ఆకురాలు కాలం కవయిత్రి మహెజబీన్ తో ముఖాముఖీ…

 

“అతనెప్పుడూ అంతే
ఒంటరిగా రమ్మంటే వసంతాన్ని వెంటతెస్తాడు…
అతనెప్పుడూ అంతే
వస్తూ వస్తూ
పక్షుల పాటల్ని వెంటతెస్తాడు (ఆకు రాలు కాలం నుండి..)”

విహంగ: హలో మహెజబీన్ గారూ! అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మాసం మా విహంగతో ముచ్చటిస్తున్నందుకు కృతజ్ఞతలు. మీకు శుభాకాంక్షలు. కాసేపు సాహితీ కబుర్లు మొదలు పెట్టేద్దామా!

మహెజబీన్: తప్పకుండా. విహంగ పాఠకులతో నా అంతరంగం పంచుకోవడం బావుంది. ఏం ప్రశ్నలు వేస్తారో అని నాకూ కుతుహులంగా ఉంది.

విహంగ: మీ బాల్యం, విద్యాభ్యాసం, మీ కుటుంబ నేపథ్యం గురించి మా విహంగ పాఠకులకు తెలియజేస్తారా?*
మహెజబీన్: మాది నెల్లూరు. మా అమ్మ గారిది సంప్రదాయ ముస్లిం రాయల్ మొఘల్ కుటుంబం. కట్టుబాట్లు ఎక్కువగా ఉండేవి. నాన్నగారు వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తి. అమ్మకు వివాహం అయిన తర్వాతే హిందీలో ఎం. ఏ,బి.ఇడి పూర్తిచేశారు.మా నాన్నగారు ఆడపిల్లలమైనా ఆ రోజుల్లోనే మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నేను ఒకటవ తరగతి నుండి డిగ్రీ వరకు నెల్లూరులోనే చదువుకున్నాను. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ లో ఎం.ఏ సోషల్ వర్క్ పూర్తి చేశాను. ఆ తర్వాత 1990 లో ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ కు వచ్చాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హ్యూమన్ రైట్స్ PG Diploma చదివాను. ఉస్మానియా యూనివర్సిటీ లో LLB చదివాను.l నెల్లూరులో ఎక్కువగా సాహిత్య సభలు, సమావేశాలు జరగడం. ఆ సభల్లో పాల్గొవడం వల్ల నాకు సాహిత్య పరంగా ఎంతో ఉపయోగపడింది. గవర్నమెంట్ బడిలో చదువుకోవడం వల్ల తెలుగు బాగా నేర్చుకోగలిగాను. సాహిత్యం బాగా చదవడం రాయడం వల్ల కథలు, కవిత్వం రాయడానికి ఎంతో ఉపయోగపడింది.

విహంగ: హైదరాబాద్ సంస్కృతికి నెల్లూరు సంస్కృతికి ప్రధానమైన మార్పులుగా వేటిని గమనించారు?*

మహెజబీన్: నేను హైదరాబాద్ వచ్చిన తరవాత మత కల్లోలాలు జరిగాయి (communal riots). అది నన్ను షాక్ కు గురిచేసింది. మా ఊర్లో అలాంటి గొడవలు ఎప్పుడూ చూడలేదు.

అందరూ కలిసి మెలిసి ఉంటారు. మిశ్రమ సంస్కృతి (mixed culture) ఉంటుంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో శాంతి స్థాపన (restoration of peace) కోసం అక్కడి ప్రజలతో కలిసి పని చేశాను. గత ఇరవై సంవత్సరాలుగా నేను ముస్లిం స్త్రీల సాధికారత కోసం పని చేస్తూనే ఉన్నాను. నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి భారత ప్రభుత్వం ‘ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్’ మినిస్ట్రీ నుండి “స్త్రీ శక్తి” అవార్డును అందుకున్నాను.

విహంగ: మీరు కవిత్వం రాయడం మొదలుపెట్టిన కొద్ది కాలానికే ప్రముఖ ఫెమినిస్ట్ కవయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మీ రచనల గురించి చెప్పండి.

మహెజబీన్: మొదట్లో నేను ఎక్కువగా ప్రకృతి మీద కవితలు రాసేదాన్ని. తర్వాత తిరుపతిలో చదువుకునే రోజుల్లో విద్యార్ది ఉద్యమాల్లో పాల్గొన్నాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫెమినిస్ట్ ఉద్యమం,
మానవ హక్కుల ఉద్యమాలు నాపై చాలా ప్రభావం చూపించాయి. ఏం రాయాలి అనే సబ్జెక్ట్ ని డిసైడ్ చేసుకునే అవకాశం కలిగింది. సమాజాన్ని అర్థం చేసుకొని నేను నా రచనల్నీ కవిత్వాన్ని కొనసాగించాను. హైదరాబాద్ వచ్చిన తర్వాతనే నేను సీరియస్ గా కవిత్వం రాయడం మొదలుపెట్టాను.

స్ట్రీట్ చిల్డ్రన్ కవితను పదవ తరగతిలో (తెలుగు టెక్స్ట్ బుక్) పాఠ్యాంశంగా చేర్చారు. దాదాపు 18 ఏళ్లు తెలుగు సిలబస్ లో ఉంది ఈ కవితా. నా తొలి కవితాసంపుటి ‘ఆకురాలు కాలం’ ఉద్యమానికి ప్రతీక అని అందరూ అంటారు. నన్ను బాగా ప్రభావితం చేసిన సంఘటనలు, సంతోష పెట్టిన సందర్భాలు, నేను బాధ పడినప్పుడు నాలో కలిగిన వేదనలు కవితా రూపంలో రాసుకున్నాను.

నా కవిత్వంలో స్త్రీల హక్కులు, పిల్లల హక్కులు , పర్యావరణం, gender justice ప్రధానంగా కనిపిస్తుంది.
అనేక సామాజిక అంశాలకు కవిత్వ రూపం ఇవ్వడం వల్ల సాహిత్యంలో నాకంటూ ఒక కొత్త స్టైల్ ని సృష్టించుకుని ముందుకు వెళ్లగలిగాను. ఆకురాలు కాలం కవితాసంపుటి ఒక spectacular victory. నాకు చాలా పేరు తెచ్చిపెట్టింది. అదొక classic గా తెలుగు సాహిత్యంలో మిగిలిపోయింది.

విహంగ: తెలుగు సాహిత్యంలో మీకు స్ఫూర్తి ఎవరు? ఎవరి ప్రభావం మీ మీద ఎక్కువగా ఉందంటారు?*

మహెజబీన్: కృష్ణ శాస్త్రి,తిలక్, శ్రీశ్రీ రచనలు నన్ను చాలా ప్రభావితం చేశాయి.

హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా మంది కవులు, రచయితలు పరిచయమయ్యారు. వారిలో ముఖ్యంగా చేకూరి రామారావుగారు, శివారెడ్డిగారు నా చేయి పట్టి నన్ను సాహిత్యరంగంలో నడిపించారు. కవితా వస్తువు ఏది ఎంచుకోవాలి, ఎలా ప్రజెంట్ చేయాలనేది ఒక స్టూడెంట్ లాగా వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను.

సి.నారాయణరెడ్డి, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, ఆవంత్స సోమసుందర్ వంటి గొప్ప సాహితీవేత్తలు పరిచయమయ్యారు. వీళ్ళు నా గురువులు, స్ఫూర్తిప్రదాతలు.చేకూరి రామారావు గారు ఆయన రాసిన ‘ చేరాతలు ‘ కాలమ్ లో నా కవిత్వం గురించి చెప్తూ ‘మహెజబీన్ ఈ దశాబ్దపు వాగ్దానం’ అనడం నేనెప్పుడూ మర్చిపోలేను. అలాగే శివారెడ్డి గారు కూడా నన్ను ‘లిరికల్ బ్యూటీ’ అంటూ నా ‘ఆకురాలు కాలం’ పుస్తకానికి ముందుమాట రాసి అభినందించడం మరువలేనిది.

విహంగ: ఫెమినిజం మీ పరిధిని విస్తరించకోడానికి ఎలా ఉపయోగపడింది? మిమ్మల్ని మీరు సోషలిస్ట్ ఫెమినిస్ట్ గా ఎలా మల్చుకోగలిగారు?

మహెజబీన్: నా కవిత్వాన్ని వామపక్ష భావజాలం ఎక్కువగా ప్రభావితం చేసింది కాబట్టి నన్ను నేను సోషలిస్ట్ ఫెమినిస్ట్ గానే అనుకుంటాను. ఫెమినిజంలో మిగతా కవయిత్రులకి లేని అవకాశం నాకు కొంత ఎక్కువగా దొరికిందని నేను అనుకుంటున్నాను. అప్పుడప్పుడు విదేశాలు సందర్శించడం వల్ల అక్కడి ఫెమినిస్ట్ లను కలుసుకోవడం, ఫెమినిజాన్ని అధ్యయనం చేసే అవకాశం దొరికింది. ఫెమినిజం పుట్టిన యూరోప్ దేశాల్లో స్త్రీలు ఎలా ఉన్నారు అని తెలుసుకొనే అవకాశం కలిగింది.

ఆ ప్రభావం నా రచనల మీద పడింది. 2000 సంవత్సరంలో నేను DAAD fellowship తో జర్మనీ వెళ్లాను. అక్కడి యూనివర్సిటీ లో ఫెమినిజం అధ్యయనం చేసే అవకాశం కలిగింది. అదే సంవత్సరం న్యూయార్క్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ జరిగింది. United Nations Women’s Wing ఆహ్వానం మేరకు నేను ఆ సభలో పాల్గొన్నాను. నాతో పాటుగా ఆ సభలో వసంత కన్నాభిరామ్, ఓల్గా వంటి రచయితలు కూడా పాల్గొన్నారు. ఒక తెలుగు కవయిత్రిగా నేను అందుకున్న పెద్ద అవకాశం అది. ఆ తర్వాత నేను చాలా దేశాల్లో వేదికలపై ఉపన్యాసాలు ఇవ్వడానికి, కవిత్వం చదవడానికి ఇదంతా ఎంతో ఉపయోగపడింది.

విహంగ: Post modernsim (ఆధునికోత్తరవాదం) ఈ మధ్య మీరు సదస్సుల్లో మాట్లాడారు కదా. ఆ విషయాలు కొన్ని చెప్పండి.

మహెజబీన్:Post modernsim లో భాగంగా గ్లోబలైజేషన్ వచ్చింది.

గ్లోబలైజేషన్ పీరియడ్ నా కవిత్వం మీద చాలా ప్రభావం చూపించింది. చిన్న దేశాలలో ప్రపంచీకరణ కొంచెం మేలు చాలా నష్టం చేసింది. నా కవిత్వంలో అక్కడక్కడ Postmodern approach తో పాటు సెరెలిజం కూడా ఉంటుంది. 2000 సంవత్సరం తర్వాత ఫెమినిజంలో కొంత స్తబ్దత వచ్చింది. ఫెమినిజం కొత్త ఒరవడితో ముందుకు సాగడం జరగలేదు. ఫెమినిజం సంస్థాగతమయింది. దానివల్ల అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారమవ్వలేదు. స్త్రీలపై హింస విస్తారంగా పెరిగిపోయింది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక పిరియడ్లో స్తబ్దత ఏర్పడింది. మళ్లీ ఇప్పుడు ఫెమినిస్ట్ లు చాలా బాగా వర్క్ చేస్తున్నారు. కానీ ఫెమినిజం ఇక్కడ ఫెయిల్ అయిందని నాకు అనిపిస్తుంది.

మంచు కురిసే నేల మీద సంబరంగా నడిచిన అనుభవం నాది
ఎండా వాన తప్ప, మంచు చూడని South India అమ్మాయిని నేను
(మంచు పూల దారుల్లో కవిత నుండి).

విహంగ: విహంగ పత్రికను స్థాపించిన డా. పుట్ల హేమలత గారితో మీ అనుబంధం గురించి వివరిస్తారా?*

మహెజబీన్: హేమలత మన మధ్య లేకపోవడం చాలా విచారం. వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. గొప్ప స్నేహితురాలిని కోల్పోయాను. హేమలత నేను క్లాస్మేట్స్. హేమలత నేను ఒకే నెలలో పుట్టాం. ఇంటర్ లో కలిసే చదువుకున్నాం. మా ఇద్దరిదీ నెల్లూరే. హేమలత టీచర్ ట్రైనింగ్ కోసం బెంగళూరు వెళ్లిపోవడం, Degree, PG చేశాక నేను హైదరాబాద్ వచ్చి స్థిరపడడం జరిగింది. కొన్నాళ్లకు హైదరాబాదులో ఒక సాహిత్య సభలో మేమిద్దరం కలుసుకున్నాం. తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప రచయిత అయిన ఆచార్య. ఎండ్లూరి సుధాకర్ గారిని తను వివాహం చేసుకున్నానని సుధాకర్ గారిని నాకు పరిచయం చేసింది. నేను చాలా సంతోషించా. అలా మేము ముగ్గురం ఒకే వేదికపై కలుసుకోవడం ఎంతో ప్రత్యేకమైందిగా గుర్తుండి పోయింది. 2014-15 లో నేను కెనడా లో ఉన్నప్పుడు “ఇంటర్నేషనల్ పీస్ అవార్డు” వచ్చిన సందర్భంగా”విహంగ”లోనాపై ఒక మంచి ఆర్టికల్ రాసింది హేమలత. హేమలత ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది అనే వార్త నాకు తెలిసినప్పుడు నేను చాలా బాధకు గురయ్యా మానసికంగా. తర్వాత విహంగ బాధ్యతలు మానస ఎండ్లూరి తీసుకోవడం నాకు చాలా చాలా సంతోషాన్నిచ్చింది. నా స్నేహితురాలు స్థాపించిన పత్రికను ఆమె కూతురు బాధ్యత తీసుకోవటం పత్రికను నూతన ఒరవడిలో పయనింప చేయడం నాకు చాలా బాగా నచ్చింది. హేమలత ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోవడం తెలుగు సాహితీలోకానికి తీరని లోటని నా భావన. ఏది ఏమైనప్పటికీ ఆవిడ భావజాలాన్ని మానస ముందుకు తీసుకువెళ్తుందని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్త్రీవాదిగా,దళిత స్త్రీవాదిగా హేమలత ఎంతో పోరాటం చేశారు.గొప్ప రచయిత ,అంతర్జాల సాహిత్యంలో గొప్ప పరిశోధకురాలు హేమలత.
ఈ మధ్య నువ్వు నన్ను విహంగ కు guest editorial రాయమని అడిగావు కదా మానస! నేను చాలా సంతోషించాను. ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను’

విహంగ:’ఆకురాలు కాలం’ కవితాసంపుటి తర్వాత, మీకు సాహిత్య రచనల్లో కొంత నెమ్మది కలిగింది. ఎందుకనంటారు? ఇప్పుడేం రాస్తున్నారు?

మహెజబీన్:వృత్తిరీత్యా నేను న్యాయవాదిని కావడం వల్ల ఎక్కువ సమయం సాహిత్యానికి ఇవ్వలేకపోయాను. అప్పుడప్పుడు కొన్ని కవితలు రాస్తూనే ఉన్నాను, పత్రికల్లో వస్తూనే ఉన్నాయి. రెండవ కవితా సంపుటి వేయడమే కొంచెం ఆలస్యమైంది. ఈ సంవత్సరం వస్తుంది.

కవిత్వంతో పాటు నేను స్త్రీలకు సంబంధించిన కొన్ని డయాస్పోరా కథలు కూడా రాసాను.ఇటీవల కాలంలో మంచు పూల దారుల్లో అని ఒక డయాస్పోరా కవిత రాసాను.విదేశాలు చూడ్డం, అక్కడ కొంత కాలం ఉండడం వల్ల డయాస్పోరా విషయాలు కవితల్లో కథల్లో రాయడానికి వీలు కలిగింది.

అదేే విధంగా జెండర్ జస్టిస్ కి సంబంధించిన విషయాలు ఎక్కువగా నా కథల్లో తీసుకున్నాను. ఈ మధ్య రాస్తున్న నా కవిత్వంలో ప్రధానంగా ఇకో-ఫెమినిజం కనిపిస్తుంది. స్త్రీలు ప్రకృతితో ఎలా మమేకమవుతారో, ప్రకృతితో వారి కుండే బంధం ఎలా ఉంటుందో నా కథల్లో, కవితల్లో ప్రతిబింబిస్తాయి. కరోనా కాలంలో ఎక్కువగా కవిత్వం రాయడానికి, వెబినార్స్ లో పాల్గొనడానికి మంచి సమయం దొరికింది.
అనేక యూనివర్సిటీలు, సాహిత్య కారులు,సాహిత్య సంస్థలునిర్వహించిన అనేక వెబినార్స్ లో పాల్గొని పేపర్ ప్రజెంటేషన్ చేశాను, ఉపన్యాసాలు ఇచ్చాను.

విహంగ:త్వరలో మీ కొత్త పుస్తకం చదవాలని ఎదురు చూస్తుంటాం మహెజబీన్ గారూ..మరో సందర్భంలో మళ్ళీ కలుద్దాం. మాతో ఇంత సమయం పంచుకున్నందుకు ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
మహెజబీన్:మీకు, పాఠకులకి కూడా నా అభినందనలు.

-మానస ఎండ్లూరి 

కట్టూరి వెంకటేశ్వరరావు 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ముఖాముఖిPermalink

One Response to ఆకురాలు కాలం కవయిత్రి మహెజబీన్ తో ముఖాముఖీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో