సాఖియా ! ఈ తహ తహను
తట్టుకోలేను క్షణమైనా
ఇవ్వు విషమైనా
లేదా పోయి మధువైనా …
-దాగ్
సిగ్గులోలుకుతూ
నా సన్నిధిలో తాను
ఆమె దగ్గరున్నంత సేపూ
నేను నేనులో నేను
-జిగిర్
ఆమె తన నిడుపాటి కేశాల్ని
పాదాల దాకా పరిచింది
ఇక చూడు ఆ జాలంలో
వేటాడే ప్రాణి వచ్చి పడింది
-మోమిన్
తడిసిన కురుల్ని పిండి
ఎవరు విదిలించారు నీళ్లను ?
తూగుతూ వచ్చిన మబ్బు
విరిగి వర్షించింది జల్లును
-షేక్ అర్జూ
-– అనువాదం ఎండ్లూరి సుధాకర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~