స్వప్న భాష్యాలు -2-డినైడ్ బై అల్లా (పుస్తక సమీక్ష )-స్వప్న పేరి

పుస్తకం పేరు: డినైడ్ బై అల్లా
రచయిత: నూర్ జహీర్

నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాసిన చాలా పుస్తకాలు ఉన్నాయి. గతంలో నేను కూడా కొన్ని చదివాను. ఒక్కోసారి ఇటువంటి పుస్తకాలు ఒకరి మెదడుపై చాలా బలమైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ పుస్తకం కూడా అక్షరాలా నా ఆలోచనలను వెంటాడుతోంది. కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా, రచయిత్రి నూర్ జహీర్ అటువంటి కథాంశాన్ని స్క్రిప్ట్ చేసారు. ఇది చదివిన చాలా రోజులకి కూడా మీ మనస్సును వదలదు. అంత ప్రభావితం చేస్తుంది.

మతం మరియు చట్టాల పేరిట మహిళలపై జరిగే దారుణాలను ప్రదర్శించే చాలా బలంగా కను విప్పు చేసే కధనం ఈ పుస్తకం, ‘ డెనైడ్ బై అల్లా.’ ‘అల్లా చేత తిరస్కరించబడింది’ అన్న అర్ధంతో వచ్చిన ఈ పుస్తకము, 2015 లో మార్కెట్ లోకి వచ్చింది. మహిళల పైన జరిగే అనేక ఘటనలను ఇందులో ఉండడం చేత, చాలా మంది ముస్లిం మత పెద్దలు పెద్ద పెద్ద సభల్లో, సామాజిక మాధ్యమాల్లో నూర్ జహీర్ గారిని చాలా అవమానించారు. సినిమాల సమీక్షలు లేదా ఏదైనా కధలు రాసుకోకుండా ఇలాంటి పుస్తకాలు ఎందుకు రాయడం అని ఆమెని అవమానించారు .

భారతదేశం వంటి లౌకిక దేశంలో ముస్లిం సమాజంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని పుస్తకం చదివి తెలుసుకోవడం నాకు చాలా ఆశ్చర్యం. ఏమో! నేను ఈ పుస్తక పరిచయం రాస్తున్నప్పుడు ఎక్కడో అక్కడ ఒక ముస్లిం యువతి లేదా మహిళా పైన అత్యాచారం జరుగుతున్నదేమో అన్న భయం కూడా కలుగుతోంది. అంతా బలంగా ఉంది పుస్తకంలోని కథనం & ఈ రోజు ప్రబలంగా ఉన్న పద్ధతులకు నేపథ్యం ఇవ్వడానికి రచయిత ఖురాన్ మరియు చారిత్రక రచనల నుండి భాగాలను పుస్తకంలో కలిపారు.

పుస్తకం చదివిన తరువాత, నాలో చాలా కోపం, వేదన, భావోద్వేగాలు, విచారం & నిస్సహాయత కలిగాయి. హింసకు గురైన స్త్రీని ఊహించిడం చాలా బాధగా ఉంది. చిన్న చిన్న సర్దుబాట్లు కట్టుబాట్లలో పెరిగిన నా ఫ్రెండ్ నస్రీన్ గుర్తొచ్చినా, తనకి ఇటువంటి కష్టాలు రాకూడదని ఆ అల్లాని మొక్కుకున్నాను.
ఈ పుస్తకాన్ని.రాసినందుకు రచయిత్రి నూర్ జహీర్ గారికి హ్యాట్స్ ఆఫ్. దీని గురించి అనేక చర్చలు జరిగాయని తెలుసుకున్నాను, కాని ఈ మధ్యకాలంలో ట్రిపుల్ తలాక్ సమస్యల గురించి న్యూస్ ఛానెల్స్ మరియు మ్యాగజైన్స్ ఎక్కువగా మాట్లాడటం వల్ల నేను ఈ పుస్తకానికి కనెక్ట్ అయ్యాను. ఇది ఒక్ ఆసక్తికరమైన రీడ్. నాకు తెలియని, ఎప్పుడు వినని లేదా ఊహించని రకమైన కొన్ని చట్టాలు రచయిత్రి ఈ పుస్తకంలో వివరించారు. చట్టం సాకుతో మహిళలపై జరిగిన దారుణాలకు నిజ జీవిత ఉదాహరణలను ఈ పుస్తకం అద్దం పడుతుంది.

–స్వప్న పేరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments