
ఎండ్లూరి సుధాకర్
మీ ఇంటి గడప దాకా వచ్చి
తచ్చాడి వెనక్కి వచ్చాను
ప్రేమానురాగాల మొహమాటంలో
నిలువెల్లా కూరుకుపోయాను
-ఫైజ్ అహ్మద్ ఫైజ్
ఈ ప్రపంచం
ఒళ్లు విరుచుకుంటూ కనిపించిందీ
సాకీ ! నీ సారా అంగడిలోనే
నాకివాళ పొద్దు పొడిచింది
-ఫిరాక్ గోరఖ్ పురీ
అందరూ నాకే చెబుతారు
బుద్ధిగా థలొన్చుకుఇ నడవాలని
ఆమెకెందుకు చెప్పరు మరి
ముస్తాబై మా బస్తీలోకి రావద్దని
-అక్బర్ ఇలాహాబాదీ
– అనువాదం ఎండ్లూరి సుధాకర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~