నా తండా కథలు – రజానేర్ భాజి -డా. బోంద్యాలు బాణోత్ (భరత్)

రచయిత పరిచయం:

పేరు: డా. బోంద్యాలు బాణోత్ (భరత్)
 హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో హిందీ సాహిత్యంలో  పీహెచ్ డీ
చేసి ప్రస్తుతం పీడీఎఫ్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా కథలు, కవితలు, వ్యాసాలు తెలుగులో, హిందీలో రాస్తున్నారు.

ఈ నెల నుంచి మన  విహంగ పాఠకుల కోసం తను చూసిన, పెరిగిన బంజారా లంబాడీ జీవితాలను ‘ నా తండా కథలు ‘ అనే శీర్షికన రాస్తున్నారు.

రజానేర్ భాజి

వరసగా వారంరోజులు వర్షం కురిసింది. తర్వాత కాస్తా రెండు రోజులు గెరువీయడంతో, తండాలోని,చిన్నా, పెద్దా రైతులు తమ తమ పత్తి చేన్లల్లో కలుపు తీయడం మొదలు పెటిండ్రు. ఐతే బానోత్ విజేత కూడ తన పత్తి చేనులో కలుపు తియ్యించాలనుకుంది. పైగా వ్యవసాయం చెయ్యడం, చేయ్యించడము బానోత్ విజేతకు కొత్త. కరోన లాగ్డౌన్ కారణంగా ఇంటికొచ్చి వ్యవసాయం చేస్తోంది. ఐతే పత్తి చేనులో కలుపు విపరీతంగా ఉంది. కలుపు తీపిద్దామంటే, కూలోల్లు ఎవ్వరు దొరుకుతలేరు. వరినాటు సీజన్ అవ్వడంతో, తండోలంతా వరినాటేయ బోతున్నారు. ఇగ తండాలో మిగిలింది ముసలోల్లు, చదువుకునే పిల్లలు.

లంబాడీలు ఊరికి దూరంగా నివసిస్తారు.
వాళ్ళు ఉండే ప్రదేశాన్ని ‘తండా’ అంటారు. వీళ్ళు చాలా కష్ట జీవులు. ఐతే ఇక్కడ, ఒక విషయం మనలందరిని ఆశ్చర్యానికి గురిచేస్తది.సాధారణంగా, ఎర్రటెండ లో పనిచేస్తే మనుషులు నల్లగైతరు, కాని వీళ్ళు ఎంతటి ఎండలో పనిచేసినా రంగులో అంతగా మార్ప కనబడదు. పైగా తాజా ఆకు కూరలు నిగనిగలాడినట్లు, వాళ్ళ శరీరం నిగనిగలాడ్తది.

కూలోల్ల కోసం తండంతా గాలించిందీ బానోత్ విజేత. అనేక వ్యాయ ప్రయాసాల తర్వాత, ఆరుగురు కూలోల్లు దొరికీండ్రు. ఇందులో ఇద్దరు డెభై ఏండ్లు పైబడిన ముసలమ్మలు. ఇంకో ఇద్దరు నలభై నుండి యాభై ఏండ్ల వయస్సు కలవారు. ఇంకో ఇద్దరిలో ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయి. వీలిద్దరు కాలేజిలో చదువుతున్నరు. కరోన కారణంగా ఇప్పుడు ఇంటికాణ్ణే ఉంటుంన్నారు. అడపా-దడపా పనికి పోతున్నారు.

ఎట్టకేలకు ఆ ఆరుగురిని తీసుకోని పత్తిచేను కలవబోయిందీ, బానోత్ విజేత. కలుపు బాగా వుండడంతో తలొక్క సాలు పట్టీ కలుపు తీస్తుంన్నారు. అంధరు చక చక కలుపు తీస్తుంన్నారు. మునుము సగానికి తీసిండ్రు. కాని ఈ కాలేజి పిల్లలు వెనక పడి పోతున్నారు. వీల్లు కలుపు తీసుడు తక్కువ, ఒకర్నోకరు చూసుకోవడం ఎక్కువైపోయింది. పైగా కాలేజి కుర్రోళ్ళు. ఐతే,అమ్మాయి ‘అంభిక’, అబ్బాయి ‘అంకుశ్ నాయక్’ వైపు చూస్తూ, కలుపు పారతో కలుపు మోక్కలను తవ్వుతుంది. ‘మనుసొక చోట- మనిసొకచోట’ అన్నట్టు, కలుపు తవ్వేపార కాస్తా గతితప్పి కాలి బొటన వేలుకు తగిలింది. దాన్తో ‘అంభిక’ సడన్ గా “యాడియే..” (అమ్మా..)అని అరిచింది. హటాత్తుగా అరుపు వినడంతో, కలుపు కలవడంలో నిమగ్నమైన ‘జాంకీ’, తీత్లి, కమ్లీ,సోమ్లీ మరియు విజేత అంధరు ఒకేసారి గజ్జున భయపడ్డారు. వీల్ల వైపు చూసిండ్రు. అంతలోనే అంకుశ్ నాయక్ తన వద్దవున్న తువ్వాల చింపీ రక్తం కారకుండా ‘అంభిక’ కాలి బొటన వేలుకు కట్టు కడ్తూండు…ఇదంతా గమనిస్తూన్న సోమ్లీ స్పన్దిస్తూ “కాయిc ర? తమ్ కలప్ కాడెన్ ఆయేగ ఎకీనేక్ దేకేన్ ఆయే ..!?” (ఏంది రా? మీరు కలుపు కలవడానికి వచీండ్రా లేక ఒకర్నోకరు చూసుకోవడానికి వచిండ్రా!?)అన్నది వచ్చి రాని కోపంతో. కమ్లీ స్పందిస్తూ “మేము కూడ మీ లెక్క పెరిగినోల్లమే, కాని ఇంతగనమా!.” అంది పెదవి విరుస్తూ. ఇట్లాంటిదే ఇంకో ఘటన ప్రస్తావిస్తూ “వీల్లు ఒకర్నోకరు మాత్రమే చూస్తూంన్నారు. కాని వాల్లీద్దరు ఒకరికోసం ఒకరు చావడానికి సిద్దమయిండ్రు. ఎందుకుర అని అంటే, లవ్వటా! అదేందో లవ్వు.” అన్నది కమ్లి, అరనవ్వు నవ్వుతు, పార మీద అంటిన తడిమట్టి తీస్తు.‌ ఐతే దీనికి ‘విజేత’ మద్యల కల్పీంచుకోని ” కాయిc ఛ కో యాడీ , దాడాఛెేన్తీ, కాయిc వాతె కరతోయి పా పజ్ ఛ” (“ఎమ్మోనవ్వ, రోజులు బాగలెవ్, ఏది మాట్లాడిన పాపమే ఉన్నది.” అని అన్నది బాగ పెరిగిన గునుగు మోక్కను రెండు చేతులతో గట్టిగ పట్టుకొని పీకుతు.

అంతలోనే సమయం 1.30 కావడంతో, పగటన్నం తినేందుకు చెట్లనీడకు పోయిండ్లు. అంధరు కలిసి గుండ్రంగ కూసున్నారు. తమ తమ సద్దులు విపిండ్రు. ఇద్దరు ముసలమ్మలు ‘జాంకీ’, ‘తీత్లి’ ఇద్దరు జొన్నరొట్టెలు, వాటి మీద ఆకు కూరల కూర వండుకొచీండ్రు. ‘జాంకీ’ చ్వాళార్ భాజి రాందన్ బాటిపర భాందలాయి(‘జాంకీ’ ‘చ్వాళ’ అనే పేరు గల్గిన ఆకు కూరను వండుకొచ్చీంది ).’తీత్లి’ రజానేర్ భాజి రాందన్ బాటిపర భాందలాయి(‘తీత్లి’ ‘రజాన్’ అనే పేరు గల్గిన ఆకు కూరను వండుకోని సద్ది కట్టుకొచ్చీంది). ‘సోమ్లీ’ బాటిపర కాందార్ ఖ్వాడీ భాందలాయి(‘సోమ్లీ’ జొన్న రొట్టెల మీదికి ఉల్లిగడ్డ తొక్కు సద్దిల కట్టుకొచీంది). ‘కోమ్లీ’ జారేర్ బాటిపర నసణేర్ ఖ్వాడీ భాందలాయి(‘కోమ్లీ’ జొన్న రొట్టెల మీదికి ఎల్లిగడ్డ తొక్కు సద్దిల కట్టుకొచ్చీంది). ‘విజేత’ దాళ్, ఫళ్చు, ఆంబార్ అచార్, ధాన్ భాందలాయి(‘విజేత’ పప్పు, పచ్చిపులుసు, మామిడికాయ తొక్కు/పచ్చెడ, అన్నం..సద్దిల కట్టుకొచీంది.

ఐతే బానోత్ ‘విజేత’ తన భర్త , పిల్లలు చేనుకాడికి వస్తారనుకొని సద్ది కొంచమెక్కువనెే కట్టుకొచీంది. కాని వాళ్ళు తినే సమయానికి రాలేదు. ఐతే తను తినగల్గినంత ఒక గిన్నెలో పక్కకు తీసింది. మిగతాదంతా తలాయింతా వెసింది. ‘విజేత’ వేసిన అన్నం, పప్పు పచ్చిపులుసు కలుపుకొని బుక్కనోట్లో పెట్టుకోంది ‘తీత్లి’ “కాయిc ఆచొ ఛ యే బెేటీ, కాయిc ఘాలన్ రాంన్దీ.”(ఎంత కమ్మగున్నది బిడ్డా, ఏమేసి వండినవు) అని అన్నది ‘తీత్లి’, రుచిని అనుభవీస్తూ. “కాయిc ఛెేని, సే రాంద జూ మై రాంన్దీ.”(“ఏమి లేదు అంధరు వండి నట్టే నేను వండిన”) అని అన్నది ‘విజేత’ నార్మల్గా. తీత్లి తన బాక్సులో ఉన్న ‘రజానేర్ భాజి’ (రజానేర్ ఆకు కూర) చంచాతొ తీసి ‘విజేత’ తింటున్న కంచంలో వెస్తూ

“ఇది రజానేర్ భాజి టేస్టు చూడు” అన్నది తీత్లి. ‘రజానేర్ భాజి’ అనగానే ‘విజేత’ నోట్లో నీళ్ళూరినయి. ఎందుకంటే రజానేర్ భాజి విజేతకు చాలా ఇష్ఠం. ” ఏ కాకి (ఓ చినంమ్మా) రజానేర్ భాజి అంటే నాకు ప్రాణం, నా పెళ్ళి కాకముందు నేను ఈ కురే ఎక్కువగ తినేదాన్ని. ఆ తర్వాత మేము హైదరాబాద్ కు వెళ్ళి పోయినం. ఇట్లాంటి కూరలు అక్కడ దొరకవు” అని అన్నది ‘విజేత’ ఉత్సాహంగ. ఐతే జాంకీ మాట్లాడుతూ “హైదరాబాదే కాదు బిడ్డా ఇక్కడ కూడ దొరుకుతలేవు. ఇక్కడ కూడ మేము ఇదే తెల్లనము, గవ్వే కూరగాయలు తింటున్నాం.” అని అన్నది జాంకీ, అనాసక్తిగా. ఐతే తీత్లి, జాంకీ మాటకు బదులీస్తూ “గా ఎనకటి జమాన పొయింది లెవమ్మా. ఆ జమానాల మేము తీరొక్క ఆకు కూరలు తిన్నాం. గీ తెల్లన్నమెక్కడిది!? ఏంకథ.” అని అన్నది తీత్లి, ఆకరి అన్నం బుక్క నోట్లో పెట్టుకొంటు. ఐతే తీత్లి చెప్పే మాటలను తీక్షణంగా గమనిస్తూంది ‘విజేత’. ఐతే బానోత్ విజేత, గత జమానాలో తమ తాతలు, ముత్తాతలు ఏం తిని బతికిండ్రో తెలుసు కోవాలనుకుంది. ఐతే ఎనకటి జమానాలో ఎట్లాంటి కూరగాయలు తినేవాళ్ళో చెప్పమని అడిగింది ఆసక్తిగా. బానోత్ విజేత లో తెలుసు కోవాలనే ఆసక్తినీ చూసి చెప్పాలనుకుంది తీత్లి. “మేము మా చిన్ననాటి నుండి అనేక ఆకు కూరలు తిన్నాం. నిజంగా చెప్పాలంటే కటిక పేదరికం అనుభవించినాము. ఆకలితో అలమటించినం. చాలా దూరం దూరం పోయి, నాళీర్ భాజి (బొద్దికూర) మూటలకు మూటలు

తెంపుకొచ్చేవాళం. అది వండుకోని కొంచం గరంగరం జొన్నరొట్టెలమీద తింటుంటే నా సామిరంగా ఆ మజాయే వేరు. కాని కోరిక్వార్ గామెవాళ్ ( లంబాడేతరులు, ఊళ్ళోవాళ్ళూ) ‘బొద్దికూర లంబాడోల్లు’ అని ఎక్కిరించేవాళ్ళు.

అదే విదంగా ‘రజానేర్ భాజి’, ‘లాంబ్డిర్ భాజి’, ‘ భాంగేర్ భాజి’, ‘అంబాడీర్ భాజి’, నూణ్కీర్ భాజి,చ్వాళార్ భాజి, కొణోదరేర్ భాజి, సాంటార్ భాజి, చణి రజానేర్ భాజి, …ఆది అనేక ఆకు కూరలు తినేవాళం. పజొన్న రొట్టెలు, మోక్కజొన్న రొట్టెలు తినేవాళం. జొన్న గడక, మోక్కజొన్న గడక..మంచినీళ్ళు కలుపుకోని తాగేవాళం. తాగడానికి మంచినీళ్ళు కూడా దొరికేటివి కావు. కిలోమీర్ దూరం లో ఒక వాగు ఉండేది. ఆ వాగు పేరు వెరీర్ ఖాళ్యా(చెలిమే వాగు)

ఆ వాగులో ‘చెలిమే’ తీసి, ఆ ‘చెలిమే’ నీళ్ళు తోడుకోని, బిందెమీద బిందె మూడు మాడు బిందెలు పెట్టుకోని ఎత్తుకొచ్చే వాళం. తక్కువ కష్ఠాలు పడలె బేటీ” అని అన్నది తీత్లి, తన ఎనకటి రోజులు తలుచుకుంటు.

“కాని ఇప్పుడంత మారిపోయింది.ఈ పచ్చగూరలు/ఆకు కూరలు, జొన్న రొట్టెలు, జొన్న గడక .. మనోళ్ళు ఎవ్వరు తింటలేరు. అంధరు తెల్లనమే తింటుంన్నారు.” అని అన్నది జాంకీ చేతులు కడుగుతు.
అందుకు బానోత్ విజేత బదులీస్తూ “ఏంమాట్లాతున్నావు జాంకీ కాకి, తండల మీరు జొన్న రొట్టెలు తింటలేరు కావచ్చు. కాని హైదరాబాద్ లో గల్లి గల్లికీ జొన్నరొట్టెలమ్మవాళ్ళు ఉన్నారు. అసలు దొరకవు తెలుసా. రొట్టెలు చేసి అమ్మేకాడా నైతే లైన్లు కడతారు. పైగా జొన్న రొట్టెలు తింటే షుగరు, బీపి రావట. షుగరు, బీపి ఆల్రేడి వున్న వాళ్ళు తింటే కంట్రోల్ అవుతుందంటా.జొన్నలు మనం తినడం మానేసినం కాని కోరిక్వార్, గామెవాళ్ (లంబాడేతరులు) తింటుంన్నారు.” అని అన్నది ‘విజేత’, ఉత్సాహంగ.
‘విజేత’ కు బదులీస్తూ ” తింటలేరు అంటే దానర్దం, మనోల్లు జొన్న రొట్టెలు అసలే తింటలేరని కాదు. అసలు తిందామంటే‌ జొన్నలే లేవాయే!. ఇగో అల్వాటు మాన్కోలేక ఒక పాలు జొన్నలు, రెండు పాల్ల బియ్యం కలిపి పిండి పట్టీంచుకొచ్చినం, ఆ పిండితోనే రొట్టెలు చేసుకోని తింటుంన్నాం.” అని అన్నది జాంకీ నిరుత్సహంగా. “అవును జాంకీ కాకి, మన తాతల నాటి నుండి వస్తూన్న తిండి అలవాట్లను మరిచిపోలేము. మేమైతే సీత్ల, తీజ్ పండుగలకు, ఐదారు వేలు కర్చు పెట్టుకోని, హైదరాబాద్ నుండీ సంవచ్చరానికీ రెండుసార్లు తప్పకుండా ఇంటికోస్తం. ఎందుకంటే అప్పుడు మనవాళ్ళూ ‘సళోయి’ తప్పకుండా వండుతారు. ‘సళ్ళోయి’ అంటేనే మేమంధరం పడిచస్థం. గా ‘సళోయి’ తినడానికే, అంత దూరంనుండి వస్తం.” అన్నది ‘విజేత’ , సళోయి టేస్టును గుర్తుచేసుకుంటూ. “సళోయి అంటే పడిచావనోల్లెవరు? బేటీ. అందరికి ఇష్ఠమే. ఇప్పుడు అంధరు తింటున్నారు. వాల్లు వీల్లు అని ఏమి లేదు.” అన్నది జాంకీ. “అందుకే ఎవరి తిండి వారిది. ఎవరి అలవాట్లూ వారివి. ఎందుకంటే భారత దేశం
అనేక కులాలకు, అనేక మతాలకు, అనేక జాతులకు, నీలయం. ఐతే వాటన్నీటిల్లో మన లంబాడి/బంజార జాతికి ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే వాళ్ళ వేశధారణ, మాట్లాడే భాష.. మిగతా వాళ్ళ కంటే భిన్నంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆహారపు అలవాట్లూ కూడా బిన్నంగానే ఉంటాయి.
అదే విదంగా ఒక్కోక్క సముదాయపు తిండి అలవాట్లలో ఒక్కోక్క మంచ్చి ఒౌషద గుణం వుంటుంది. రోగాల బారిన పడకుండా కాపాడుతాయి. ఆరోగ్యంగా ఉండేందుకు దోహద పడుతాయి.” అనీ సలహా ఇచ్చింది ‘విజేత’, అన్నం తిన్న చేతులు కడుగుతు.

‌ అన్నం తిన్న‌తర్వాత కొంచంసేపు రెస్టు (విశ్రాంతి) తీసుకోని మళ్ళీ ఎధావిధిగా పనిలోకి దిగుతారు. విపరీతంగా ఎండ కొడుతూంది. దానికి దగ్గా చెట్లనీడా ఉంది. పెద్ద పెద్ద వేపచెట్లు ఉన్నయి. కొంచమంత దురంలొ చెట్ల మడిగె ఉంది. వేపచెట్లు మద్య మద్య లో మోదుగుచెట్లు, తంగేడు తుప్పలు, ఆ చెట్లకల్లుకున్న దొండకాయ తీగలు, బోడకాకర్కాయ తీగలు ఉన్నాయి. మోత్తానికీ గుబురుగా,అందులో మనుషులు దూరుతే బయట వాళ్ళుకు కనబడరు.

చల్లటి నీడ ఉండటంతో కూలోల్లు అట్లనే భూమి మీద వరిగీండ్లు.ఇదే సందనుకోని అంకుశ్ నయక్ ఒక ప్లాన్ ఏసీండు. వీల్లు లేసేలోపు ఆ అమ్మాయి అంభికను ఆ గుబురు చెట్ల పొదల్లోకి తీసుకొపోయి, ఆమెతో ఏదేదో మాట్లాడాలనుకున్నాడు. బోడకాకర్కాయల వంకతో ఆ గుబురు చెట్ల పొదల్లోకి పోయిండు. పోతు పోతు అంభికను కూడ రమ్మనీ సైగచేసి పోయిండు. అంకుశ్ నయక్ ఆ గుబురు చెట్ల పొదల్లోకి దూరిన వెంటనే అంభిక కూడ బోడకాకర్కాయల వంకతో ఆ గుబురు చెట్ల పొదల్లోకి పోయింది. ఇద్దరు ఒకర్నోకరు గట్టిగ కౌగిలించుకున్నరు. “నువ్వంటే నాకు చాలా ఇష్ఠం, తెలుసా?” అంది అంభిక. ” నాకు కూడ నువ్వంటే ప్రాణం.” అన్నడు అంకుశ్ నయక్. ఇంతలో మల్లి కలుపు పనికి సిద్దమయిండ్రు. అంకుశ్ నయక్, అంభిక బోడకాకర్కాయలకని పొయినోల్లు ఇంకా రాకపోడంతో “ఏ అంభికా అబ లాబెజకొ కంకోడా ధేర్ పణ్ డిగిరియ డిగిరియ” (ఓ అంభిక ఇగ దొరికిన కాడికి చాలు గని రా…రా)అని
కేకేసింది ‘విజేత’. ఆ కేక వినగానే ఇద్దరు కౌగిలి విప్పుకోని, ఎవరకి వారు ఆ గుబురు చెట్లకు అటుపక్కనుండి అంకుశ్ నయక్, ఇటు పక్కనుండి అంభిక, బోడకాకర్కాయలు వెతుక సాగీండ్రు ఏమెరగనట్టు, నాటకీయంగా. పైగా ” ఒక్క కాయ కూడ దొరుకలేదు, అన్ని ముళ్ళే ఉన్నాయి..” అనీ అనుకుంటా వచ్చింది ‘అంభిక’ సంతోషంగా. అంకుశ్ నాయక్ కూడ సేమ్ డయిలాగ్ గొటిండు ఆనందంగా.

– డా. బోంద్యాలు బానోత్(భరత్)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో