పూల వనం(కవిత )- గిరి ప్రసాద్ చెలమల్లు

ఇదో పచ్చని వనం
రకరకాల పక్షుల కాపురం
కాకి గూడు కాకిదే
కోయిల గూడు కోయిలదే
పాలపిట్ట అక్కున చేర్చుకుంది

తటాకాల చుట్టూ
నల్ల తల తెల్ల తల కొంగలూ
సేద తీరుతున్నాయి
అరుదైన బట్ట మేకా ఈ వనంల స్వేచ్ఛగా

భయపెట్టినా
వనం ప్రత్యేకత ఒంట బట్టించుకున్న
రామచిలుక లెగిరి పోలే
పొరుగున గోరింక ల సావాసమరువలే
వడ్రంగిపిట్టలూ
కాపలాగా ఈ కానలో
ఎబ్బెర పిక్కలూ
జంట పావురాలూ
మీనార్ల చుట్టూతా

వలస నైజం
మందలు మందలుగా
వేటాడే ఫ్లెమింగోలు
హఠాత్తుగా వనంలో జొఱ్ఱ పడాలనే
తాపత్రయం

వనం కోసం
ఏకమవ్వాల్సిన తరుణాన్ని
మరువని నైజం
ఈ వనపక్షుల సొంతం
ఫ్లెమింగో ల తరిమేత లక్ష్యంగా సాగునా?!!!

– గిరి ప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కవితలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments