నీదే..నీవే ( కవిత) – సాహితి


ఓ మహిళా!
నదిలా సాగిపో
వ్యర్థాలకు భయపడకు
అనర్ధాలను లెక్కచేయకు.

కొండలను ఢీ కొట్టినా
దారి ఆగిపోదు.
కొత్తదారి తొలుచుకుపోతూ
లొంగిపోతుంది.

ఎక్కడ ఆపితే  ఆగిపో
అక్కడే లోతుగా పాతుగ్గగ్కుపో
ఆకాశం తలదించి
దీవించేలా మొలకెత్తు.

కాలం చేయందేదాక
కునుకు తీయకు
మార్గాన్ని వదిలిపెట్టక
మౌనంతో కలసిపో

కట్టలు తెగిదాకా
చప్పుడును చుట్టివుంచు
అడ్డు తొలిగేదాక
ఆగి చూడు.

బలం నీకు తోడై
విశ్వాసం నీడై
పరిసరానికి అవసరమై
విస్తృతంగా పరచుకుపో
పరిచయాలతో  తెలుసుకుపో

సాగిపో…పాకిపో
నడచిపో..గడచిపో
గెలిచిపో…నిలచిపో
తెలిసిపో…తరలిపో

హద్దులు చేరేగేలా
ఆంక్షలు కరిగేలా
ఆశలు కలిగేలా
కలలు నెరవేరేలా

సాచిన చేతులకు అందినంతగా
సాగిన పాదాలకు అందుకోగలిగినంతగా
అనుకుంటే అంతా నీదే
అనుకువైతే అంతటా నీవే.

– సాహితి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments