ఆమెకు విజయం ఎప్పుడో?(కవిత )యలమర్తి అనూరాధ

కళ్ళు నులుపుకునే తీరిక ఉండదు
ఉదయం లేచీ లేవగానే చీపురుతో స్నేహం
స్వచ్ఛభారత్ పనిలో అనుక్షణం
పారిశుద్ధ కార్మికుని మించి..
క్షణక్షణం ఆరోగ్యం గురించి తపన
కుటుంబం అంతటినీ భుజస్కంధాల మీద మోస్తూ
వైద్యుని తరహాలో నిరంతరం
కంటికి రెప్పలా కాపాడుకుంటూ..
అక్కడ దేశాన్ని చక్కబెడుతూ సైనికుడు
ఇక్కడ ఇంటిని చక్కబెడుతూ
గృహిణి
ఒకరికొకరు తీసిపోరు ఎన్నడూ
బాధ్యత బరువు ఒక్కటే
ఆ పనీ ఈ పనీ అని చిట్టాలు పట్టాలు ఉండవు
అందరి పనులూ ఆమెవే
అలకలు బుజ్జగింపులు అదనం
అంత చేస్తున్నా విలువ లేదే
గుర్తింపు లేని పని
ఆదాయం లేదని ఎగతాళి
కరోనా పుణ్యమా అని
అన్నింటా ఆమై
అందరి ఇష్టాలనూ కోరికలనూ తీరుస్తూ
తనకేం కావాలో మర్చిపోతూ
రెండు చేతుల్ని ఎనిమిదిగా చేసుకుంటూ
అన్ని పనులు చేస్తున్నా ప్రశంసించే వారు ఒక్కరూ లేరే
లాక్డౌన్ పుణ్యమా అని
అందరూ ఇంట్లోనే బంధీల్లా
నోటికి లేదే తాళం
రుచుల పంట కావాలని
రోజంతా డ్యూటీ మాత్రం ఆమెదే
వర్క్ అట్ హోమ్ కి నిర్వచనంలా
నిస్వార్థ ప్రేమకు వెల కట్ట గలమా?
అలనాటి సత్యభామ నరకాసురుని వధించి
చీకట్లను ఛేదించి వెలుగులను విరజిమ్మినట్లు
కరోనాను తరిమెయ్యటం లోనూ
ధైర్యం.. స్డైర్యం అన్నీ.. అన్నీ
ఆమెగా అవతరణ
విజయం కోసం పోరాటం లో ప్రముఖ పాత్ర
దీపాలన్నా ..చప్పట్లన్నా ముందే
ఆమెకు గెలుపు సిద్ధించేదెప్పుడో ?
కరోనాని తరిమేసేదెప్పుడో?!?

-యలమర్తి అనూరాధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments