జీవితమంతా
మనసులు ఇచ్చిపుచ్చుకొనేది ఏమిటి?
ఒకరి కోరిక
మరొకరికి వేడుక కావాలి.
ఒకరి ఆశకు
మరొకరికి బాధ్యత కలిగిఉండాలి.
ఒకరి సుఖం
మరికొరికి తృప్తి నివ్వాలి.
ఒకరి ఏకాంతం
మరొకరికి సాంగత్యం కావాలి.
ఒకరి నవ్వు
మరొకరిలో సంతోషం నింపాలి
ఒకరి అడుగుతో
మరొకరు పయనించాలి.
ఒకరి ఊహ
మరొకరితో నిజం కావాలి.
ఒకరి నీడ
మరొకరికి తోడు కావాలి.
ఒకరి బతుకు
మరొకరికి వెలుగు కావాలి.
ఒకరి నమ్మకం
మరొకరికి ఊపిరి పోయాలి.
ఒకరి ధ్యాస
మరొకరికి ఆశ నింపాలి.
ఒకరి ఆలోచన
మరొకరికి ఆనందం కావాలి.
-చందలూరి నారాయణరావు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~