నా తండా కథలు-3 –ఝమ్మరిరో నాచ్ -డా.బోంద్యాలు బానోత్(భరత్)

వో చాందణీ రాతేఁ (అవీ పున్నమి రాతృలు) ఆమవాస్యా వెళ్ళీ, పున్నమి ప్రవేసించ్చిందంటే, తండా ప్రజల ఆనందానకీ హద్దే ఉండదు. మరీ ముఖ్యంగా పిల్లలకు, యువతీ యువకులకు చాలా ఇష్టమైన రోజులవి.

పొద్దాకా పషుల కాశి, సాయంత్రం పొద్దుగూకాల్లా పషువులను తోలుకోని ఇంటికి వచ్చిండు బాలు ఛోర. బువ్వతిని డప్పు సైజేసిండు. డప్పుసౌండు డల్లుగున్నది. కొంచమంత వరిగడ్డీ, పిడికేడన్ని చిన్న చిన్న కట్టేపుల్లలు, కలిపి మంటపెట్టీండు బాలు ఛోర. ఆ మంటలో పైపైన డప్పును కాపీండు. ఇప్పుడు తన చేతి వేళ్ళతో డప్పును కొట్టీ మళ్ళీ సౌండు సైచూసీండు. తనకు కావలసిన సౌండు మోగీంది. తనలోతను సంతోష పడ్డాడు. అప్పుడప్పుడే

నీలీ ఆకాశంలో పండు వెన్నల పొడిసింది. అక్కడక్కడా పల్చాటి మబ్బుతెప్పలు ఆకాశంలో విహరిస్తున్నయి. నిండు చందృణ్ణీ పల్చాటి తెల్లటి మబ్బు తెప్పా కమ్మింది. ఆ దృష్యం వర్ణనాతితంగా వుంది. అది ఒక ‘అందమైన తండా యువతి, పారదర్శక, నునువెచ్చని, పలచటి పైటకొంగు వేసుకొని నెమలి లా నాట్యం చేస్తున్నట్లుగా’ వుంది.’

ఐతే, బాలు ఛోర డప్పు సంకనేసుకోని, కొట్టుకుంటూ
తండ మద్యల మైదానం వైపుకు పోతాండు. ఆ డప్పు సప్పుడు వినీ పిల్లలు,యువతీ యువకులు, పెద్దలు అందరు ఆ మైదానం కాడికి చేరుకుంటున్నరు.

వాల్లంతా, పదిహేను నుండి ఇరవై ఏండ్ల మద్య వయస్సు కలిగిన యువతీ యువకులు. ముప్పై ఐదు నుండి నలభై ఐదు సంవత్సరాల మద్య వయస్సు కలిగిన, మద్య వయస్కులు. మిగిలన వాళ్ళు అరవై సంవత్సరాలకు అటూ-ఇటూ గా ఉంటారు.

జనాలను చూసి డప్పు కొట్టే వేగం పెంచిండు బాలు ఛోర. అప్పుడే ప్రియంక ఛోరి ఇంట్ల పనులు పూర్తి చేసుకొని ఆడుకునే మైదానం కాడికి వస్తున్నది. ప్రియంక ఛోరి పద్దేనిమిది ఏండ్ల అందమైన యువతి. ఆమె అంతగా చదువుకోలేదు, కాని చదువుకున్న అమ్మాయిల కంటే సమజ్దార్. తండా యువకులందరి కళ్ళు ఆమె పైయిన్నే. ఆమెకు ఇష్ఠం లేక పోయిన ఏదోవంకతో మాట్లాడిస్తారు. ప్రియంక ఛోరి కూడా ఎవ్వరిని పరేషాన్ చేసేది కాదు. ప్రియంక ఛోరి, ఆడుకునే మైదానం కాడికి పోయిన విషయం తెలుకోని, ప్రవీణ్ నాయక్ కూడా అక్కడికి చేరుకున్నాడు. ప్రవీణ్ నాయక్ పట్నంలో పాల్టేక్నిక్ చదువుతున్నాడు. ప్రియంకను ప్రాణంగా ప్రేమిస్తున్నడు. ప్రవీణ్ నాయక్ అంటే ప్రియంక కు కూడా ఇష్ఠమే. గత రెండు సంవత్సరాల నుండీ వాల్లీద్దరు ఒకర్నోకరు ప్రేమించుకోంటున్నరు.

ఐతే ఈ డప్పు కొట్టే బాలు ఛోర కూడా ప్రియంకను ఇష్టపడుతున్నడు. ఏవిదంగా అంటే ఆవిదంగా డప్పు వాయించగల టెక్నిక్ తెలిసినోడు బాలు ఛోర. అదే విదంగా ప్రవీణ్ నాయక్ కూడా డప్పు కొట్టూట్లో బాలు ఛోర కంటే ప్రావీణ్యం కలవాడు.

లేడీస్ లు డ్యాన్స్ (నృత్యం) చెయ్యాలంటే, బాలు ఛోర లేదా ప్రవీణ్ నాయక్, వాల్లీద్దరిలో ఎవ్వరో ఒక్కరు డప్పు కొట్టవలసిందే.

ఐతే బాలు ఛోర, ప్రియంక ముందు ఇంకా పసందుగా డప్పు వాయింస్తాడు. ఆమెను ఇంప్రెస్ చెయ్యాలనుకుంటడు.

ప్రియంక పలు రకాలుగా తెలివైన, అందమైన యువతి. ఆమెకు ఆధునిక ఆకతాయి డ్యాన్సు వచ్చు. బంజారాల/లంబాడీల పరంపరగా వస్తున్న, తమ పూర్వికులు పరిచయం చేసిన డ్యాన్సు కూడా ఆమెకు వెన్నతో పెట్టిన విద్య.

ఐతే బాలు ఛోర డప్పు కొడుతున్నడు. అక్కడికి వచ్చిన వాళ్ళు, గుంపులు గుంపులుగా విడిపోయిండ్రు. ఈ యువతుల గుంపునుండి గుసగుసలు మోదలైనయి. ‘నువ్వే మోదలు డ్యాన్స్ చయ్యమంటే, కాదు కాదు నువ్వే చెయ్యమని ఒకర్నోకరు అనుకోంటున్నారు.’ చివరికి అందరు కలిసి ప్రియంకను ముందుకు తోసిండ్రు డ్యాన్స్ చెయ్యమని. ప్రియంక నాచెన్ లాగ్గి(ప్రియంక నృత్యం చేయడం మోదలు పెట్టింది). తర్వాత ఒక్కోక్కరు ప్రియంకతో పాటుగ డ్యాన్స్ చెయ్యడం మోదలు పెట్యారు.

ఐతే తమ పూర్వికులనుండి వస్తున్న నృత్యం చదువుకున్న పడుసు పోరగాడ్లకు పసందుగా లేదు. అందుకనే వాల్లు ఆట మైదానం పక్కింట్లో డెక్కు పాటలు(ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే…, గున్నా గున్నామామిడీ..) పెటిండ్రు. ఆ పాటలకు అనుగుణంగా ఎగురుతుండ్రు.

ఇక్కడా ప్రియంక గృపు కొంచం రెస్టు తీసుకోంటున్నారు. ఈ మద్యల బీటెక్ చేస్తున్న బ్యాచ్ వచ్చీ, తీన్మార్ కొట్టమని డిమాండ్ చేసింది. పాపం బాలు తీన్మార్ కొట్టసాగాడు. ఘంటసేపైన ఆ బ్యాచ్చీ తీన్మార్ డ్యాన్స్ చేస్తనే ఉంది. అందలో నుండి ఒక్కడు దుకానంకు పోయిండు. తమ్సాప్ లీటర్ బాటిల్ కొన్నడు. దాని మూత తిప్పీ లూజ్ చేసిండు. మల్లి టయిట్ చేసిండు. వస్తూ వస్తూ ఊపుకోంటు వచ్చిండు. ఆడోల్లు అందరు చూస్తూండగ తీన్మార్ డ్యాన్స్ చేస్తూన్న బీటెక్ బ్యాచ్ పై ఆకాశంలో చిమ్మిండు. అది ఆమ్ల వర్షం కురిషినట్లున్నది.

అది చూసి ఆడోల్లు “వీల్లకేంపోయే కాలమొచిందీ, పైసలు బెట్టి కొనుకోచ్చి గట్ల పార బోస్తూండ్రే! గిదేం ఆనందం?. ‘ఇందుతి వాంద్రి ఆచ్చి'(వీల్ల కన్నా కోతులు నయ్యం).” అని అనుకోంటున్నరు.
వీల్ల కోతి చేష్టలు చూసీ, భరించలేక ప్రవీణ్ నాయక్, ప్రియంక ఛోరి ఇద్దరు మెల్లగా కొంచమంత దూరంలో ఉన్న చింత చెట్టు కిందికి వెల్లి పోయిండ్లు. బ్రయీటు వెన్నలకు గుబురు చింత చెట్టు నీడా నల్లగ కమ్మింది. వెన్నెల్లో చెట్టు నీడకూ ఉండడంతో వాల్లు అంత సునాయాసంగా ఎవ్వరికి కనబడుత లేరు. ఐనా వాల్లు కామన్గా కలిసి మాట్లాడుకొనే ప్లేసది.

చెట్టు మోదలుకు ఒరిగి, ఎడమ కాలు సక్కగా ముందుకు సాపి, కుడికాలు మోకాలుకు మలుచుకొని కూసున్నది ప్రియంక ఛోరి. ప్రియంక ఛోరి పక్కకు వచ్చీ వడిలో తలపెట్టి పడుకొని ప్రియంక కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నడు ప్రవీణ్ నాయక్. “పరమేదాడ హమాఘర సగాయి కరేన ఆరే ఛ (ఎల్లుండి మా ఇంటికి పెళ్ళి సంబందం మాట్లాడే దానికి వస్తూన్నరు). “ఇప్పటికి మూడు సంబందాలు చెడగొట్టినవు, నా కడుపుల శడపుట్టినవు అనీ మా ఇంట్ల నన్ను తిడుతున్నరు. ఈ రోజే చివరి రోజు ఏదో వక్కటి చెప్పు, పెళ్ళి చేసుకుంటవా లేదా” అని పట్టు పట్టింది ప్రియంక ఛోరి. “ఇంకోసంవత్సరమైతే నా చదువు పూర్తైతది. ఆ తర్వాత మనమిద్దరం పెళ్ళి చేసుకుందం.” అన్నడు ప్రవీణ్ నాయక్ ఫైనల్గా. “అప్పటిదాక ఆగరు ప్రవీణ్. మూడు సంవత్సరాల మన ప్రేమ రేపటితో లాస్ట.” అని కంట తడి పెట్టుకోంది ప్రియంక ఛోరి. ప్రవీణ్ నాయక్ కూడా ఏడ్చాడు ప్రియంకను ఆలంగించుకొని. “రేపటి రోజు, మన ప్రేమకు గుర్తు గా గుర్తుండి పోవాలే. వీటినే తలుచుకుంటూ జీవితం గడపేయలే. ఆ విధంగా రేపు రాత్రి ఆడాలే-పాడాలే. మ నవలేరీర్ వేసేమ ఆవుఁఛూ, దల్ ధాపన్ నాచుఁ ఛుఁ. తూ డబడ మార్ (నేను మన లంబాడీ పెండ్లి పిల్ల డ్రెస్ లో వచ్చి తనివి తీర నృత్యం/ డ్యాన్స్ చేస్తా. నవ్వు డప్పు కొట్టు.” అని గుండె పుట్టేడు బరువుతో విడిపించుకొని తమ తమ ఇంటికి వెళ్ళీ పోయిండ్లు.
                                                 

                                                  **************************************

ఐతే అదే తండాలో రాంజీ నాయక్ అనే యువకుడు ఉన్నడు.రాంజీ నాయక్ రాజేందర్ ఇద్దరు మంచ్చి స్నేహితులు.వీల్లు యూనివర్శిటీలో చదువుతున్నరు.

రాంజీ నాయక్ తండావాసి కానీ చదువు రీత్య పట్నంలోనే ఎక్కువగ ఉంటడు. పట్నంలో ఉన్నా కూడా తమ మూలాలను మరవనివాడు. తమ సముదాయపు సంస్కృుతి గొప్పతనం తెలిసినోడు. సామాజిక అవగాహన కల్గినోడు. లంబాడీల/బంజారాల సంస్కృుతి కి భూతలస్వర్గమైన భూతకాలం మరియు వేకిలి చేష్టలకు వేదికైన వర్తమానం రెండూ బాగా తెలిసినోడు. అంతరించి పోతున్న తమ జాతి సంస్కృుతిని చూసి బాద పడేవాడు. రాజేందర్ కూడా అంతే సమాన సామాజిక అవగాహన ఉన్నోడు.

ఐతే వాల్లీద్దరు అనుకోకుండా ఈ ప్రోగ్రాం కాడికి వచిండ్రు. ఆ వచ్చిరాని బీటెక్ బ్యాచ్ చేసే డ్యాన్స్ ను చూసి హట్టైయిండు రాంజీ నాయక్. నిజంగా లంబాడీ/బంజారా డ్యాన్స్/నృత్యం చేసే వాళ్ళు , సైలెంటుగా చూస్తూన్నరు. లంబాడీ నృత్యమంటే నామమాత్రం కూడా తెలవనోల్లు, తిక్క తిక్క డ్యాన్స్ చేస్తూన్నరు. ఆ వికటనాటక దృష్యాలు చూడలేక పోయాడు రాంజీ నాయక్. వెంటనే ఇకణ్ణుంచ్చి వెల్లిపోదమని తన స్నేహితుడు రాజేందర్ తో చెప్యాడు. కానీ రాజేందర్ కీ ఇంకొంచంసేపు ఉండీ,

లంబాడీల/బంజారాల కల్చర్ తెలుసుకోందామనుకొన్నాడు. ” వేట్ మ్యాన్ ఐ వాంట్ టు నో ది బంజారా ట్రయిబ్స్ కల్చర్” అన్నడు ఆసక్తిగా. కొంపతిసి దీన్నే లంబాడీల కల్చర్
అనుకొనే ప్రమాదం ఉంది. కాబట్టి వీనికి అసలు సిసలైన లంబాడీల/బంజారాల కల్చర్ గురించి చెప్పాలనుకొన్నడు రాంజీ నాయక్. “దాట్ ఈజ్ నాట్ ది లంబాడీస్ కల్చరల్ డ్యాన్స్” అన్నడు రాంజీ నాయక్ బాదతో. “మరి ఇంకెట్ల చేస్తర్రా లంబాడీ డ్యాన్స్. ఏది పోని నువ్వు చేసి చూపించూ చూద్దాం. పోని కనీసం దాని గురించి చెప్పు, విని తెలుసుకుందాం ” అన్నడు రాజేందర్ అదోరకంగా.

సరె చెప్పుత విను “బంజారాలు/లంబాడీలు ముఖ్యధారా సమాజానికి దూరంగా, సహజ ప్రకృతికి దగ్గరగా నివసిస్తూ ఉంటారు.ఐతే వీల్ల జీవిన విధానం ప్రకృతి నుండి విడదీయరాని బందాన్ని కల్గి ఉంటది. వీల్లు ప్రకృతిని అనుకరిస్తారు. వీల్ల ఆటా-పాటా, వంటా-వార్పు, కట్టు-బొట్టు, పండ్డుగలు..అన్ని వీల్లకు ఆ ప్రకృతే నేర్పిందా! అనట్లు ఉంటాయి.

ఐతే ముఖ్యంగా మానవుల జీవితాన్ని, రాజికీయ జీవితం, సామాజిక జీవితం, ఆర్థిక జీవితం, సాంస్కృుతి జీవితం అనీ నాల్గు విధాలుగా విభజించి చెప్పవచ్చు. ఐతే ఈ నాల్గు ఒక దాని మీద ఇంకోటి ఆదారపడి ఉంటాయి.

నిజానికి లంబాడీల సాంస్కృుతిక జీవితంలో లంబాడీ నృత్యాలు లేదా లంబాడీ డ్యాన్సులు చాల విశేషమైనయి. లంబాడీ డ్యాన్సులు దాదాపు ఎనిమిది నుండి పది రకాలుగా ఉంటాయి. వీటి సంఖ్యా మరియు పేర్లు ఆయాప్రదేశాలను బట్టి మారుతాయి. ప్రతి నృత్యానికి తనదైన పేరు ఉంటుంది. ప్రతి నృత్యానికి తనదైన శైలి ఉంటుంది.

‘పీరేరో నాచ్( పీరీల నృత్యం/డ్యాన్స్), లల్లాయిరో నాచ్(లల్లాయి నృత్యం/డ్యాన్స్), డపడియారో నాచ్(డపడియా నృత్యం/డ్యాన్స్), సాపేరో నాచ్(నాగిని నృత్యం/డ్యాన్స్ ), మోరేరో నాచ్(నెమలి నృత్యం/డ్యాన్స్ ), ఘోడేరో నాచ్(గుఱ్ఱపు నృత్యం/డ్యాన్స్), ఝమ్మరీరో నాచ్(ఝమ్మరి నృత్యం/డ్యాన్స్ ), సర్కేరో నాచ్(బ్రేకు డ్యాన్స్ )..’అని రకరకాల నృత్యాలు ఉంటాయి” అని పేర్లతో సహా తెలుగులో అనువాదం చేసీ మరీ చెప్యాడు రాంజీ నాయక్.

“మరీ గా పీరేరో నాచ్ (పీరీల నృత్యం) లంబాడీల నృత్యమెట్లైతది? ఆ నృత్యం పేరే పీరీల నృత్యం. ఆ పేరుకు మీ సంస్కృుతి కి సంబందం ఉన్నట్టు అనిపించదే!. పేరును బట్టి చూస్తే అది ముస్లీం సంస్కృుతికి సంబందించినట్లుగా లేదు?” అని ప్రస్నించిండు రాజేందర్. “ఎస్ యూఆర్ ఎగ్జాక్టీలి కరేక్ట. నువ్వన్నదాంట్లో కూడ నిజమున్నది.ఎందుకంటే ముస్లీమ్లు కొన్ని వందల సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించీండ్రు. ముఖ్యంగా తెలంగాణాలో నిజాముల పాలన కొనసాగింది. తెలంగాణా సమాజంపై దర్గా కల్చర్ ప్రభావం ఉంది. తెలంగాణా సమాజంలో భాగమైన లంబాడీల కల్చర్ పై కూడ దర్గా కల్చర్ ప్రభావం ఉంది. ఐతే పీరీల నృత్యాన్ని యధా తదంగా కాకుండా దాన్ని మా పూర్వీకులు లంబాడీకరించటం జరిగింది. సో అది కాల క్రమేణ లంబాడీల కల్చర్ లో భాగమైయింది.” అన్నడు రాంజీ నాయక్ . అరే దీని వెనకాల ఇంత చరిత్రవుందా! అంటూ ఆశ్చర్యపోయిండు రాజేందర్.

ఇక ‘లల్లాయిరో నాచ్'(లల్లాయి నృత్యం/డ్యాన్స్) ను ఇలా ఉంటుందని నోటితో చెప్పడం కొంచం కష్టమే కాని దానికి కూడా తనదైన శైలి ఉంటుంది. నృత్యం చేస్తూన్నప్పుడు చూడవలసిందే.

అదే విదంగా డపడియారో నాచ్(డపడియా నృత్యం/డ్యాన్స్) ను కూడ చేసేటప్పుడు చూస్తే అర్దమైతది. దీనికీ కూడ తన దైన శైలి ఉంటుంది.

ఇక పోతే సాపేరో నాచ్(నాగిని నృత్యం/డ్యాన్స్ ), ఇది నాగిని నృత్యం. నాగుంపాములు ప్రకృతిలో ఉంటాయి. వాటి అనుకరణే సాపేరో నృత్యం. ఈ నృత్యం చేసేటప్పుడు చూస్తే షాన్దార్గుంటది.
తర్వాత ‘మోరేరో నాచ్'(నెమలి నృత్యం/డ్యాన్స్ ). ఇది అన్ని నృత్యాల్లోకెల్ల ఫేమస్. నెమలి అంటే దాని ఇమెజ్ విశేషమయినది. దాని నాట్యం, సహాజ సౌందర్యం, నేచురల్… అలా చెప్పుకుంటూ పోతే తరగని ఇమేజది. లంబాడీలు నెమలి నృత్యాన్ని ప్రకృతినుండే నేర్చకున్నారు.

ఘోడేరో నాచ్(గుఱ్ఱపు నృత్యం/డ్యాన్స్) ఇది టోటల్గా ఇమాజినేషన్ తో చేసే నృత్యం. గుఱ్ఱం నృత్యం చేస్తే ఎట్లూంటదో, అదే విదంగా ఉంటది.

ఇది ‘ఝమ్మరీరో నాచ్'(ఝమ్మరి నృత్యం/డ్యాన్స్ ).ఈ నృత్యం చేసేటప్పుడు ‘పోరియ గడేరి కేళరి బాగ్ మతొ ఝమ్మరిరొ నాచ్ కతో నాచ్ లేతి’ అనీ పాడుకోంటూ నృత్యం చేస్తారు. ఇక్కడా ‘పోరియ గడ్ అంటే మహారాష్ట్రలోని పౌరా గడ్ అని అర్థం. పౌరాగడ్ లో బంజారాల ఆరాద్య దైవం సేవా లాల్ మహారాజ్, మారామ యాడీ కొలువై ఉన్నరు. ప్రతి సంవత్సరం పెద్ద జాతర జరుగుతది. ఆ జాతరలో లంబాడీలు భక్తీ శ్రద్దలతో నృత్యం చేస్తారు.ఇది లంబాడీ డ్రెస్ మీద చేస్తారు.

ఇక పోతే ‘సర్కేరో నాచ్'(బ్రేకు డ్యాన్స్ )..’. బ్రెకు డ్యాన్స్ ను ఆధునిక డ్యాన్స్ అంటారు కాని లంబాడీలు దీన్ని వాళ్ళ పూర్వికుల నుండి నేర్చకున్నారు.” అని లంబాడీల నృత్య, నాట్య.. సాంస్కృుతిక వైభవాన్ని క్షణ్ణంగా వివరించిండు రాంజీ నాయక్.

                                                                    ***********************

ఆ తర్వాత రోజు కూడా బాలు ఛోర డప్పు కొట్టుకుంటూ తండా మద్య నుండీ ఆడుకునే మైదానం వైపుకు పోతాండు. అది పున్నమి వెన్నల రాత్రా! లేదా పగలా! అన్నట్టుగా ఉన్నది. బాలు ఛోర నడుస్తూంటే అతని నీడ కూడ తనతోపాటుగా డప్పు కొడుతూంది. తన నీడను చూసుకొంటూ డప్పు కొడతాండు బాలు ఛోర. మోదటి రోజు మాదీరుగానే అందరు వచిండ్రు ఆట మైదానం కాడికి.

అనుకున్నట్టుగా ప్రియంక ఛోరి ‘పాటేరో ఫేటియ, కాఁళి, పాటేర్ ఘూంగ్టేవాళ్ టూగ్రి, కానేమ కన్య, నాకేమ
భూరియ, మాతేమ టోబ్లి, ముళేమ ఫూఁన్దా, హాతేమ బల్యా, ఆంగళీమ ఫూలా, టాఁగేమ వాంక్డీ, కస్సే, ఘూగ్రా..'(లంబాడీ డ్రెస్ లో డ్రెస్ అప్ కావడాని అవసరమైయ్యే దుస్తువులు, వస్తువులు/ఆభరణాలు) అన్ని ఎసుకొని లంబాడీ డ్రెస్ లో ఆట మైదానం కాడికి నడిచి వస్తూంటే నిజంగా ‘డండియాడి'(లంబాడి దేవకన్య) వస్తున్నట్టే ఉంది.

ప్రవీణ్ నాయక్ కూడా ధోతి కట్టుకున్నడు. కమీజ్ తొడుక్కొని, తలకి పాక్డీ కట్టిండు… కట్టుకొని కొత్త పెళ్ళి కొడుకులా తయ్యారయిండు..

ఆ విధంగా, ఇద్దరు ఆట మైదానం కాడికి వచిండ్రు. వీల్లు వచ్చిన విషయం రాంజీ నాయక్ కు తెలిసింది. రాంజీ నాయక్ తన ఫ్రెడు రాజేందర్ ను వెంట పెట్టుకోని ఆడుకునే మైదానం కాడికి వచ్చిండు.
డప్పు ఇవ్వమని బాలు ఛోరకు సైగ చేసిండు ప్రవీణ్ నాయక్. బలుఛోర ప్రవీణ్ నాయక్ కూ డప్పు ఇచ్చిండు. ప్రవీణ్ నాయక్ తన ప్రియురాలు ప్రియంక ఛోరి ప్రేమను తలుచుకుంటూ, డప్పు కొట్టటంలో నిమగ్నమయిండు. ప్రియంక ఛోరి తన ప్రియుడు ప్రవీణ్ నాయక్ ప్రేమను మనస్సు లో తలుచుకుంటూ నృత్యం మోదలు పట్టింది. ఆట మైదానం లో ఉన్నోళ్ళు అందరు వాళ్ళా ఆటా-పాటా ను చూస్తూండి పోయిండ్లు.

వరసగా ఒక దాని తర్వాత ఒకటి.
ముందుగా ‘ఝమ్మరీరో నాచ్’ తో మోదలు పట్టింది….’మోరేరో నాచ్’ తో ముగిస్తూంది. అన్ని నృత్యాలు చేస్తూ పోతుంది. ప్రవీణ్ నాయక్ డప్పు కొడుతుండు..

ఆ నృత్యాన్ని చూసి రాజేందర్ ఆశ్చర్యపోయిండు. ఐతే ఇదన్నమాట, ఒరిజినల్ లంబాడీ కల్చరల్ నృత్యం. అని తన మనస్సు లో అనుకొన్నడు.

నిన్న తను చూసింది, గ్లోబలైజేషన్ ప్రభావమని అర్దం చేసుకొన్నడు. లంబాడీ కల్చరల్ నృత్యం నేచురల్ నృత్యం. వీల్లు నేరుగా నేచర్ ను అనుకరిస్తారు. వీల్ల నుండియే మేన్ స్ట్రీం సొసైటీ (ముఖ్యధారా సమాజం) నృత్యాన్ని నేర్చుకున్నది అనడంలో అతిశయేక్తి లేదు. అని తన మనస్సు లో గట్టిగ నమ్మిండు.
ప్రియంక నృత్యం లో నిమగ్నమయింది. ప్రవీణ్ నాయక్ డప్పు వాయించడంలో నిమగ్నమయిండు….
చిన్నగ చిన్నగ చందృడు గూకుతున్నడు. మెల్ల మెల్లగా వెన్నెల వెలుగును చీకటి కమ్మెస్తూంది. ఆట మైదానం నుండి ఒక్కోక్కరుగా తమ తమ ఇంటికి వెళ్ళీ పోతున్నరు. ప్రియంక ఛోరి, ప్రవీణ్ నాయక్ లు కూడా తమ తమ ఇంటికి వెళ్ళీ పోయిండ్లు. ఆ రోజు వాళ్ళ జీవితం లో మరుపు రాని రోజు గా గుర్తుండి పోయింది. వాల్లు ఈ భూమి మీద బతికున్నంతవరకు వాల్ల మద్య ప్రేమ ఉంటుందని నిరూపించిండ్రు. లంబాడీ నృత్యం లంబాడీలు ఈ భూమి మీద ఉన్నంతవరకు ఉంటుందని చాటి చెపిండ్రు.

–డా.బోంద్యాలు బానోత్(భరత్)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments