మణి పూసలు-డా.వూటుకూరి వరప్రసాద్

 

 

 

 

1.సరిగమల మధురిమలు
సాహిత్య రసధునులు
కలిపి’బాలు’ఆలపించె
తెనుగు తేనె పల్లవులు.

2.పాట రాగ మోహనమై
ఏటి నీటి వాహినియై
మనసు నోల లాడించెను
స్వర రాగ తరంగమై

3.’పాడుతా తీయగా’యని
చిట్టికోయిలల ఆమని
స్వరాభిషేకం చేసె
తెలుగు పాటలాయె అవని.

4.జాషువ పద్య పచనం
శిర మెత్తెను జనవచనం
సమాజం గరళం గొంతులో
పలికించె ఆర్ధ్ర రచనం.

5.విశ్వనరుడ నే నన్నావు
విశ్వ కవిత చే కొన్నావు
జగత్తులోని ధీనుల
బాధను మనస్సుతో విన్నావు.

-డా.వూటుకూరి వరప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments