1.వాచక పుస్తక భాష
పిల్లల మస్తక ధ్యాస
కొత్తగ ఉండాలెప్పుడు
భాషే సదా మన శ్వాస
2.భాషలో ఎన్నో సొగసులు
భావనలు కరుగు దినుసులు
పఠనవేళ పరిమళించు
పులకించు రసిక మనసులు
3.రసాత్మకమైన వాక్యం
నవరసాలొలుకు కావ్యం
రవళించు ఎద ముంగిట
తేనెలూరు రసశ్రావ్యం
4.నది నడక నా కాదర్శం
ఆత్మానుసార మవశ్యం
బాధల బండలు తాకిన
గమ్యం చేరుట నాయత్నం
5.ఏనుగు నెక్కినవాడు
ఎదుగుదల కోరతాడు
ప్రజాసహకారంతో
నాయకుడిగ మారతాడు.
-డా.వూటుకూరి వరప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~