గౌరవ సంపాదకీయం- ప్రొ. శివుని రాజేశ్వరి

కాలం ఎంత వేగంగా ముందుకు వెళ్తున్నా, స్త్రీ ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నా సాహిత్యానికి వచ్చేసరికి తన పాత్ర కొంత వరకే పరిమితం అవుతుందని చెప్పక తప్పదు. ఇప్పటికీ ఏ సాహితీ సభ, వేదికను చూసినా నామ మాత్రంగా నే ఒకే ఒక్క రచయిత్రి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో కూడా అంతర్జాలం లో జరుగుతున్న పుస్తక ఆవిష్కరణల్లో , వెబినార్ల లో, పుస్తక పరిచయ వేదికల్లో ఎక్కడా రచయిత్రులు ఒకరి కంటే ఎక్కువ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆగస్టు 29, 30 తేదీలలో “21వ శతాబ్ది స్త్రీల నవలలుˮ అన్న అంశంపైన ʻవెబినార్ʼ జరిగింది.

48 మంది రచయిత్రులు, అధ్యాపకులు, స్త్రీ వాదులు నిర్వహించుకున్న వెబినార్ ఇది. ఈ వెబినార్ సాంప్రదాయికంగా జరిగే సెమినార్లు, వెబినార్ల కంటే రెండు విషయాల్లో భిన్నంగా నిర్వహించబడటం గమనార్హం.

1. రచయిత్రులు వెబినార్ లో పాల్గొనడం మొదటి పత్యేకత:- సర్వసాధారణంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల పక్షాన జరుగుతున్న వెబినార్లలో పరిశోధకులు, అధ్యాపకులు, సాహిత్యాభిమానులు పత్ర సమర్పణ చేస్తారు. ఈ వెబినార్ లో నవలలపైన పత్ర సమర్పణకు వారికి అవకాశమిస్తూనే నవలా రచయిత్రులను కూడా ఆహ్వానించి నవలా నేపథ్యాన్ని వివరించమని కోరడం జరిగింది. దేశ విదేశాల నుంచి 16 మంది రచయిత్రులు తాము నవల రాయడానికి పొందిన ప్రేరణను, నవలా రచనలో తమ అనుభవాలను వివరించారు. తద్వారా నవలా పరిశోధనలో కొత్త కోణం వెలుగు చూసింది. దాదాపుగా 50, 60 సంవత్సరాల నుంచి నవలా రచన చేస్తున్నవారు, కొంత కాల వ్యవధి తరువాత తిరిగి నవల రాయడానికి వెనుక ఉన్న ప్రేరణ తెలిపారు. కొత్తగా కలం పట్టినవారు, స్త్రీవాదం, దళితవాదం, మైనారిటీవాదం, బహుజనవాదం, ప్రపంచీకరణ నేపథ్యాలతో నవలలు రాసినవారు తమ నవలను తామే విశ్లేషించుకుంటున్నందుకు, నవలా రచన వెనక ఉన్న ప్రేరణను పంచుకునే అవకాశం కలిగినందుకు సంతోషించారు.

2. పత్రికా సంపాదకులు, ప్రచురణకర్తలు వెబినార్ లో పాల్గొనడం రెండవ ప్రత్యేకత:- నవలా రచన జరిగాక అవి పాఠకులకు చేరే క్రమంలో పత్రికలు, ప్రచురణ సంస్థల పాత్ర చాలా ఉంటుంది. ఇవి రెండూ ఇప్పటివరకు పురుషుల నిర్వహణలోనే నడిచాయి. స్త్రీల నవలలు ధారావాహికలుగా పత్రికల్లో రావాలన్నా, నవలలు ముద్రించి మార్కెట్లోకి వదలాలన్నా వారి నియమ నిబంధనల ప్రకారం జరిగేవి. తమ పత్రికలకు మార్కెటింగ్ పెరగాలంటే, తమ ప్రచురణ సంస్థ లాభాలు చేసుకోవాలంటే రచయిత్రులు ఏ రకమైన నవలలు రాయాలో నిర్ణయించిన రోజులు ఉన్నాయి. కొన్ని పత్రికలు మాత్రమే స్త్రీలకు కొంత స్వేచ్ఛ నిచ్చాయి. ఈ క్రమంలో స్త్రీలు తమ స్వంత గొంతుక వినిపించలేకపోయారు. తమకు నచ్చిన అంశంపైన నవల రాసి ముద్రించుకున్నా వాటిని మార్కెటింగ్ చేసుకోవడం తెలీని స్థితి. అందువలన ఎందరో తమ రచనలను అమద్రితాలుగానే ఉంచారు. అవి కాల గర్భంలో కలిసిపోయే దుస్థితి. ఈ పరిస్థితుల్లో కొందరు స్త్రీలు తామున్నామంటూ ముందుకు రావడం, స్త్రీల రచనల కోసమే పత్రికలు స్థాపించి, వారి గొంతుక వినిపించడం గొప్ప విషయం. అందులో మొదటిది ʻభూమికʼ – స్త్రీవాద పత్రిక, రెండవది ʻవిహంగʼ అంతర్జాల మహిళా పత్రిక. కొండవీటి సత్యవతిగారు,
పుట్ల హేమలత గార్ల సంపాదకత్వంలో వెలువడ్డాయి.

ఈ పత్రికలు స్త్రీల రచనలకు చేసిన సేవ చాలా గొప్పది. ఆ సేవ ఈనాడు అంతర్జాల అంతర్జాతీయ వెబినార్ ద్వారా ప్రపంచానికి తెలిసింది. వెబినార్ కు గొప్ప ప్రాముఖ్యతను చేకూర్చింది. తొలి స్త్రీవాద పత్రిక ʻభూమికʼ స్థాపించి 32 సంవత్సరాలు అయింది. సత్యవతిగారు స్త్రీల రచనకు పత్రిక చేసిన కృషిని వివరిస్తూ ʻస్త్రీవాద ఉద్యమం వేగం పుంజుకుంటున్న సమయంలో స్త్రీల చర్చలు, రచనలు, పంచుకునే వేదిక లేకపోవడం వలన స్త్రీవాద దృక్పథంతో స్థాపించబడిన మొట్టమొదటి స్త్రీల పత్రికʼ అన్నారు. స్త్రీవాద పత్రిక అన్న పేరు పట్ల కొందరు అభ్యంతరాలు లేవదీసినా వీరు లెక్కచేయలేదు. ʻనా జీవితం, భూమిక జీవితం వేరు కాదు, పత్రిక ఎదుగుదల, మార్పులు, చేర్పులు నా జీవితంలో ఉన్నవేʼ అన్న సంపాదకురాలి మాటలు నేరుగా శ్రోతలను తాకాయి. ʻభూమి ప్రయాణంʼ ఆమె కృషిని తెలిపింది. భూమికలో వందలాది కథలు ప్రచురించడమే కాక ʻచరిత్ర చీకటిలో వెలుగు రవ్వలుʼ వంటి శీర్షికలు పెట్టి దుర్గాబాయ్ దేశ్ ముఖ్, భండారు అచ్చమాంబ వంటి తొలితరం స్త్రీల రచనలు కాలగర్భంలో కలిసిపోకుండా వెలుగులోకి తెచ్చారు. తొలి తెలుగు కథా రచన చేసింది స్త్రీయే అన్న చారిత్రక సత్యం వెలుగుచూసింది. (భండారు అచ్చమాంబ రాసిన ధనత్రయోదశి, స్త్రీవిద్య (1902).

ఇక ʻవిహంగʼ తొలి అంతర్జాల మహిళా పత్రిక. స్త్రీలు పత్రికా రంగంలో పురుషులతో సమానంగా నిలబడడమే కాదు, సాంకేతికంగా వారి కంటే ముందుకు వెళ్ళగలరు అని వేగంగా దూసుకుపోయింది. 1.11.2011 తేదీన స్థాపించబడి స్త్రీలది ద్వితీయ స్థానం కాదు అన్నింటా ప్రథమస్థానమే అని నిర్ధారించింది. పుట్ల హేమలత గారి నిర్విరామ కృషి ఈ పత్రిక వెనుక దాగి ఉంది. ఆమె తరువాత ఎండ్లూరి మానస చిన్న వయసులోనే ఆ బాధ్యతను భుజాన వేసుకుని ʻవిహంగʼను ఆకాశమార్గాన పయనింపజేస్తూంది. స్త్రీల అందం, అలంకరణలు, ఆరోగ్యం వంటి విషయాలకు చోటివ్వమని కొందరు సూచించినా స్త్రీల చైతన్యానికి, సాహిత్యానికి

మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ ముందుకు దూసుకుపోతుంది. గీతాంజలి రాసిన ʻహస్బెండ్ స్టిచ్ʼ కథలు వేయడమంటే చాలా ధైర్యం కావాలి. ఆ కథలు ప్రచురణ సమయంలో ఎన్నో విమర్శలు వచ్చినా లెక్కపెట్టకుండా హేమలతగారు విహంగలో ప్రచురించారు. స్త్రీల శారీరక, మానసిక వేదనలకు అక్షర రూపం దాల్చిన ఆ కథలు స్త్రీల జీవితాల్లో దాగిన భయంకరమైన అనుభవాలు వెలుగుచూడడం ʻవిహంగʼ ద్వారానే సాధ్యమయ్యాయి. ఎండపల్లి భారతి రాసిన ‘ ఎదారి బతుకులు’ కథలు జాజుల గౌరి రాసిన ‘వొయినం ‘ శాంతి ప్రబోధ రాసిన ‘ జోగిని ‘ వంటి నవలలు రావడానికి ʻవిహంగʼ వేదిక అయ్యింది. ʻస్త్రీల రచనా చరిత్రʼలో సువర్ణాధ్యాయాలు లిఖించింది. స్త్రీల పక్షాన పత్రిక స్థాపించబడిన ప్రయోజనం విహంగ ద్వారా పూర్తిగా చేకూరింది. స్త్రీలు నిర్భయంగా, ఏ ఆంక్షలు లేకుండా తమ స్వంత గొంతుక వినిపించే అవకాశం ఈ పత్రిక కలిగించింది. స్త్రీల దృష్టి కోణం నుంచి స్త్రీల అనుభవాలు, స్త్రీల సమస్యలను వినిపించింది.
ఎన్నో వార, మాస పత్రికలు మూతపడిన కాలంలో – ఉన్న కొద్ది పత్రికలు కూడా నవలలకు కాక కథలకు ప్రాధాన్యం ఇస్తున్న కాలంలో – పత్రికారంగంలో పురుషుల ఆధిపత్య ధోరణి ఈనాటికీ కొనసాగుతున్న కాలంలో – మేమున్నామంటూ ముందుకు వచ్చిన ʻభూమికʼ, ʻవిహంగʼల కృషిని ఈ వెబినార్ ద్వారా ఎందరో తెలుసుకున్నారు. స్త్రీల ప్రయాణం ʻభూమిʼ నుంచి మొదలై ఆకాశంలోకి ʻవిహంగʼలాగా సాగిపోయింది.
“ఓల్గా ʻగమనమేగమనంʼ నవలలు తమ భూమికలో ధారావాహికంగా వేసుకోవాలన్న నిర్ణయంˮ, “ఎన్నికథలు రాసినా ఒక్క నవలైనా విహంగకు రాయాలన్న నిర్ణయంˮ – ఈ వెబినార్ లో తీసుకోవడం ఆ పత్రికా సంపాదకురాళ్ల అంకితభావానికి నిదర్శనం.

ʻఆధునిక మహిళలు చరిత్రను పునర్నిర్మిస్తారన్న గురజాడ మాటలుʼ అక్షర సత్యాలయ్యాయి.

– ప్రొ. శివుని రాజేశ్వరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయంPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో