వాడెవ్వడు (కవిత )- గిరి ప్రసాద్ చెలమల్లు

 

 

 

 

జొన్న కంకి
కొడవలి లిక్కి కి ఎదురు తిరిగింది

సజ్జ కంకి ని
పిట్ట నోటికి రుచి దొరక్క వదిలేసింది
చొప్పదంటుని గొడ్డు ముట్టుకోట్లే

వరి వంగడాలు వంగితే లేవట్లే
ఎనకటి రుచీ లేదు బలమూ లేదు

పత్తి గింజ
భూమిలో నాటితే లోపలే కుళ్ళింది

మొక్క జొన్న మొలకెత్తలే
మిరప ఏపుగా పెరిగి కాయ కాయలే
వేరుశనగ కి వేరే పుట్టలే

ఈ రోగం ఎందుచేత?!
గీ గింజలన్నీ గా బాడకవ్ లేగా చేసేది
పంట దిగుబడి రాకపోతే మొహం చాటేస్తుండ్రు గా
మళ్ళీ గిప్పుడు గా బాడ్కవ్లే మంచి ధరిచ్చి
గొంటరంటే గొర్రె ని కాదుగా నేను నమ్మనీకి

తరాల అనుభవం
ఏ నేల ఏ పంటకు అదునెప్పుడు
ఎరుకయ్యెటోణ్ణి నేను
గాడెవ్వడో జెబితే పంటేస్తే
పండక పోతే ఎవ్వడిస్తడు పరిహారం!!

వీడిస్తడా వాడిస్తడా
ఎవ్వడి జాగీరిది
హుకుం జారీకి

నేను బతకాలంటే
రేపటికి తిండి కావాలంటే
నాగలి కర్రు వాళ్ళ గొంతులో దిగాలి

– గిరి ప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments