ఖబడ్దార్….. (కవిత )-సోంపాక సీత,

పవిత్ర భావనతో పూజిస్తే
యజ్ఞ ఫలాలను పంచుతుంది..
కామ భావనతో కాలుదువ్వితే
కడకు నిన్ను నరక ద్వారానికే సాగనంపుతుంది….

అనురాగాన్ని అపహాస్యం చేసినా,
నమ్మకాన్ని అపనమ్మకానికి తాకట్టు పెట్టినా
ఎరుపెక్కిన అగ్గిసెగై లంకా దహనాన్ని
జ్ఞప్తి చేస్తుంది….

దుర్వాంఛా విత్తనాలను పోగేసుకుంటూ
కోరికల గుర్రంపై స్వారీ చేసే
దుర్మార్గం నీదైతే…?
యమపురికి మార్గంచూపే
అగ్గితెగువే లలన…

దుశ్చర్యలను నింపుకున్న
హృదయభూమితో
అసురకలాపం సాగించే
అకృత్యం నీదైనపుడు
సహస్ర ఫణిలా కోరలు చాచే
అగ్నిశిఖై నిన్ను అంతం చేస్తుంది…

ఆడదంటే నిప్పే…
కామంతోటో,
పైశాచిక రోగంతోనో,
లేక కాలరెగరేయాలనే
తపనతోటో ముట్టావో…
నిన్ను కాల్చే తీరుతుంది…
ఖబడ్దార్…

-సోంపాక సీత,

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో