ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజన జాతరలు (సాహిత్య వ్యాసం ) – డా.మురహరి రథోడ్


గిరిజన సాంప్రదాయ పెద్దల ఆద్వర్యంలో జరిగే ఈ జాతరలలో గిరిజనులు, గిరిజనేతరులు కలిసి సుమారుగా కొన్ని లక్షల మంది పాల్గొంటారు. జిల్లలో 9 జాతులకు చెందిన గిరిజన తేగల వారు నివసిస్తున్నారు. వీరిలో అధిక శాతం గోండులు ఆ తర్వాత లంబాడీలు, కొలమిలు, కోయలు, పర్ధాన్లు అంద్ లు, తోటీలు, చెంచులు, భిల్లులు నివసిస్తున్నారు. ఈ జిల్లలో 17 శాతం గిరిజనులు జీవించగా మొత్తం 4,95,794 మంది గిరిజనులు ఉన్నారు. వీరిలో లక్షా 63 వేల మంది గోండులు, లక్షా 12 వేల మంది లంబాడీలు, 38 వేల మంది కోలాంలు, 30 వేల మంది కోయలు, 26 వేల మంది పర్ధాన్ లు, 30 వేల మంది అందాలు, రెండు వేల 2 వందల మంది తోటిలు, 100 మందికి పైగా చెంచులు, భిల్లులు నివసిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.

అంతకు మరో మూడు రేట్లు గిరిజనేతరులు ఈ గిరిజన జాతర్లలో పాల్గొనడంతో ఆదిలాబాద్ లో గిరిజన జాతరల విశిష్టత స్పష్టమౌతున్నది. భారత తొలి ప్రదానమంత్రి పండిత్ జవాహర్లాల్ నెహ్రూ గారు ఆశించినట్లు గిరిజనేతరులు గిరిజనులతో మమేకమౌతున్నారని. విశదమౌతున్నది. ఇంతగా గిరిజనేతరులు గిరిజనుల సంస్కృతితో మమేకం కావడం ఆసియా ఖండంలో మరే ప్రాంతంలో జరగడం లేదని నిరూపితమైనది. ఇది ప్రపంచ సంస్కృతిలో కూడా ప్రశంసించదగిన విశేషం.

1. సేవలాల్ జయంతి:-
గిరిజన పెద్దలు, నాయకుల ఆద్వర్యంలో జరిగే ఈ ఉత్సవాల నిర్వాహనకై రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు కొన్ని లక్షలు మంజూరు చేస్తుంది. 1739 లో అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో జన్మించిన సంత్ శ్రీ. సేవాలాల్ మహారాజ్ 1780-90 మద్య కాలంలో తెలంగాణ రాష్ట్రం గుండా ప్రయాణించి తెలంగాణ ఉత్తర సరిహద్దు ప్రాంతానికి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని లంబాడీలు సేవాలాల్ జయంతి నిర్వహణద్వారా తమభక్తి ఉనికిని పెంచుకుంటున్నారు.

2. జంగుబాయి జాతర:-
ఆదిలాబాద్ జిల్లాలోని కోటపరండోలిలో యేట జంగుబాయి జాతర జరుగుతుంది. గోండులు వారితో కలిసివుండే గిరిజనులు, గిరిజనేతరులు వేలాదిగా పాల్గొనే ఈ జాతరలో మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కారణంగా మరాటి ప్రాంత గోండులు కూడా వేలాదిగా పాల్గొని కుల సంప్రదాయక సభలు జరుపుతారు. స్థానికంగా పారే ఒక సెలయేరుకు ఇరు ప్రక్కల భక్తులు గుడరాలు వేసుకొని సంప్రదాయం ప్రకారం నిద్రాలు చేస్తారు.

3. నాగోబా జాతర:-
ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ లో ప్రతి యేట నాగోబా జాతర ఘనంగా జరుగుతుంది. గోండులు, పర్శనుల్లో మెస్రం వంశీయుల ఆద్వర్యంలో జరిగే ఈ జాతరలో వేలాది మంది గోండులు, పార్షన్లు, తోటిలు, నాయకపోళ్లూ, కొలాములు ఇతర గిరిజన ప్రజలు పాల్గొంటారు. సాంప్రదాయక సభలు ధర్భారు నిర్వహిస్తారు. కొత్త కోడళ్ళ భేటీ ప్రత్యేకం దర్భారులో ఉన్నతాధికారులు ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలు పరిష్కరించటానికి ప్రయత్నిస్తామని మాటిస్తారు.

4. గాంధారి మైసమ్మ జాతర:-
మంచిర్యాల దగ్గర గాంధారి ఖిల్లాలో స్థానిక నాయకపోడ్ గిరిజనుల ఆద్వర్యంలో యేట జరిగే మైసమ్మ జాతరలో గిరిజనేతరులు కూడా వేల సంఖ్యలో పాల్గొంటారు. గిరిజమ సంక్షేమ శాఖ ఈ జాతర నిర్వాహనకై 5 లక్షల రూపాయలు విడుదల చేసింది. ఈ జాతరలో పాల్గొని ఖిల్లా ప్రదాన ద్వారం దగ్గర మైసమ్మకు పూజలు నిర్వహించిన దేవాదాయ శాఖా మాత్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు మౌలిక వసతుల కల్పనకై రూపాయలు ’50’ లక్షలు తమ ప్రభుత్వం విడుదల చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

5. కుంమ్రం భీం వర్ధంతి:-
పూర్వం నుండి గొండ్వాన రాయిసెంటర్ రాజ్ గోండ్ సేవ సమితి 1976-77 నిర్మాణమే కుమ్రం భీం నినాదాలను ముందుకు తీసుకురావడం జరిగినది. భీం మరణించిన స్థలం వద్ద వర్ధంతులు చేయాలనీ రాజ్ గోండ్ సేవ సమితి అధ్యక్షులు మడావి రాజు ధనోర నిర్ణయాలతో తీర్మానించినారు. 1980 సంవత్సరంలో కుమ్రం భీం తమ్ముని కొడుకు రఘును తీసుకొని పోయి గోండుల సంప్రదాయ ప్రకారం వేద్యం కోడిపుంజుతో పోయి మొదటి వర్ధంతి చేసినారు. జెండా-ముండా-పాతినారు. బండను ఎర్ర చందనంతో పూసి గుర్తుగా మరణ సంవత్సరం వ్రాసినారు.

తదుపరి 1982-83 లో దట్టమైన అడవి మార్గం గుండా ఆనాటి జిల్లా కలెక్టర్ గోయల్ ఐ.టి.డి.ఏ.ప్రాజెక్టు అధికారి గార్లకు మోవాడ్ లోద్ది నుండి పెద్ద పెద్ద గుట్టలు ఎక్కించి భీం మరణ స్థలం జోడెన్ ఘాట్ ను చూసినారు.

1984 సంవత్సరంలో అధికారులే భీం మరణించిన స్థలం వద్దకు జోడే ఘాట్ లో నైజాం సైన్యం చంపిన అనువాలునూ చూసి గోండు వీరుల వర్ధంతిని చేయించాలని వారి ఆలోచనలో పడి ప్రభుత్వానికి నివేధిక పంపినారు. 1980 వారసుల బందుమిత్రుల ఎవరికీ తోచిన రీతిలో చందా స్వచ్చందంగా పట్టుకొని ప్రతీ సంవత్సరం ఆశ్వయుజ పౌర్ణమి రోజున జోడే ఘాట్ లో వర్ధంతి చేసే విధంగా మడావి రాజు కృషి చాలా ఉన్నది.

గోండు గిరిజనులు కుమ్రం భీం వర్ధంతిని స్పుర్తిదాయక సాంప్రదాయక పండుగగా జరుపుకుంటారు. ఉట్నూర్ లో ఉన్న సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ వర్ధంతి పండుగకు ప్రభుత్వం ప్రత్యేకంగా సుమారు రూపాయలు 20.00 లక్షలు ఖర్చు చేస్తుంది.

6. పులజీబాబా జయంతి:-
ఆసిఫాబాద్ జిల్లాలోని పాట్నాపూర్ గ్రామంలో అంధ్ గిరిజనులు తమ ఆరద్యా గురువైన పులజీ బాబా జయంతి వేడుకలను ప్రతి ఏటా ఆగస్ట్ 30 వ తేదీన ఘనంగా జరుపుకుంటారు. ఈ జాతరలో గోండు, కలామ్, పర్ధాన్ తోటి, లంబాడీ, తదితర గిరిజనులు, గిరిజనేతరులు, మహారాష్ట్ర తదితర సరిహద్దు రాష్ట్రాల భక్తులు కూడా వేలాది మంది పాల్గొంటారు. 2018 నుంచి పులజీ బాబా జయంతి నిర్వాహనకై ప్రభుత్వం రూపాయలు 5 లక్షలు కేటాయిస్తుంది. ఇంకా ఆంధ్ ల సిరాల్ జాతరకు, నాయకపోళ్ళ లక్ష్మి దేవర జాతరకు, చెంచులు సలేశ్వరం, లొద్ది జాతరలకు కూడా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఇలా రాష్ట్రం లో అందరూ గిరిజనులకు సంబందించిన ప్రధాన జాతులన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం బహుశా భారతదేశంలోనే అరుదైన విషయం.

ఈ నేపత్యాన్ని పరిశీలిస్తే ఒక పరిమితి ప్రాంతంలో సేకరించే మౌఖిక కథలు గాని, చరిత్ర గాని ఈ జాతర చరిత్రను విశ్లేషించడానికి సరిపోవని భావించాల్సి వస్తుంది. ప్రకృతిని పూజిస్తూ తమ పంటను ఇంటికి తెచ్చుకోవడం, వేల్పులకు జాతరలు జరపడం గిరిజనుల సంప్రదాయం, మైదాన ప్రాంత జనారణ్యాలు వలసలు సాగించిన నేపథ్యంలోనే గిరిజన పండుగలు పాక్షిక మైదాన ప్రాంత పండుగలుగా మార్పు చెందినాయి. జాతరలో అధికారులు, గిరిజనేతరుల ప్రమేయం పెరిగిపోతున్నదనే భావన గిరిజనులలో ఉంది. జాతర అభివృద్దిని, ఆ ప్రాంతంలోని గిరిజనుల అభివృద్దితో మమేకం చేయాల్సి ఉంది. గిరిజనుల అస్తిత్వానికి ముప్పు లేకుండా జాతర అభివృద్ది జరగాలి.

ఆధార గ్రంధాలు:-
1. “ఆదిలాబాద్ జిల్లా లంబాడీ సాహిత్యం” డా. మురహరి రథోడ్.
2. గిరిజన కులగోత్రాలు, డా. రాజ్ మహ్మద్, వరంగల్ వాణి దినపత్రిక
3. తెంగాణ మాస పత్రిక డా. ద్యావానపల్లి సత్యనారాయణ.
4. అధ్యాత్మిక అరుణోదయం – జీవన జాగృతి గణపతి సంభూజీ వాడ్గురే.
5. గిరిజనుల పండుగలు ఆచారాలు – డా. N.O. రాజ్ మహ్మద్.

-డా.మురహరి రథోడ్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు ​Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో