“జీవితం”(కవిత )-అరుణ కమల

అతను నువ్వు నచ్చలేదని 
నడుమనే వదిలి వెళ్ళేడు 
నువ్వు నచ్చావని ఉన్నది 
దోచాడు ఇంకొకడు

ఎవరి స్వార్ధాల పందిరిలో
కీలుబొమ్మని చేసి 
ఇరుగమ్మల బుగ్గలు సొట్టలైనాయి
అవమానాల కడలిని దాటాలని

ఆమె పుట్టినింటి మెట్లు తొక్కింది
బతుకుపోరాటాన్ని భారంగా 
ఈడ్చి ఆత్మహత్యకు ప్రేరేపించిన వారే
సహకరించిన వారులేరు

అందమైన మనసున ఒకరు
తన హస్తాలను చాచి మేమున్నామని
జీవితం ఇచ్చిన వారు ఒక్కరే

ఇప్పటికి ఆమె జీవితం 
సొట్టబుగ్గలకే అంకితమై 
రహస్యబండాగారంగా 
మారిపోయింది

-అరుణ కమల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Comments are closed.