అతివ ఆక్రందన (కవిత )-*సాగర్ రెడ్డి*

 

 

 

 

స్వాతంత్యం అనే
పదాన్ని హేళన చేస్తూ-
మహిళా సాధికారం
అనే పెద్దమాటలతో,
స్త్రీ జాతిని వెక్కిరిస్తూ,
వికట్టహాసం చేస్తున్న
అభినవ రాక్షసులు-
అతివల ప్రాణ భక్షకులు!!

దశాభ్ధాలు గడచినా,
ఎన్ని చట్టాలు చేసినా
చట్టాలు అటకెక్కేలా,
న్యాయానికి సంకెళ్ళు
వేసే వ్యవస్ధతో-
విర్రవీగుతున్న
దుశ్శాసన మంద!!

వయస్సుతో నిమిత్తం
లేని అత్యాచారాలు-
మగజాతికే కాదు
మనిషి మనుగడనే
ఆసహ్యానికి గురిచేసే-
అమానుష ఘట్టాలు!!

సమాజమనే స్పృహ
మరచిన మనిషి ముందు-
చట్టం, న్యాయం, పోలీస్,
అనే పదాలకు అర్ధం మటుమాయమై
భయం, బాధ్యత కనుమరుగై
మానవత్వం మరీచికమై
ఆత్మరక్షణ కోసం
అతివ విలపించే
భారతావని
ఈ ఇరవయ్యొ దశాబ్దపు
మన భరత దేశం!!

*సాగర్ రెడ్డి*

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో