*వైద్యులే దేవుళ్లు*(కవిత )-ధనాశి ఉషారాణి

సేవ దైవము అనుకోని
ప్రతిది సేవ కోసము
నిలిచి నిత్య సేవలో
ప్రజల సేవ కోసమై
సిరుల భవిత ఫణముగా
పెట్టు మనసు ఉన్నటి
మానవత్వ మణిపూస
తెల్ల కోటు వేసిన
శాంతి నింపు కున్నట్టి
ప్రాణ గురువు సేవగా

మనిషి మెచ్చ రోగాల
మలినమoదు మమతలు
నిండు గాను కూర్చిన
నిజపు మానవత్వము
సిరుల రూపు వైద్యులు
ప్రాణము తీసె వ్యాధిని
మనసు నిబ్బ రముతోను
ఏది రించు నిలిచేను
కన్న బిడ్డ లాగాను
కాచు గురువు మనిషిలో

-ధనాశి ఉషారాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments