వారు
ఇద్దరూ ఇద్దరే
వారి స్నేహానికి రెండు కళ్లు.
కలసి నడిచారు
మెలిసి మెలిగారు.
తెలిసి బతికారు.
ఓ పగలు
రాత్రితో విభేదించి
ముక్కలైన ఆకాశంలో
మబ్బు తునక తరిమి
మెరుపు ముక్క ఉరిమి
ఒకరిలో ఒకరు మునిగి
చూసుకోలేంత లోతుగా
చేరుకోలేంత దూరంగా
చెరొక వైపు నెట్టివేయపడ్డారు.
ఉధృతంలో..ఉద్రేకంలో
పలుకు పడవ
నడక సడలి…
మరో తీరం
చేరితే
మనో రూపం మారితే
కెరటాలు
కాళ్లతో పొడిచి
అలలకు చెవులు మొలిచి
ఇసుక దుప్పటి
తొలగి
ఒడ్డు ఒడిలో మేల్కొని
స్నేహ తీరాల్లో
తీపి అలల్లో
తిరిగి తేలియాడారు.
-సాహితి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~