నజరానా ఉర్దూ కవితలు – అనువాదం ఎండ్లూరి సుధాకర్

రాత్రి కూడా కాబోతూంది
ఆమె ఇంకా రాలేను నడచి
పొద్దుటి నుంచి పడిగాపులు పడుతున్నాను
నేలపై నా చూపులు పరచి

  -ఇషారత్ లుధి యాన్వీ

సర్వేశ్వరా ! నవ్వు సృష్టించిన
సుందరాంగుల్ని చూస్తే ఇలా అనిపిస్తుంది
ఏ ముఖాన్ని చూసినా వెంటనే
హృదయానికి హత్తుకోవాలనుంటుంది .

-అక్బర్ ఇలాహాబాదీ

ఇవాళ హృదయాన్ని
దివాళా తీసి కూర్చున్నాను
కొంత సంతోషమూ దొరికింది
కొంత దుఖమూ మిగిలింది .

-జిగర్

వాతావరణం రసహీనంగా ఉంది
నీ ప్రేమ లేకుండా !
ఎలా పుచ్చుకొను మధువు ?
ఏ నేస్తమూ రాకుండా !

-జఫర్ గోరఖ్ పురీ

– అనువాదం ఎండ్లూరి సుధాకర్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments