దశ వసంతాల విహంగం -నాగరాజు.జి

తెలిసి తెలియక మొదలైన పయనం
ఎక్కడ ఆగిపోతుందో అనే చిన్న భయం
రాసిన ప్రతీ పదం తప్పొప్పులు దిద్దేవారు ఎవరు
విమర్శ ద్వారా రాయిని కూడా రత్నంలా మార్చేదెవరు
దారి తెలియని ప్రయాణానికి మార్గదర్శి ఎవరు
ఈ ప్రశ్నలతో సతమతమవుతున్న నాకు స్నే” హితుని” చొరవ ద్వారా
హిమభానుని చల్లని కిరణాలు నన్ను తాకినట్టుగా
హేమలత గారి అమృతహస్తం అభయమిచ్చి,అవకాశం కల్పించి,
నీలికలువలు ద్వారా వికసించే తోడ్పాటు అందించి
నాపై నాకే నమ్మకం కల్పించిన బంగారు తల్లికి
ప్రజలకు పరిచయం చేసిన విహంగకు
మనస్ఫూర్తిగా ఇవే నా ధన్యవాదాలు

-నాగరాజు.జి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

శుభాకాంక్షలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments