చిన్న పందిరి
ఇంట్లో కాస్త చోటు కోసం
పడి మొలిచినా
ప్రాణమైతేనేగా
నీ చేతి ఆసరా కోసం
నేలను వీపులా కరచుకొని వ్రేలాడుతూ ఎదురుచూస్తున్నది.
పట్టించుకుపోయినా
ప్రేమ ఉంటేనేగా
తన శక్తి మేరకు తనకు దేవుడిచ్చిన సంపదను బహిరంగంగా
పంచుతూ తృప్తిపడుతున్నది.
ఎక్కడ పుడితేనేమి?
ఎలా పెరిగితేనేం?
మనసును మెలవేసి…
మనిషిని తలపోసి….
ఓ బంధానికి పోగులు పోసి….
అందంగా రంగులద్దిన
చిన్న పందిరి ఇంట్లో కాస్త చోటు కోసం
మనసంతా రాసిచ్చి
జీవితమంతా ఎదురుచూస్తూనేఉంది.
..చందలూరి నారాయణరావు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~