నిలువెత్తు నిదర్శనం(కవిత )-చంద్రకళ. దీకొండ,

దేహపు మడతల్లో దుఃఖాన్ని దాచేసి…
పొగిలిపోతున్న మగువ మానసం…!

పలు రకాల ఒత్తిళ్లతో…
అతలాకుతలమౌతున్న మహిళ మస్తిష్కం…!

ఇంటా బయటా బాధ్యతలతో…
ఇంటిలో,ఇంటి బయటా ఎదురయ్యే సమస్యలతో…
ఇంతుల జీవన పోరాటం…!

చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలు…
చెప్పినా ప్రయోజనం
దొరకని అంతరంగ ఆవేదనలు…
లోలోపలే అణచుకుంటూ…
కన్నీళ్లను తుడుచుకుంటూ…
అలసటతో ఆవిరౌతూ…!

రవంత గుర్తింపు,సాంత్వన దొరకకున్నా…
ఊపిరి సలుపని పనులతో సతమతమవుతున్నా…
సమస్యలను సతతం చిరునవ్వుతో
ఎదుర్కొంటున్న ఆధునిక మహిళ…
సహనానికి నిలువెత్తు నిదర్శనమై…!!!

చంద్రకళ. దీకొండ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో