రెక్కలు విప్పార్చి సాగిపోతున్న విహంగ- ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

కవులకు కవయిత్రులకు పాఠకులకు కథారచయితులకు/రచయిత్రులకు
సాహిత్యాభిమానులకు నమస్కారాలు .

“విహంగ” మహిళా సాహిత్యపత్రికతో నా అనుబంధాన్ని గురించి చెప్పాలని
అందరితో పంచుకొనే ఓ ప్రయత్నం చేస్తున్నాను.

11. 11. 11 ఓ మ్యాజిక్ డేట్ నాడు ప్రారంభమైన ఈ ప్రస్థానం నేడు కూడా
అంతే ఉత్సాహంగా సాగిపోతోందనడంలో అతిశయోక్తి లేదు. స్త్రీ స్వేచ్ఛకి ప్రతీకగా
వినీలాకాశంలో అలుపెరుగక పయనించే విహంగాన్ని పేరుగా ఈ పత్రికకు పెట్టడం
డాక్టర్ పుట్ల హేమలతగారి అద్భుతమైన ఆలోచనకు ప్రతిరూపమే అనిపిస్తుంది.

విహంగలో ప్రచురించబడుతున్న పరిచయమున్న మహిళాసాహిత్యకారుల, ప్రఖ్యాతి పొందిన
రచయిత్రుల రచనలు ఎన్నో ఏళ్లుగా చదవడం ఆస్వాదించడం వాటికి స్పందించడం జరిగేది.
విభిన్న అంతర్జాల పత్రికలలో ఎన్నో రచనలు నావి ప్రచురించబడినా, “విహంగ”లో మహిళల
రచనలు మాత్రమే ప్రచురించబడతాయి అనుకోని ఎప్పుడూ విహంగకు నా రచనలు పంపడం
జరగలేదు. కానీ  ఒకే రకమైన రచనలతో ఉండే కొన్ని పత్రికలలా కాకుండా ఎన్నో సాహిత్యప్రక్రియలను ఈ పత్రికలో పాఠకులకు పరిచయం చేసి నిత్యనూతనమైన ఆలోచనలతో ప్రతీ నెలా కొత్తగా ముస్తాబు చేస్తూ మనముందుకు తీసుకువస్తున్నందుకు ప్రత్యేకంగా మానస ఎండ్లూరి  , అరసిశ్రీ గార్లకి నా అభినందనలు . కొన్ని నెలలుగా నా గజళ్ళు ఈ విహంగలో ప్రచురించబడుతున్నాయి.
అందుకు విహంగ సంపాదకీయావర్గానికి ధన్యవాదాలు తెలియజేకుంటున్నాను.

పత్రిక ప్రారంభించి 10 ఏళ్ళు అవుతున్నా, ఎంతో ఆసక్తికరమైన అంశాలతో సాహితీగగనంలో రెక్కలు విప్పార్చి
సాగిపోతున్న విహంగ , మున్ముందుకూడా ఇలాగే రసజ్ఞులైన పాఠకులను అలరించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
అభినందనలతో …………..

ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్ ,

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

శుభాకాంక్షలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments