడాలంటే, సంబంధాలు కొనసాగించాలంటే చాలా సిగ్గుపడతారు. ఇలాంటి ప్రవర్తన చాలా తెగలలో కనిపిస్తుంది. మరి కొన్ని తెగలలో దూకుడు స్వభావం, ఉద్రేక స్వభావం, ముభావంగా ఉండటం, స్నేహం, అనుమాన భరితమైన ప్రవర్తన కూడా కనిపిస్తుంది. జీవితకాలంలో తమ ప్రాంతాలుదాటి ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళని గిరిజనులు కొందరు కనిపిస్తారు. గిరిజనులు నివసించే ప్రాంతమే వారికి సర్వం ఇలాంటి మనస్తత్వం జానపదుల్లో కూడా కనిపిస్తుంది.

గిరిజనుల ఆహారం నాగరికులకు విభిన్నంగా, విచిత్రంగా కూడా ఉంటుంది. అడవిలో దొరికే కందలు, గడ్డలు, తేనె, ఆకుకూరలు, జంతు మాంసం మొదలైన ఆహారాన్ని వీరు స్వీకరిస్తారు. ఆహారాన్ని ఏ పూటకు ఆ పూట సేకరించుకునే తెగలు కొన్నైతే, ఆహారాన్ని నిలువ చేసుకునే తెగలు కూడా ఉన్నాయి. వ్యవసాయాన్ని నమ్ముకుని స్థిర నివాసం ఏర్పరచుకున్న గిరిజన గూడాలు, తండాలు ఉన్నాయి. రోజంతా ఆహారం కోసం పోరాటం చేసినా మూడు పూటల ఆహారం దొరకని గిరిజనులు చాలా మంది ఉన్నారు. అందుకనే కొన్ని తెగల ప్రజలు బలిష్టంగా నిండుగా కనిపిస్తే, మరికొన్ని తెగలోని ప్రజలు బక్కచిక్కి పోయి ఎముకల గూడుతో కనిపిస్తారు. ప్రభుత్వం వీరికోసం ఎన్ని పథకాలు పెట్టినా ఇంకా వీరి జీవితంలో చాలా మార్పులు రావాల్సిఉంది.

ప్రస్తుతం గిరిజనులు కొందరు తమ ప్రాంతాలను వదిలి పట్టణాలలో, పరిశ్రమల్లో దినసరి కూలీలుగా పనులు చేస్తూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గ్రామాల్లో ఉన్న గిరిజనులు కోళ్ళు, మేకల పెంపకం, వ్యవసాయం, వేట, చేపలు పట్టడం, తౌసిబంక, మూలికలను అమ్మడం మొదలైన అనేక రకాలుగా జీవనోపాధిని వెతుక్కొని బ్రతుకులు వెళ్ళదీస్తున్నారు. ఇంతటి కష్టంతో వీరు జీవిస్తుంటే చెట్లకోసం, రాళ్ళు రప్పల కోసం, వనసంపదల పేరిట రకరకాల అవస్థలకు గురిచేస్తూ పబ్బం గడుపుకునే వారు లేకపోలేదు. కొండకోనల్లో అనేక జీవితాలు ఇలానే మగ్గిపోతున్నాయి. విద్యకు, నాగరికతకు, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు, అధికారాలకు, పదవులకు దూరంగా ఎక్కడో ఒక మూల జీవితం గడుపుతున్నారు.

గిరిజనుల వేషభాషలు రోజురోజుకు మారుతున్నాయి. ప్రస్తుత సమాజానికి అనుగుణంగా మెల్లమెల్లిగా అడుగులు వేస్తున్నారు. కొందరు పరిశోధకులు, కొన్ని ప్రభుత్వ సంస్థలు, కొన్ని స్వచ్చంద సంస్థలు వీరి అభివృద్ధికి పాటుపడుతున్నాయి. ముఖ్యంగా కొండకోనల్లో జీవించే వీరికి చేయూతనందిస్తే సమాజాన్ని అర్థం చేసుకొని జీవనవిధానంలో మార్పలు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

-భోజన్న

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో