బతుకులెట్ల సాగుతున్నాయో(కవిత ) – యల్ యన్ నీలకంఠమాచారి

బతుకులెట్ల సాగుతున్నాయో
బడుగు బతుకులెట్ల సాగుతున్నాయో
చూడు చూడు సోదరా
కళ్ళు తెరిచి చూడు సోదరా
మురికి కాలువల పక్కన
పూరి గుడిసెల యందున
ఈగలు దోమలు ముసురుచుండ
నివసించే కడుపేద వారల
రోగాలు రొస్టులతో
అర్ధాకలి కడుపులతో
బతకలేక బతుకుతు
కాలం గడిపే వారల
కడుపారగ తిండి లేక
వంటి నిండ బట్ట లేక
లోతుకు పోయిన కళ్ళతో
రేపటి ఆశతో సాగేవారల
ఎంతకాలమీ బతుకులు సాగాలి
ఎంతకాలమీ వెతలు భరించాలి
ఎంతకాలం ఎంతకాలం ఇంకెంతకాలం
మేలు బతుకుకై ఎదురు చూడాలి
సహనం చావక ముందే
ఆవేశం పెరగక ముందే
తిరుగుబాటు బావుటా ఎగరకముందే
మాన్యులైన పెద్దలారా
వీరి బతుకులపై దృష్టి సారించండి
వీరి బతుకులలో మార్పు తీసుకరండి
వీరిని మనషులుగా బతకనీయండి

                                                           – యల్ యన్ నీలకంఠమాచారి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments