నజరానా ఉర్దూ కవితలు-13 – అనువాదం ఎండ్లూరి సుధాకర్

ఎండ్లూరి సుధాకర్

 

 

 

 

 

 

నా పేరు ఆమె కళ్లల్లో

రాసి వుంది

బహుశా ఏ కన్నీరో

దాని చెరిపేసి ఉంటుంది

-బషీర్ బద్ర్

తొలి వేకువ కిరణాలలో

కరిగి నా పై వర్షించు

కటిక చీకట్లో శయనించిన నాకు

ఒక మెలకువ కలిగించు

-అబ్దుల్ మతీన్ ఆరీఫ్

కాశ్మీరు పూల మీద

మంచు బిందువులు నర్తిస్తున్నాయి

మరి ఎక్కడి నుండి

ఈ రక్తపు చినుకులు వర్షిస్తున్నాయి ?

-రఫిక్ గిరిధర్ పురీ

నా బాధని అర్ధం చేసుకునే వాళ్ళు

ఎందరున్నారీ నగరంలో

తేరి పార చూస్తున్నాను

నవ్వుతున్న మొహాల్లో

-షాయర్ లఖ్నలీ

-– అనువాదం ఎండ్లూరి సుధాకర్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments