గజల్-19 – ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

తెలుగు గజల్ ప్రేమికులకు నమస్కారం. ప్రేయసిని ఆరాధించే ప్రియుడు ఎన్ని రకాలుగా ఆమె అందాన్ని వర్ణించాలో అన్నిరకాలుగా వర్ణిస్తుంటాడు. ఎన్నో అద్భుతాలు ఆమెలో ఉన్నాయని , వేరేవి ఆమెకి ఎందుకంటూ ప్రశ్నిస్తూ ఉంటాడు. వెన్నెలవర్ణం ఉన్న మేనికి పాలలాంటి రంగు దేనికి , పున్నమికాంతులలో మెరిసే తరంగాల రంగు ఎందుకు అంటాడు. చెక్కిళ్ళలో పూసే చేమంతులుండగా పసిడిరంగు అవసరం లేదంటాడు. ఇలా ఎన్నో ఉపమానాలతో ప్రేయసిలోని అందాలను కీరిస్తాడు ప్రేమికుడు. ఇలాంటి భావాలు నిండిన గజల్ మీకోసం …

|| గజల్ ||

పొంగుతున్న వెన్నెలలో పాలరంగు నీకెందుకు

పున్నమిలో జలధితరగ నురగరంగు నీకెందుకు

బుగ్గలలో పసిడిపూల రేకులెన్ని దాగినవో

హేమంతపు చేమంతుల పచ్చరంగు నీకెందుకు

నవ్వులలో కాంతిపూలు చిందులేస్తు ఉంటాయి
మల్లెపూలనల్లుకున్న తెల్లరంగు నీకెందుకు

నీలికురుల పాయలలో కాటుకనే దాచవచ్చు

వానకార్తె కట్టుకున్న కోకరంగు నీకెందుకు.

సిగ్గులలో రోజాలను కురిపిస్తూ ఉంటావు
వాటిముందు నిలువలేని పూలరంగు నీకెందుకు

మేనిలోన మేలుజాతి వజ్రాలే దొరుకుతాయి
కోహినూరులాంటి రంగురాళ్ళరంగు నీకెందుకు.

పెదవులపై నెలవంకలు నీకుంటే “నెలరాజా”
తూరుపులో వెలుగు వేగుచుక్కరంగు నీకెందుకు

-ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కాలమ్స్Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో