జ్ఞాపకం-54 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

నివ్వెరపోయి చూసింది సంలేఖ.
“నేను రాయడం ఏంటి? పాఠకులు ఆదరించటం ఏంటి? మీరు మాట్లాడేది అతిశయోక్తిగా వుంది మాష్టారు! నాకేదో లేనిది ఆపాదిస్తున్నారు”

“అదేం లేదు సంలేఖా! దీన్ని తిలక్ లాంటి వాళ్లు చదవాలి అంటే ఎప్పటికైనా నువ్వు నేను చెప్పిన పని చెయ్యాలి. చేస్తావు. అదేం నీ శక్తికి మించిన పనికాదు. నీ అక్షరాలను నీకు అచ్చులో చూసుకోవాలన్న అభిరుచి వుంటే చాలు. ఏదీ ఒక్కరోజులో కార్యరూపం దాల్చదు. ప్రయత్నం చెయ్యి. నీలో చక్కటి భాషవుంది. అందుకే నీ మనసులో కలిగిన భావాన్ని అక్షరాల రూపంలో బయటికి తెచ్చావు. నీకు తెలియదనుకుంటా చాలా మంది రాసేవాళ్లకు చుట్టుపక్కల వాళ్ళు చూసేవే కథావస్తువులని విన్నాను. దానికి తోడుగా ఊహ, రాయగలిగే సత్తా కూడా వుండాలనుకో. అది నీదగ్గర పుష్కలంగా వుంది” అని చెప్పి ఆయన వెళ్లిపోయాడు.

                                                                       *******

సంలేఖ చూస్తుండగానే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి.

ఈ రెండు సంవత్సరాలలో ఎలాంటి మార్పులు లేవు. ఇంటర్ కాలేజీలో వున్నప్పుడు తరుచుగా వెయిటింగ్ హాల్లో కూర్చుని పేపర్ చదవడం వల్లనో ఏమో క్రమంగా ఆమెకు పుస్తకాలు చదవటంపై అభిరుచి ఏర్పడింది. అది పెరిగి పెద్దదైంది. ఈ రెండు సంవత్సరాలలో సంలేఖలో మానసికంగా చాలా మార్పులు వచ్చాయి. ఆమెలో వయసుకి మించిన పరిణతి, చదువుకి మించిన ఎదుగుదల వచ్చింది. కారణం ఆమె నిత్యం చదివిన పుస్తకాలు. క్రమం తప్పకుండా గ్రంథాలయానికి వెళ్లడం.గ్రంథాలయంలో కూడా కంప్యూటర్, ఇంటర్ నెట్ సెక్షన్ వుంటుంది. అక్కడ గంటకి ఇంత రేటని డబ్బులు చెల్లించి చాలామంది స్టూడెంట్స్ కూర్చుని తమకి కావలసిన సమాచారాన్ని సేకరించుకుని వెళ్తుంటారు. ఇంటర్ నెట్లో వాళ్లకి దొరకని సమాచారం వుండదు.

సంలేఖ ఆ సెక్షన్ లోకి వెళ్లకుండా పత్రికల విభాగం, బుక్స్ రిఫరెన్స్ వుండే గదుల్లోకి వెళ్లేది. అక్కడ గంటలు గంటలు కూర్చుని తనకి కావలసిన పుస్తకాలను చదువుకునేది. అక్కడ ఎంతసేపు కూర్చుని చదువుకున్నా డబ్బులు కట్టటం వుండదు.

ఆ గ్రంథాలయంలో ఆ పుస్తకాలను భాషతో సంబంధం లేకుండా కొని, లేక సేకరించి భాషల వారిగా విభజించి పాఠకుల కోసం అమర్చి, భద్రపరచి వుంటారు. కాబట్టి తనకేం కావాలో ఎంపిక చేసుకుని చదువుకునేది.

అక్కడికి విద్యార్థులేకాదు కార్మికులు, కర్షకులు, సాధారణ ఉద్యోగస్థులు వస్తుంటారు. వాళ్లలో చాలావరకు చేస్తున్న పనిలో మెళకువలు తెలుసుకోవటానికి, వారికి అభిరుచిగల విషయము పై పరిశోధన చెయ్యటానికి, విజ్ఞానాన్ని సంపాయించుకోటానికి వస్తుంటారు. ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగా కూర్చుని చదువుతుంటారు. వాళ్లను చూస్తుంటే జాతి, కుల, మత భేదం కన్పించదు. వ్యక్తి సంక్షేమం, అభివృద్ధి, సమైక్యభావం మాత్రమే కన్పిస్తాయి.

అసలు గ్రంథాలయానికి వెళ్లడం అనేది ఒక మంచి అలవాటు అన్నది ఆమెకు ముందు తెలియదు. వేల మైళ్ల దూరమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవు తుందన్నట్లు మొదటిరోజు వెళ్లి కూర్చుని ఓ పుస్తకం చదవగానే ఇంకో పుస్తకం చదవాలనిపించడం అందులోని అక్షరాలన్నీ ఒక్క సిరా చుక్కతోనే ప్రారంభమై లక్షల మెదళ్లను కదిలిస్తున్నట్లు అనుభూతి చెందడం జరిగింది. ఎందరో మహానుభావులు రాసిన విలువైన వాక్యాలు ఆమెలో బాగా నాటుకుపోయాయి.

ఒక మిత్రుడు రేపు శత్రువు కావొచ్చు. నమ్మినవారు మోసం చెయ్యొచ్చు. పుస్తకాలు అలా చెయ్యవు. హృదయానికి ఉల్లాసాన్ని మెదడుకి విజ్ఞానాన్ని ఏకకాలంలో అందిస్తాయి. అంతటి అద్భుత శక్తి పుస్తకాలకు వుంటుంది. వాటి ద్వారా ఆత్మశక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. అదీకాక కూర్చున్న చోట నుండి కదలకుండా భూప్రపంచాన్ని దర్శించవచ్చు. అంతేకాదు ఆమెవెళ్తున్న ఆ గ్రంథాలయంలో అన్నిరకాల పుస్తకాలు వున్నాయి. బుజ్జాయిలకి బుజ్జికథలు, పిల్లలకు స్కూలు పుస్తకాలు, యువతరం కోసం వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు. ఇతరులకు కావలసిన దేశ చరిత్రలు. ప్రపంచ చరిత్రలు. దేశ నాయకుల చరిత్రలు. పద్యకావ్యాలు, నాటక గ్రంథాలు, గృహిణులకు కావలసిన నవలా సాహిత్యం. వృద్దులకు కావలసిన రామాయణ, భారత, భాగవత కథలు. నిరుద్యోగులకు కావలసిన వివిధ రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు. ఒక్కటేమిటి ఇలా అన్నిరకాల పుస్తకాలు వున్నాయి.

అవన్నీ చదవాలంటే తన జీవితకాలం సరిపోదేమోననుకొంది. అందుకే తన జీవితంలో తనకి వీలైనన్ని ఎక్కువ పుస్తకాలు చదవాలనుకుంది. ఆమెలో అదే తపన. అదే ధ్యేయం. అదే పుస్తక ప్రపంచం. పుస్తకాల గొప్పతనం. పుస్తకాలు తండ్రివలె ఆదరిస్తాయని, తల్లివలె ప్రేమిస్తాయని, గురువువలె ప్రభోదిస్తాయని, మిత్రునివలె ఆదుకుంటాయని ఆ గ్రంథాలయానికి వస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ పుస్తకాలే కదా యుగాలు మారినా, జగాలు మారినా, ఆచందార్కము మన సాంప్రదాయ, భాషా సంస్కృతులను, మానవతా విలువలను చెక్కుచెదరకుండా అందిస్తాయి అని అంటుంటారు. కానీ ఇన్ని సుగుణాలు వున్న ఈ గ్రంథాలయాలను ప్రభుత్వం కాని, ప్రజలు కాని ఎందుకు పట్టించుకోరో అర్థం కావడం లేదని ఆరోపిస్తుంటారు.

(ఇంకా ఉంది )

— అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో