పది వసంతాల విహంగం -వెంకటేశ్వరరావు కట్టూరి.

అడవిచెట్ల మధ్య సుగంధ పరీమళాలు వెదజల్లే పూల మొక్కలు,వాటి నీడలో ఎదుగుదల లేక కృశించి పోయినట్లు.తెలుగు సాహిత్యంలో పేరున్న కవులు,రచయితలు మాత్రమే సాహిత్యంలో దూసుకుపోతున్నారు.కొత్తగా రాసేవాళ్లకు పెద్ద పెద్ద పత్రికలు బాసటగా నిలబడవు.గొప్పగొప్ప సాహిత్యం రాసేవాళ్ళు నేడు చాలామంది యువ కవులూ, రచయితలు పుట్టుకువస్తున్నా.వారు రాసే సాహిత్యానికి సరైన వేదిక లేక తగిన గుర్తింపును పొందలేకపోతున్నారు.

ముఖ్యంగా మహిళలు,వెనుకబడిన వర్గాల నుండి తెలుగు సాహిత్యం లోకి వచ్చే రచయితలకు సరైన వేదిక లేక తెలుగు సాహిత్యంలో రావలిసినంత గుర్తింపు పొందలేకపోతున్నారు.అటువంటి వారికోసం నేనున్నాను మీకంటూ “విహంగ”మై దశదిశలా మీ సాహితీపరీమళాలను నా రెక్కలపై వెదజల్లుతానంటూ, ఎంతోమంది నూతన కవులకు,కథారచయితలకు భరోసా నిచ్చారు డా.పుట్ల హేమలత.’విహంగ’ని తొలి తెలుగు వెబ్ పత్రిక గా11-11-2011న అంతర్జాలపు విను వీధుల్లో సగర్వంగా ఎగరేశారు డా.పుట్ల హేమలత.’విహంగ’మ్యాగజైన్ “వ్యక్తి స్వేచ్ఛ ను,అక్షర స్వేచ్ఛ ను గౌరవిస్తుంది”అని అన్నట్లుగానే విహంగ రచనలు అంతర్జాలమయ్యాయి.”విహంగ”నేడు పది వసంతాలు పూర్తి చేసుకుని సగర్వంగా సాహిత్య వినువీధుల్లో స్వేచ్ఛగా విహరిస్తోంది.

‘విహంగ’తో నా ప్రయాణం 2018 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మా గురువుగారైన ఆచార్య.ఎండ్లూరి సుధాకర్ దగ్గర పరిశోధక విద్యార్థిగా చేరాను.మా గురువుగారితో పాటు వారి జీవిత భాగస్వామి డా.పుట్ల హేమలత గారు కూడా తెలుగు యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.అప్పుడే పరిచయం అయ్యారు డా.పుట్ల.అప్పటివరకు సాహిత్యం అంటే ఏమాత్రం పరిచయం లేని నాకు ‘విహంగ’మ్యాగజైన్ ను పరిచయం చేశారు హేమలత గారు.మా గురువుగారు సుధాకర్ ప్రముఖ రచయిత శరవణ్ కుమార్ లింబాలే మరాఠీలో రచించిన ‘అక్కర్ మాషి’ పుస్తకాన్ని తెలుగులో ‘అక్రమ సంతానం’ పేరుతో అనువాదం చేశారు.

ఆపుస్తకం చదివిన ప్రేరణ తో ‘మేమేవరం’అనే కవిత రాసి మా మేడం హేమలత గారికి పంపించాను.వారు ఆ కవితను ‘విహంగ’మ్యాగజైన్ లో ప్రచురించారు అదే నా మొదటి కవిత.ఆ తర్వాత కాలంలో ‘విహంగ’పత్రికకు కథలు,కవితలు,సాహిత్య వ్యాసాలు సేకరించడం వంటివి నేర్పించారు డా.పుట్ల.అప్పటికే హేమలత గారి ప్రియ శిష్యులు అరసి శ్రీ,రవికుమార్ లు హేమలత గారికి చెరో రెక్కై “విహంగ”ను వినువీధుల్లో విహరింప జేస్తున్నారు.సాహిత్యం లో ఓనమాలు కూడా తెలియని నాచేత నా కవితాక్షర తల్లి కవితలు రాయడం,సాహిత్య వ్యాసాలు రాయడం నేర్పించారు.’విహంగ’ ద్వారా తెలుగు సాహిత్యంలో చాలామంది కవులను,రచయితలను కలిసి వారితో మాట్లాడే అవకాశాలు కల్పించారు హేమలత మేడం.పేరుకి మేము సుధాకర్ గారి శిష్యులమైనా,హేమలత గారితో ఎక్కువ అనుబంధం ఉండేది.అంతలా ఆదరించేవారు హేమలత మేడం.’విహంగ’ను హేమలత మేడం ను విడిగాచూడలేము.పరిశోధన,విహంగ రెండు కళ్ళు హేమలత గారికి.
9.2.2019న హేమలత గారు
“ఈ మాటచివరిది
ఈ చూపు చివరిది
పైవాడు సిద్ధపరిచిన పూలరథం”వచ్చేసిందంటూ
ఈ లోకాన్ని విడిచి మహిమ ప్రవేశం చేశారు.సాహిత్య లోకాన్ని దుఖఃసాగరంలో నింపి విహంగమై ఎగిరెళ్లిపోయారు.ఆ తర్వాత కాలంలో మా సోదరి ప్రముఖ కథా రచయిత్రి హేమలత సుధాకర్ గార్ల బిడ్డ మానస ఎండ్లూరి “విహంగ”మ్యాగజైన్ బాధ్యత తీసుకొని అమ్మ వదిలి వెళ్ళిన పనులన్నీ పూర్తి చేయాలి. తెలుగు సాహిత్య లోకంలో “విహంగ”మరింతగా ఎగరాలని,ఎదగాలని పత్రిక బాధ్యతలు తన భుజాలపైకెత్తుకు మోస్తున్నారు.నూతన కవులను, రచయితలను ప్రోత్సాహిస్తూ,మహిళా రచయితలను వారి రచనలను విహంగ అంతర్జాల పత్రిక ద్వారా పరిచయం చేస్తున్నారు.అలాగే ప్రతీ నెలా ‘విహంగ’ లో ఒక దళిత మహిళా రచయితను వారి సాహిత్యాన్ని ముఖాముఖి(ఇంటర్వ్యూ)ద్వారా పరిచయం చేసే అవకాశాన్ని నాకు కల్పించారు మానస.మాగురువు గారి ఆశీస్సులతో ‘విహంగ’కు వెన్నుదన్నుగా ఉంటూ,తమవంతు సహకారాన్ని అందిస్తున్న అరసి శ్రీ,రవి లు మానస ఎండ్లూరి కి ‘విహంగ’మహిళా పత్రికకి తోడుగా ఉంటూ ‘విహంగ’ని తెలుగు సాహిత్యం లో నూతన ఒరవడి సృష్టిస్తూ ముందుకు దూసుకు పోవాలని కోరుకుంటున్నా.

తెలుగు సాహిత్యంలో నాకు ‘విహంగ’ ద్వారా దారిచూపి,సాహిత్యం లో చోటు కల్పించిన నా కవితాక్షర తల్లి స్వర్గీయ.డా౹౹పుట్ల హేమలత గారికి మా గురువుగారు ఆచార్య.ఎండ్లూరి సుధాకర్ గారికి మా సోదరి మానస కు ముప్పిదాలతో….

-వెంకటేశ్వరరావు కట్టూరి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

శుభాకాంక్షలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments