ప్రేమ లోకం(కవిత )-యలమర్తి అనూరాధ

చిరుగాలి పలకరిస్తే
నీ తలపు
పరిమళం ఎదమీటితే
నీ జ్ఞాపకం
వెన్నెల మురిపిస్టే
నీ జ్ఞాపకం
పువ్వు మేను తాకితే
నీ ధ్యాస
క్షణం క్షణాన్ని కదిలిస్తే
నువ్వే
కనురెప్పల మాటున
నీ రూపం
తెరిచినా
నీ ప్రపంచమే!

యలమర్తి అనూరాధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.