నజరానా ఉర్దూ కవితలు – అనువాదం ఎండ్లూరి సుధాకర్

 

 

 

 

 

 

నా కన్నీళ్ళని నేను
చప్పరిస్తున్నా కూడా
లోకమంటోంది
“వీడు త్రాగుబోతు గాడా “?

                                             -నరేష్ కుమార్ ‘షాద్ ‘

చూడు చూడు ఇతగాడు
“మత పెద్దలా “ఉన్నాడు
పానశాలకు దారి చూపమని
పదే పదే అడుగుతున్నాడు

-షకీల్ బదాయునీ 

నీ నిషా కళ్ళను చూస్తుంటే
నాకు భయమేస్తుంది
ఏదో ఒకరోజు ఏదో తాగించేసి
అవి నన్ను దోచేస్తాయనిపిస్తుంది.

   -అజ్ఞాత కవి 

నీ ప్రతి  ఓర చూపూ
నిజంగా అది నాకు
ఒక బాణం ఒక ఖడ్గం
ఒక్కొక్కప్పుడది పిడిబాకు.

 -సాజన్  షెషా వారీ 

అనువాదం: –ఎండ్లూరి సుధాకర్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments