జ్ఞాపకం- 58 – అంగులూరి అంజనీదేవి

Anguluri Anjani devi

సంలేఖ ఆ పత్రికను ఆత్రంగా తిరగేసి తన పేరు కన్పించగానే ఆ కథను కళ్లకు, హృదయానికి హత్తుకుంది. హస్విత వైపు చూసింది. హస్విత క్యాజువల్ గానే ఆ కథవైపు చూసింది. ఆమెలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. కాకపోతే నవ్వుతూ చూసింది.

ఒక చిన్న నవ్వు, ఒక చిన్న చూపు చాలు రచయితలకి. ఆ ఆనందమే వేరు.

“ఈ పత్రికను కాంప్లిమెంటరీ కాపీగా నీక్కూడా పంపించి వుంటారు. అది నీకు అందలేదు. పోస్టల్ డిలే! మార్కెట్లోకి మాత్రం అప్పుడే వచ్చేసింది. చూడగానే చదివాను. నేను ప్రయాణిస్తున్న ట్రైన్ లో కూడా కొందరి చేత చదివించాను. వాళ్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నాను” అన్నాడు. ఒక జర్నలిస్ట్ గా అతని అభిప్రాయం అమూల్యమైనది అందుకే “ఎలా వుంది కథ దిలీప్?” అని అడిగింది.

“ఈ మధ్యన నువ్వు రాసిన నాన్న కథ దగ్గర నుండి ఇంకా కొన్ని కథలు చదివాను లేఖా! వాటికన్నా ఈ కథ చాలా డిఫరెంట్ గా వుంది.ఈ కథలో నువ్వు గత 30 సంవత్సరాలుగా మనదేశంలో జరుగుతున్న అవినీతిని నీ అక్షరాలతో మలిచావు. పదాలను కూడా పొదుపుగా వాడుకున్నావు. ఫర్ ఫెక్షన్ వున్న రైటర్లా కథనిండా ఉత్కంఠను పెంచావు. ముఖ్యంగా నువ్వు రాసింది అవినీతి చరిత్ర కాబట్టి దాన్ని ఏ అవినీతిపరుడు చదివినా ఆత్మహత్య చేసుకునేలా వుంది” అన్నాడు.

సంలేఖ వింటోంది. ఆమెకు మెచ్చుకోవటం కావాలి. లోపాలను ఎత్తిచూపడం కూడా కావాలి.
“ముఖ్యంగా ఈ కథలో వందలకోట్ల రూపాయలను ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ ల నుండి అప్పుగా తెచ్చి కొందరు రాజకీయనాయకులు పంచుకుంటూ ఒకరినొకరు బ్లాక్ మెయిల్ చేసుకోవటం. రాజ్యాంగం, శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థ, ఎగ్జిక్యూటివ్స్, అధికారగణం, అమలు వ్యవస్థ, నిర్ణేతలుగా మిగిలిపోవలసిన ప్రజలు ప్రజాస్వామ్యంలో ఎలా దోపిడీ చేయబడుతున్నారో రాశావు చూడు. అది ఎక్స్ లెంట్! అంతేకాదు 27 అంతస్తుల ఆకాశ హర్యాల్లో నలుగురు మనుషులు ఆరువందల మంది నౌకర్లతో జీవించే కొద్దిమంది ప్రపంచస్థాయి ధనికులు ఈ దేశంలో వున్నా 62 కోట్లమంది దరిద్రంతో ఎలా అల్లాడిపోతున్నారో రాశావు చూడు. అదింకా హైలెట్!

ఇదంతా చూస్తూ సహించలేని అన్నాహజారేలు, బాబా ఆమ్టేలు, మేధాపట్కార్ లు, అరుంధతీరాయ్ లు, వందనా శివలు, వినాయక్ సేన్లు, జతీన్ మరాండీల నుండి కిరణ్ బేడీ, అరవింద్ కేజీవాల్ దాకా ఒంటరి సైనికుల్లా అవినీతిపై అగ్నిబిందువుల్ని కురిపిస్తున్నా అది ఏమాత్రం నశించకుండా విషపు ఊడలా ఎలా విస్తరిస్తుందో రాశావు. అసలు నీలో ఇంత ఆవేదన, ఆవేశం ఎలా వచ్చాయి? ఇంత సమాచారాన్ని ఎలా సేకరించగలిగావు?” అడిగాడు ఆసక్తిగా.

వెంటనే హస్విత “లైబ్రరీకి వెళ్తుందిగా. నాకు తెలిసి అక్కడ చదివి సేకరించి వుంటుంది. పైకి చూడటానికి సాఫ్ట్ గా, సాదుజీవిలా అన్పిస్తుంది. మరి రాసేటప్పుడు మాత్రం యింత ఎమోషనల్ గా ఎలా రాయగులుగుతుందో ఏమో!” అంది తనకి కూడా అర్థం కావటం లేదన్నట్లు చూస్తూ హస్విత.
“నాలో పైకి కన్పించని ఆవేశం, కోపం, కసి వున్నాయి కాబట్టే రైటర్ని అయ్యాను. అలా కాకుండా ఎవరేం చెప్పినా నవ్వుతూ తలవూపడం, సరే అనడం, ఏదిచూసినా సరిగ్గా స్పందించలేకపోవడం వ్యాపారుల లక్షణం. అలాంటి తత్వం నాలో వుండివుంటే రచయిత్రిని కాలేకపొయ్యేదాన్నేమో!” అంది సంలేఖ.
ఆ తర్వాత ఏదో చిన్న అసంతృప్తితో ఆలోచనగా తలవంచుకుంది. దానికి కారణం ఆమె దీనికన్నా ముందు రాసిన కథపై ఒక విమర్శకుడు విరుచుకుపడటమే!

ఆ విమర్శ స్పూర్తిదాయకంగా వుందా? కసితో చేసినట్లు వుందా అన్నది ఆమెకు అర్థం కాలేదు.’రాసికన్నా వాసి ముఖ్యం. అప్పుడే నీకు ఏం వయసు మించిపోయిందని రాయటానికి ఇంత తొందర పడుతున్నావ్? కొంతకాలం ఆగరాదు’ అన్నాడా విమర్శకుడు.

ప్రతిరోజు కాసిన్ని అక్షరాలను రాయందే నిద్రపోని తను కాగితంపై అక్షరం పెట్టాలంటేనే భయపడిపోయింది. రాయకుండా కూర్చుంది. ఆ విషయం వెంటనే దిలీప్ తో చెప్పింది.

అది విని దిలీప్ “నువ్వు రాసింది రాశి అయిందీ, వాసి అయిందీ తెలియాలి అంటే అసలు నువ్వంటూ కొంత మేటర్ రాయాలి కదా! ఏదైనా ఒకటి రాసి దానికి కొన్ని మార్పులు చేసుకుంటూ, మెరుగులు దిద్దుకుంటూ ఉండాలి కాని ఇలా రాయకుండా వుండకూడదు. రాయడంలో ఇప్పటికే నీకంటూ ఓ పట్టువుంది. సాధన చెయ్యకుండా దాన్ని పాడుచేసుకోకు. నీకన్నా ముందు రాసిన వాళ్లంతా చిన్న వయసు నుండి రాసినవాళ్లే. ముసలివాళ్లు అయ్యేంతవరకు ఆగలేదు. నీకో సత్యం చెప్పనా. ఓ బిడ్డను కనేముందు ఆ బిడ్డ భవిష్యత్తు పేరెంట్స్ కి తెలియనట్లే ఓ రచన బయటకెళ్ళేముందు అది చదివి ఎవరెలా స్పందిస్తారో దాన్ని రాసిన వాళ్లకి తెలియదు. రకరకాల తత్వాలతో, రకరకాల అభిప్రాయాలను వెలిబుచ్చుతారు. అన్నిటికీ ఉలిక్కిపడితే ఎలా? నీకు తెలిసింది నువ్వు రాసుకుంటూ వెళ్లిపో. భారతరత్నలతో పోల్చుకోకు. అలా అని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. కాన్ఫిడెన్స్ ముఖ్యం. నీకు తెలియని దాని గురించి నువ్వు అన్వేషించు” అన్నాడు. గట్టిగా ప్రోత్సహించాడు.

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో