మోదం(కవిత )చంద్రకళ

ఆమోదాన్ని తెలిపే అవకాశం అబలకెక్కడిది…?!
బలవంతంగా తనపై రుద్దబడిన అధికారాన్ని,అభిప్రాయాల్ని అంగీకరించడం తప్ప…!!

తనేం మాట్లాడాలో…
ఏం చదవాలో…
ఎప్పుడు నవ్వాలో…
ఎలా నడచుకోవాలో…
చివరకి తన ఇష్టాలేమిటో కూడా తెలియనంతగా…
ఇతరుల ఆమోదంతోనే తన జీవిత పయనం…!!!

నచ్చాడో…నచ్చలేదో…
తన ఆమోదం తెలుపకుండానే…
లేదా బలవంతంగా ఆమోదింపబడి
వివాహం జరిగిపోతుంది…
వివాహంతో తన తనువూ మనసులపై మరొకరి ఆమోదముద్ర బలంగా పడిపోతుంది…!!!!

ఆమోదం తెలుపకుండానే…
మాతృమూర్తి హోదాను పొందుతుంది…
తన గర్భంలో ఆడపిల్లను మోయాలో…వద్దో…
నిర్ణయించేది మాత్రం ఇతరుల ఆమోదమే…!!!!!

కళ్ళముందు ఎన్ని వరకట్న హత్యలు…
గృహహింసలు…
పరువు హత్యలు జరుగుతూ ఉన్నా…
ఆమోదిస్తూనే ఉంటాం…
“మన చేతిలో ఏముంది…”
“అంతా చేసుకున్న ఖర్మ…”
అదే విధిరాత…”
అనుకుంటూ…!!!!!!

ఆమోదాన్ని తెలిపేముందే…
తీవ్రంగా ఆలోచిస్తే…
ఒక్కసారి ధైర్యంగా తిరస్కరిస్తే…
ఆవేశంతో ఎదిరిస్తే…??!!

జీవితంలో ఆవేదన స్థానంలో…
మోదమే ఇక…!!!!!!!!

చంద్రకళ. దీకొండ,

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments