ఎక్కడ భద్రత మానవ మృగాల మధ్య ? వన్య మృగాల మధ్య .- సంపాదకీయం – అరసిశ్రీ

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన కరోనా వ్యాక్సీన్ వచ్చిన ఆనందం నిలవనే లేదు . కొత్త ఏడాదిలోకి కోటి ఆశలతో అడుగు పెట్టం . పట్టుమని ఒక నెల కూడా పూర్తి కాకుండానే భయంకరమైన సమాజంలో బ్రతుకుతున్నాం అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు .

మనుషులం అని కూడా మర్చిపోయి మృగాల కంటే నీచంగా , హీనంగా ప్రవర్తిసున్న ఈ కామ పిశాచులను చూస్తుంటే భయం వేస్తుంది. ఒకటి కాదు రెండు కాదు సగటున దేశంలో రోజుకి 10 కేసులైన వెలుగులోకి వస్తున్నాయి , కాని అలా వెలుగు చూడని కేసులు ఇంకెన్నో . అలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం అంటే సిగ్గేస్తుంది . రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా మహిళలపై నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి .

మధ్యప్రదేశ్‌లోని ఉమారియా జిల్లాలోని అటవిలో జనవరి 4న 13 ఏళ్ల బాలికపై తొమ్మిదిమంది మృగాళ్లు. ఐదురోజుల పాటు లెక్కలేనన్ని సార్లు అత్యాచారం చేసారు . ఆ యువకుడు ఆ బాలికకు తెలిసిన వ్యక్తే కావటంతో పాపం అతన్ని పూర్తిగా నమ్మి వెంటే వెళ్లింది. అలా ఆ బాలికను నమ్మించి తీసుకెళ్లిన ఆ యువకుడు అక్కడికి సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లాడు. అనంతరం అతనితో పాటు ఆరుగురు స్నేహితులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అలా ఈ నెల 5న బాలికను వదిలిపెట్టాడు.

తర్వాత 11న మళ్లీ ఆ బాలికను అత్యాచారం చేసివారిలో ఒకడు మళ్లీ కిడ్నాప్‌ చేసి..మరోసారి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి మరో ముగ్గురితో కలిసి ఘాతుకానికి పాల్పడ్డారు. మరో ఇద్దరు ట్రక్‌ డ్రైవర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాలిక శుక్రవారం అలా అత్యాచారం జరిగేసరికి ఆ బాధ భరించలేక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణానికి పాల్పడినవారిలో ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని..మిగతా వారిని పట్టుకుంటామని చెప్పారు. పోస్కో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్‌ అధికారులు చెప్పారు.

మరొక సంఘటన కొన్నేళ్లు కాపురం చేసి నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వయసులో , ముఖ్యంగా కాటికి కాళ్లు చాపిన వయసులో కర్కశంగా ప్రవర్తించాడో భర్త. మహారాష్ట్రలోని డోంబివ్లిలో భార్యను కత్తితో పొడిచి చంపి, ఇంట్లోనే నిప్పంటించాడు భర్త బలిరామ్‌ పాటిల్‌వయసు 84 . బలిరామ్‌ ముక్కోపి, ప్రతీ చిన్న విషయానికి సీరియస్‌ అయ్యేవాడు. దీంతో భార్యతో ఎప్పుడూ గొడవపడేవాడు. ఆదివారం తెల్లవారుజామున కూడా భార్యతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన బలిరామ్‌ భార్యను కత్తితో పొడిచి చంపేశాడు.

ఇంకా కుల వివక్షత ఎంతగా పెరిగిపోతుందో అనడానికి నిదర్శనం దళిత మహిళను వివస్త్రను చేసి, విచక్షణా రహితంగా ఆమెపై దాడి చేశారు ఇద్దరు. ఈ సంఘటన రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వెలుగుచూసింది. ఉదయ్‌పూర్‌, ఆలోద్‌ గ్రామానికి చెందిన సోసర్‌ బాయి అనే ఓ దళిత మహిళ కొద్దిరోజుల క్రితం అదే గ్రామానికి చెందిన చాందీ బాయితో గొడవపడింది. 28న సోసర్‌ ఇంటివద్ద బట్టలు ఉతుక్కుంటుండగా చాందీ బాయి ఆమె కుమారుడు కిషన్‌ తెలి బైక్‌పై అక్కడికి వచ్చారు. అనంతరం చాందీ, సోసర్‌ చేతుల్ని వెనక్కు విరిచి పట్టుకుంది. కిషన్..‌ సోసర్‌ను విచక్షణా రహితంగా కొట్టాడు. ఆ తర్వాత ఆమెను వివస్త్రను చేసి ఇద్దరూ సైకిల్‌ చైన్‌తో కొట్టారు. దీంతో బాధితురాలి వేళ్లు విరిగిపోయాయి. విపరీతంగా దెబ్బలు తగిలాయి. ఆమె సహాయం కోసం ఎంత అరిచినా జనం రాలేదు. దెబ్బలు తాళలేక స్పృహ కోల్పోయింది.

ఉత్తర ప్రదేశ్ ఉన్నవ్ లో ప‌చ్చి బాలింతరాలైన బాలిక‌పై ఓ బాలుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. 15 ఏండ్ల బాలిక త‌న త‌ల్లి తండ్రి చ‌నిపోవ‌డంతో గ‌త కొన్నేండ్లుగా ఇద్దరు త‌మ్ముళ్ల‌తో క‌లిసి అమ్మ‌మ్మ ఇంట్లో ఉంటున్న‌ది. ఇటీవ‌ల డెలివ‌రీ కోసం అమ్మ‌మ్మ ఇంటికి వ‌చ్చింది. గురువారం పురిటి నొప్పులు రావ‌డంతో బాలిక‌ను జిల్లా ఆస్ప‌త్రికి త‌రలించారు. అక్క‌డ ఆమె ఓ పాప‌కు జ‌న్మ‌నిచ్చింది. శుక్ర‌వారం ఉద‌యం ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయిన ఆమె తిరిగి అమ్మ‌మ్మ ఇంటికి చేరింది.బాలిక ఒంట‌రిగా ఉన్న‌ది గ‌మ‌నించిన ప‌దాహారేళ్ళ కుర్రాడు అఘాయిత్యానికి ఒడిగ‌ట్టాడు.

మరొక చోట సామూహిక అత్యాచారం . రాయ్‌బ‌రేలీ జిల్లాలో 15 ఏండ్ల బాలికై సామూహిక అత్యాచారం జ‌రిగింది. బ‌రేలీ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక‌ గ‌త బుధ‌వారం మ‌ధ్యాహ్నం ప‌శువులకు గ‌డ్డి కోసుకొచ్చేందుకు త‌న ఇంటి నుంచి పొలం వైపు వెళ్తుండ‌గా.. అదే గ్రామానికి చెందిన ష‌కీర్ అత‌ని సోద‌రుడు షాహిద్) ఆమెను అడ్డ‌గించారు. అనంత‌రం ఇద్ద‌రూ క‌లిసి ఆమెను ప‌క్క‌నే ఉన్న చెరుకుతోట‌లో ఇద్ద‌రూ క‌లిసి బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

కామపిశాచిగా మారిన టీచర్ . పారామెడికల్‌ టీచర్‌ ఒక బాలికపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం విష ప్రయోగం చేశాడు. దీంతో ఆ బాలిక మరణించింది. జార్ఖండ్‌లోని పలామౌ జిల్లాలో ఈ దారుణం జరిగింది. 35 ఏండ్ల శంబు సింగ్ పారామెడికల్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. 13 ఏండ్ల విద్యార్థినిపై తరగతి గదిలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు ఆమెపై విష ప్రయోగం చేశాడు. దీంతో బాధితురాలి ఆరోగ్యం విషమించడంతో ఆమె చనిపోయింది.

బ్యాంక్‌ మేనేజర్‌ బాలికపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఆపై ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాల‌ను వీడియో తీసి బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడ్డాడు. ఇండోర్‌లో జరిగిన ఈ సంఘటనలో మొహాలీకి చెందిన ఓ బాలిక‌కు త‌న‌ స్నేహితురాలి ద్వారా 53 ఏళ్ల బ్యాంక్‌ మేనేజర్ ప‌రిచ‌య‌మ‌య్యాడు. దాంతో అతడు ఆ బాలిక‌ను అప్పుడప్పుడు షాపింగ్‌కు‌ తీసుకెళ్లేవాడు. షాపింగ్‌కు అని చెప్పి ఓ రోజు బాలిక‌ను హోటల్‌ గదికి తీసుకెళ్లాడు. అక్క‌డ ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అంతేగాక అత్య‌చారం చేస్తూ వీడియో తీశాడు. ఆ తర్వాత కూడా వీడియో సోష‌ల్ మీడియాలో పెడుతాన‌ని బ్లాక్‌ మెయిల్ చేస్తూ ప‌లుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.

గోరఖ్‌పూర్ లో పశువులకు మేతకోసం వెళ్లిన మైనర్‌ బాలికపై దుండగులు లైంగిక దాడికిపడ్డారు. అంతటితో ఆగకుండా ఆమెను హత్యచేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. రాష్ట్రంలోని మహారాజ్‌గంజ్‌ జిల్లా పురెందర్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నది. బాధితురాలి తల్లి పశువుల మేతకోసం అడవిలోకి వెళ్లింది. గడ్డిని ఇంటికి తీసుకువెళ్లడానికి సైకిల్‌ తీసుకుని రావాలని తన 12 ఏండ్ల కూతురికి చెప్పింది. దీంతో తల్లి వెళ్లిన కొద్దిసేపటికి ఆ బాలిక అడవిలోకి వెళ్ళింది . అయితే ఆ బాలిక ఎంతసేపైనప్పటికీ తన వద్దకు రాకపోవడంతో.. ఆమె వెతకడం ప్రారంభించింది. అదే రోజు సాయంత్రం పొద్దుపోయిన తర్వాత అడవీ ప్రాంతంలో ఆ బాలిక సైకిల్‌, చెప్పులు కనిపించాయి. కాగా, తర్వాత రోజు బాలిక మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు.

మరొక చోట ఇద్దరు యువకులు నిత్యం లైంగిక వేధింపులకు గురిచేస్తుండటంతో పదవ తరగతి బాలిక బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది. కాన్పూర్‌కు సమీపంలోని అసలత్‌గంజ్‌ పట్టణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు తనను లైంగికంగా వేధిస్తున్నారని రాసిన లేఖ బాధితురాలి గదిలో లభ్యమైందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు కేసు విచారణ చేపట్టారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముంబాయి హైకోర్ట్ లో వచ్చిన తీర్పు మరొక సంచలనం .

చేతితో తాక లేదు కాబట్టి లైంగిక వేధింపులుగా పరిగణలోకి తీసుకోలేము అంతో వచ్చిన తీర్పు సంచలనం కలిగించింది. ఎదుటి వ్యక్తి మానసికంగా హింసించడం అనేది శరీరాన్ని తాకడం వలెనే కాకుండా మాటలు , చూపులు అనేవి కూడా ఎంతటి మానసిక వ్యధని కలిగిస్తాయో అన్నది పరిగణనలోకి తీసుకోకపోవడం వ్యక్తుల లోపమా , వ్యవస్థ లోపమా ? . ఈ తీర్పుతో లైంగిక వేధింపులు అంటే ఏమిటి అనే చర్చ మొదలైయ్యింది .

లైంగికపరమైన వేధింపులు, దీనిని ఆంగ్లములో సెక్సువల్ హెరాస్మెంట్ అని అంటారు. కన్నార్పకుండా చూడడం, సైగలు చేయడం, తాకడం లేదా అసభ్య కరమైన వ్యాఖ్యానాలు చేయడం వంటి ‘సెక్స్’ పరమైన అనుచితమైన ప్రవర్తనను లైంగిక వేధింపులు అని పరిగణిస్తున్నాం . ఒక వైపు రోజు రోజుకి వయసుతో సంబంధం లేకుండా జరుగుతున్న ఆ అఘాత్యాలకి అడ్డు కట్ట లేకుండా ఇలాంటి తీర్పులు యువతను ఎలాంటి దారిలో వెళ్ళేలా చేస్తాయో అనేది ఆలోచించాలి .

ఈ నెల రోజుల్లోనే ఎన్నో కేసులు వెలుగులోకి వచ్చాయి . కాని ఈ కేసులు అన్నింటిలోనులోను చివరికి పరిణామాలుఏంటి ? తీర్పు ఎలా ఉంది ? నిందితులకి ఎలాంటి శిక్ష పడింది అంటే మాత్రం ప్రశ్నార్ధకమే ?.

చట్టాలు , ప్రభుత్వాలు , సమాజం ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. మనం ఎక్కడ జీవిస్తున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో మన ఇంటి ఆడపిల్ల ఉంది అని.

కాని ఒక మాత్రం నిజం ఎన్ని చట్టాలు ఉన్నా అవి సక్రమంగా ఆమలు జరుగుతున్నాయా లేదా అనే రీకాల్ లేనప్పుడు, ఒక తప్పు జరిగితే దానికి పరిణామం ఇలా ఉంటుంది అనే భావన , భయం సమాజంలోని వ్యక్తుల మీద లేనంత వరకు  ఇటు వంటి అమానుషాలే జరుగుతాయి . ఇలాంటి ఘోరాలే చూడాల్సి వస్తుంది .

చివరికి ఈ సమాజ మృగాల మధ్య కన్నా

ఆ వన్య మృగాల మధ్యే ఉనికి ప్రశాంతంగా ఉంటుందెమో అనిపిస్తుంది  .

 

-అరసిశ్రీ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయంPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో