మొదటి ప్రేమ(కవిత )-చంద్రకళ. దీకొండ,

అప్పటిదాకా…
రోజులకొద్దీ…
ఊహూ… నెలలకొద్దీ…
సాగిన మానసిక ఒత్తిడికి…
నిరీక్షణకు తెరదించుతూ…!

గంటల కొద్దీ పడిన శారీరక బాధను మరిపిస్తూ…!!

సృష్టి అద్భుతాన్ని కనుల ముందు నిలుపుతూ…!!!

గుప్పిళ్ళు మూసిన లేత చేతులు…
మృదువైన అరిపాదాలు…!!!

అరమోడ్పు కనులతో చిరునవ్వులు చిందిస్తూ…
ముద్దులు మూటగట్టిన మోము…!!!

నాలో పెరిగిన నా జీవం…
నా ఊపిరిలో ఊపిరై…
రక్తంలో రక్తంగా పెరిగిన
నా అంశ…!!!

రూపమెలాగుందో తెలియకపోయినా…
నాతో కలిసి నివసించిన
నా ప్రాణం…!!!

నాలోనే దాగున్నది…
నేడు విడివడి…
ఎదురుగా…కనులవిందుగా…!!!

తనివితీరా హత్తుకోవాలని…
ఒడిలోకి తీసుకుని ముద్దాడాలని…
తనువు తహతహలాడుతోంది…
ఎదలో ఏదో ఉప్పొంగుతోంది…!!!

ఈ అనుభూతేనేమో…
మొదటి ప్రేమంటే…?!?!?!?!

చంద్రకళ. దీకొండ,

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments