కల “కడుపుకోత”(కవిత)- సాహితి

రోజూ పూచే మాట
మౌనంతో వాడిపోతే
ఆ శబ్దం ప్రసరించక
మనసుకి ఎంత అంధకారం?

మనసుకంటిన
మాధుర్యం ఎండమావిలా
మాయమైతే
హృదయానికి ఎంత గాయం?

రోజూ తలచే క్షణం
రాత్రి ఒడిలో కనుమూస్తే
తీపి కలకు ఎంత
కడుపు కోత?

కూర్చుకొన్న ఊహలు
దారి తప్పి గల్లంతై
ఊసులు ఉసూరుమంటుంటే
ఆశకు ఎంత క్షోభ?

మాట అర్ధం ఆవిరై
మనసు ఊట అడుగంటి
మనిషి దూరమైతే
బంధానిది ఎంత దిగులు?

అన్నీ తెలిసిన వయసు
అంతా చదివిన అనుభవం
ఏకమయ్యే వేళలో
కల శత్రువైతే రాత్రికి ఎంత బాధ?

ప్రతి పూట తలస్తూ
ప్రతి కోరిక కొలిచే దేవత
కరుణించ కినుక వహిస్తే
కనులకెంత కష్టం.?

మనసును మోసిన
నమ్మకం ముడివిప్పిన నిజాలు
ప్రశ్న పాదాలను మొక్కినా
ఫలితంలేక నిజాలదెంత నిట్టూర్పు?

చేదుగా ఎదురుపడ్డా ఊరుకొని
భంగపడ్డా తీపిగా తేరుకొని
ప్రతి రోజు తాజాగా కనిపిస్తున్నా
వాడిపోయి ఓడిపోవడం ఎంత శాపం?

మనసు వాకిలి తెరచుకొని
హృదయమధనంలో పుట్టిన
ప్రేమామృతం పంచలేని
చేతులవి ఎంత అసమర్థత ?

నీలో లేని నేను
నాలో నన్ను లేకుండా చేసి
ఎదురెదురైతే ?
ఎవరిని ఎవరుని ఓదార్చాలో ?

ఆ ఓర్పుదెంత విలువో?
మనలో తెలిపేదెవరో?
మనకు తెలిసేదెన్నడొ?

-సాహితి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో