స్వయంగా బానిసలను విడిపించిన నల్లజాతి అమెరికన్ మహిళ- హారియట్ టబ్ మాన్–గబ్బిట దుర్గాప్రసాద్

బానిస తలిదండ్రులకు అరమింటా రాస్ గా 18 22 మార్చి లో అమెరికాలోని మేరీ లాండ్ రాష్ట్రం డార్చేస్టర్ కౌంటీ లో పుట్టిన హారియట్ తప్పించుకొని ,13సార్లు ప్రయత్నించి,తన కుటుంబం వారు, స్నేహితులతో సహా 70మంది పుట్టు బానిసలకు సురక్షిత గృహాలనబడే ‘’అండర్ గ్రౌండ్ రైల్ రోడ్ ‘’సీక్రెట్ కోడ్ ద్వారా బానిస విముక్తికై ఉద్యమిస్తూ విముక్తి కల్గించిన ధీరవనిత .అమెరికన్ అంతర్యుద్ధం లో యూనియన్ ఆర్మీలో సాహుధ స్కౌట్ గా ,గూఢచారిగా పని చేసి మెప్పించిన సాహస స్త్రీ .మహిళా వోటు హక్కు ఉద్యమానికీ నాయకత్వం వహించిన సంస్కర్త.

బానిసకుటుంబం లో పుట్టటం వలన బాల్యంలో అనేక మంది తలిదండ్రుల చేత కొరడాలతో చావు దెబ్బలు తిని ఒకసారి ఒక ఓవర్ సీర్ విసిరిన బరువైన ఇనుప వస్తువు తగిలి తలకు తీవ్రగాయమై నరకయాతన అనుభవించింది. ఈ దెబ్బకు ఆమె తలనొప్పి, అతి నిద్ర జబ్బు పట్టుకొని జీవితాంతం బాధించాయి .ఆఫలితం గా వి౦తకలలు ,విజన్ వచ్చేవి .ఇవి దైవ సంకల్పాలుగా భావించేది .వీటికి తోడు మెథడిస్ట్ చర్చి భావాలు కూడా తోడై పూర్తిగా మత ఆరాధకురాలైంది .

1849లో పారిపోయి ఫిలడేల్ఫియాకు చేరి ,మళ్ళీ మేరీ లాండ్ వచ్చి తన కుటుంబానికి బానిస విముక్తి కలిగించాలని భావి౦చి నెమ్మది నెమ్మదిగా ఒక్కో సారి ఒక్కొక్క బృందాలవారీగా వారిని ఆ రాష్ట్రం దాటించింది .1849 సెప్టెంబర్ 17న టబ్ మన్ ఆమె సోదరులు బెన్, హారీ లతో పాటు తప్పించుకొని పారిపోయింది .ఆమె పూర్వ యజమాని కొడుకు,దగ్గరలోని కరోలిన్ కౌంటీ లో పోప్లార్ నెక్ లో వందలాది ప్లాంటేషన్ ఎకరాలున్న ఆంధోనీ థాంప్సన్ కు అద్దె కు వెళ్ళింది .ఈ విధంగా బానిసలను అద్దెకు తీసుకోవటం ఆనాడు ఎక్కువగా జరుగుతూ ఉండేది .పూర్వ యజమాని ఆమె పారి పోయిందని అనుకోలేదు .కేంబ్రిడ్జి డెమొక్రాట్ పేపర్ లో తిరిగి వచ్చిన బానిసకు వంద డాలర్ల బహుమతి అనే ప్రకటన పడింది .ఆమె సోదరులు ఆమెను కూడా బలవంతంగా ఒప్పించి పాత యజమాని ని చేరారు .రెండో సారి ఆమె ఒక్కత్తే తప్పించుకొని వెళ్ళింది .ఒక సీక్రెట్ నెట్ వర్క్ ‘’అండర్ గ్రౌండ్ రైల్వే ‘’ఏర్పాటు చేసుకొని ఉచితంగా ఫీజు లేకుండా బానిసలకు, బానిసత్వ వ్యతిరేకులైన తెల్లవారికీ విషయాలు తెలిపేది .వీరిలో రిలీజియస్ సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు .వీళ్ళనే ‘’క్వేకర్స్’’ అంటారు .పోప్లార్ నెక్ కు దగ్గరలో ఉన్న ప్రేస్టాన్ లో క్వేకర్స్ ఎక్కువమంది ఉండేవారు .ఆమె తప్పించుకోన్నప్పుడు మొదటి హాల్ట్ ఇక్కడే .ఇక్కడి నుంచి చోప్ టాంక్ రివర్ మీదుగా డెలావర్ చేరి ,తర్వాత పెన్సిల్వేనియా కు వెళ్ళేవారు .ఇదంతా సుమారు 90 మైళ్ళు అంటే 145కిలోమీటర్లదూరం. అంతా కాలినడకే .దాదాపు 27రోజులు పట్టేది .

డజన్లకొద్దీ బానిసలకు ప్రేరణ కలిగించి బానిసత్వం నుంచి తప్పించుకోవటానికి మార్గ దర్శకురాలైంది .రాత్రి పూట అత్యంత రహస్యంగా ధృవ నక్షత్రం అంటే’’ నార్త్ స్టార్’’వెలుగులో ‘’మోసెస్ ‘’అనే మారు పేరుతొ ,ఎవరికంటబడకుండా తిరుగుతూ వారిని తప్పించేది .ఎప్పుడూ ఏ ఒక్కరూ మళ్ళీ దొరకకుండా తప్పించిన నేర్పు ఆమెది . ఫ్రెండ్స్ ఇంట్లో ఉదయం ఊడుపు అవీ చేస్తూ పనిమనిషిలా ఉండేది. రాత్రిపూట ఆఇంటి వారు బండీ లో వేరే ఫామిలీ ఫ్రెండ్ ఇంటికి చేర్చేవారు .అక్కడి అడవులు పొదలు అన్నీ ఆమెకు పరిచయమే.కనుక పగటిపూట ఎవరికీకనపడకుండా అక్కడే దాక్కునేది .1850లో పారిపోయిన బానిసత్వ విషయమై చట్టం అమలులోకి వచ్చాక ,ఆ బానిసలను సుదూరం లో ఉన్న బ్రిటిష్ నార్త్ అమెరికా అనబడే కెనడాకుచేరుకోవటానికి సహకరించి ,కొత్తగా బానిసత్వ విమోచ నత్వం పొందినవారికి అండగా నిలబడి వారి బ్రతుకు తెరువుకు దారి చూపింది .పారిపోయాక మళ్ళీ 1951లో మొదటిసారి డాచేస్టర్ కొంటీకి వచ్చి ,తనభర్త జాన్ ను చూసి ,అనేక ఉద్యోగాలు చేసి సంపాదించిన డబ్బు తో అతనికి ఒక ఇల్లుకొనిపెట్టి ,మళ్ళీ సౌత్ కు వెళ్ళిపోయింది .భర్త ఇంకో పెళ్లి చేసుకొన్నా, ,తనదగ్గరకు రమ్మన్నా వినకపోయినా’’ సీన్ క్రియేట్’’ చేయకుండా కోపం దిగమింగుకొని ,అక్కడి నుంచి తప్పించుకోవాలనుకోన్నబానిసలకు ఫిలడెల్ఫియా వెళ్ళటానికి సాయం చేసింది .ఆతర్వాత పదహారేళ్ళకు భర్తజాన్ ఒక తెల్ల వాడి తో జరిగిన వివాదం లో హత్య చేయబడ్డాడు .

.1858లో జాన్ బ్రౌన్ కు అండగా నిలబడి హార్పర్స్ ఫెర్రీ పై దాడికి 1959లో మనుషులను ఆసరాగా పంపింది .ఫెడ్రిక్ డగ్లస్ అనే బానిస విమోచననాయకుడి ఇంట్లో పారిపోయిన బానిసలనుంచగా ఆయన , డబ్బు సమకూర్చి వారిని సురక్షితంగా కెనడా చేర్పించాడు . .తనమూడవ ఆత్మకధలో డగ్లాస్ ‘’ On one occasion I had eleven fugitives at the same time under my roof, and it was necessary for them to remain with me until I could collect sufficient money to get them on to Canada. It was the largest number I ever had at any one time, and I had some difficulty in providing so many with food and shelter. … “[65] The number of travelers and the time of the visit make it likely that this was Tubman’s group.

అమెరికన్ అంతర్యుద్ధం ప్రారంభమైనప్పుడు టబ్ మన్ యూనియన్ ఆర్మీలో వంటమనిషిగా చేరి, నర్సుగా పనిచేసి ,తర్వాత సాయుధ స్కౌట్ గా, స్పై గా సేవలు అందించింది .కాంబ్ హీ ఫెర్రీ పై సాయుధ దాడి జరిపిన మొదటి స్త్రీ నాయకురాలిగా గుర్తి౦పు పొందింది .ఈదాడి ఫలితంగా 700 మంది బానిసలకు శాశ్వత విముక్తి కలిగించింది .సివిల్ వార్ పూర్తయ్యాక 1859లో సైన్యం లో రిటైరై,న్యూయార్క్ దగ్గర ఆబర్న్ లో తాను కొనుక్కొన్న ఇల్లు, స్థలం లో ఉంటూ ముసలి తలితండ్రులను చూసుకొంటూ ఉంది .స్త్రీ వోటు హక్కు కోసం నిరంతరం పోరాటం చేసింది .తనకూ టబ్ మాన్ కు బానిసల సేవలో తేడా వివరిస్తూ డగ్లాస్ ఇలారాశాడు ‘’ The difference between us is very marked. Most that I have done and suffered in the service of our cause has been in public, and I have received much encouragement at every step of the way. You, on the other hand, have labored in a private way. I have wrought in the day – you in the night. … The midnight sky and the silent stars have been the witnesses of your devotion to freedom and of your heroism. Excepting John Brown – of sacred memory – I know of no one who has willingly encountered more perils and hardships to serve our enslaved people than you have.[66]

‘’మింటీ’’ అనే ముద్దు పేరుతొ పిలువబడిన ఈమె దాదాపు అయిదు అడుగుల ఎత్తు ఉండేది .ఆమె తప్పించుకు పోయాక ఆమెను పట్టి అప్పగిస్తే 40వేలడాలర్ల రివార్డ్ ప్రకటించారు .1860లో బానిసల ను విడిపించటానికి ఆమె చివరి ప్రయత్నం చేసింది .తనసోదరి రాఖేల్ ను,పిల్లలను విడిపించలేకపోయింది .మళ్ళీ తిరిగొచ్చాక రాఖేల్ చనిపోయిందని తెలిసింది .ఇద్దరు పిల్లల్ని విడిపించటానికి ఒక్కక్కరికి 30డాలర్లు ఖర్చు చేయాలన్నారు .అంతడబ్బు ఆమె వద్ద లేదు .కనుక వారిద్దరూ బానిసలుగానే ఉండిపోవాల్సి వచ్చింది .ఎన్నాలిస్ ఫామిలిని నార్త్ కు తీసుకు వెళ్ళటానికి సాయం చేసింది .చలి విపరీతంగా ఉంది .తిండిసరిగా లేదు .స్లేవ్ కాచర్స్ కంటబడకుండా ఎంతో నేర్పుగా ప్రయాణ౦ చేయించి 28-12-1860 న ఆబర్న్ లో ఉన్న డేవిడ్ ,మార్తాదంపతుల ఇంటికి చేర్చింది సురక్షితంగా .

చివరి రోజుల్లో ఆబర్న్ లో ఉంటూ అనేకపనులు చేస్తూ డబ్బు సంపాదించి ముసలి తలిదండ్రుల సంరక్షణ చేసింది .అక్కడే బ్రిక్ లేయర్ గా పనిచేస్తున్న అయిదు అడుగుల 11అంగుళాల పొడవున్న నెల్సన్ చార్లెస్ డేవిస్ తో ప్రేమలోపడి అతడు తనకంటే 22ఏళ్ళు చిన్నవాడైనా18-3-1869న పెళ్లి చేసుకొన్నది .ఈ దంపతులు ఒక అమ్మాయిని దత్తత చేసుకొన్నారు .భర్త నెల్సన్ టి.బి.వ్యాధితో 1888లో చనిపోయాడు .

టబ్ మాన్ అభిమానులు స్నేతులు ఆమెకోసం నిధి సేకరించి అందించారు.సారాహాప్కిన్స్ బ్రాడ్ ఫోర్డ్ అనే అభిమాని ఆమె జీవిత చరిత్రను ‘’సీన్స్ ఇన్ ది లైఫ్ ఆఫ్ హారియట్ టబ్ మాన్ ‘’పేరుతొ రాసి 1869ప్రచురించగా దీనిపై ఆమెకు 1200డాలర్ల ఆదాయం వచ్చింది .దీనినే మార్పులు చేసి ‘’హారియట్ ది మోజెస్ ఆఫ్ హర్ పీపుల్’’గా రాసి ప్రచురించాడు ఈ రెండు పుస్తకాలలోనూ ఆమెను ‘’జోన్ ఆఫ్ ఆర్క్ ‘’గా ప్రస్తుతించాడు.1896లో ‘’నేషనల్ ఫెడరేషన్ ఫర్ ఆఫ్రో –అమెరికన్ వుమెన్ ‘’ఏర్పడినప్పుడు ఆమె కీలక ప్రసంగం చేసింది .దేశమంతా ఆన౦దోత్సవాలు జరిపారు ..ఉమెన్స్ ఎరా ‘’అని ‘’ఎమినేంట్ వుమన్ ‘’అనీ పేపర్లన్నీ పెద్దపెద్ద శీర్షికలతో రాశాయి .1897లో బోస్టన్ పట్టణం ఆమెసేవకు జాతీయగౌరవం కలిపించి సత్కరించింది .

20వ శతాబ్ది ప్రారంభం లో అంటే 1903లో ఆబర్న్ లోని ‘’ ఆఫ్రికన్ మేధడిస్ట్ ఎపిస్కోపల్ జియాన్ చర్చ్’’కి తనకున్న రియల్ ఎస్టేట్ లోకొంత రాసిచ్చి ముసలి నల్లజాతి వారి సంక్షేమానికి ఒక భవనం కట్టించమని కోరింది .కాని అయిదేళ్ళ వరకూ ఆపని జరగనేలేదు.అందులో ఉండేవారు వందడాలర్లు ప్రవేశ రుసుముకట్టాలని నిబంధన పెడితే నిరాశ పడిఇలా అన్నది –‘’ ]hey make a rule that nobody should come in without they have a hundred dollars. Now I wanted to make a rule that nobody should come in unless they didn’t have no money at all.”[168]

కాని ‘’హారియట్ టబ్ మాన్ హోం ఫర్ దిఏజ్డ్’’ ను 23-6-1908 న ప్రారంభించినపుడు ఆమె గెస్ట్ ఆఫ్ ఆనర్ గా హాజరయింది .చిన్ననాటి తలగాయం మళ్ళీ బాధ పెట్టి తరచూ తలనొప్పి వచ్చేది ,దీనికి ఆమె బోస్టన్ లోని ‘’మెసా చూసేట్స్ జనరల్ హాస్పిటల్ ‘’లో మత్తుమందు లేకుండానే బ్రెయిన్ సర్జరీ చేయి౦చుకొన్నది .1911లో బాగా బలహీనమైతే ఆమెను ఆమెపెరనే ఉన్న వృద్ధాశ్రమం లో చేర్చారు .’’ఇల్ అండ్ పెన్నిలెస్’’గా ఉన్న ఆమె కోసం మిత్రులు అభిమానులు నిధి సేకరించారని న్యూయార్క్ పత్రిక రాసింది .స్నేహితులు కుటుంబసభ్యుల మధ్య న్యుమోనియాతో టబ్ మాన్ 10-3-1913 న 92వ యేట మరణించింది .ఆమెపేర మ్యూజియం లు చారిత్రక కట్టడాలు వెలిశాయి .ఆమె బొమ్మతో 20డాలర్ల నోటు 2016లో ముద్రించి గౌరవించారు .హారియట్ టబ్ మాన్ ప్రైజ్ ఏర్పాటయింది .ఆమె జీవితం సేవలపై నాటకాలు నవలలు రేడియో టివి షోలు సినిమాలు వచ్చాయి .నాటకశాలలు ,సినిమాహాళ్ళు నిర్మించారు .చాలా అవార్డులు ఆమె పేరిట నెలకొల్పారు .2007లో ‘’హారియట్ టబ్ మాన్ –మిత్ ,మెమరి అండ్ హిస్టరీ ‘’అనే గొప్ప పుస్తకం విడుదలై ఆమెను చిరస్మరణీయురాలను చేసింది .

–గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో