//చేరువైనా… దూరమైనా…//(కవిత )-నవీన్ చంద్ర

 

 

 

 

పెదవుల పలకరింతల్లో
ఎన్నాళ్ళని దాగుండను….
ఓర చూపుల వెతుకులాటల్లో
ఎన్ని కునికిపాట్లు పడను….

దాచేయబడ్డ నాపై ప్రేమ
నీదగ్గర కొండంత వున్నా
దరిచేరనీయని నీ మౌనానికి
ఎంత మూల్యం చెల్లించను….

కన్నీటి చెమ్మలతో
నన్ను తుడిచేస్తూ ఉంటే
జ్ఞాపకాల రెమ్మలతో
నన్ను తడిచేస్తూ ఉంటే
దూరపు భారాన్ని
ఎంత కాలమని మోయను….
చేరనివ్వని నీ పిచ్చితనాన్ని భరిస్తూ
చేరుకోవాలన్న నా ఆత్రాన్ని
ఎంతని కప్పిపెట్టను….

తలపుకు వచ్చే తగలని స్పర్శలను
ఊహకు అందని మనసు బెంగను
చేరువైనా దూరమైనా
నిన్నే నమ్ముకుని
నన్ను మిగుల్చుకోని నన్ను
ఎంతలా తిట్టుకోను
ఎంతలా శపించుకోను…..!?

నవీన్ చంద్ర

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments