*హృదయ స్పందన*(కవిత )-బట్టు విజయ్ కుమార్

నిన్ను
*వరించడం కోసం
*కలవరించని* క్షణము లేదు
నిన్ను చూసి *తరించడం* కోసం
*పరితపించని* దినము లేదు
నీ *దూర* తీరాల కోసం
*నిదుర* వచ్చిన రేయి లేదు
*సుదూర* ప్రయాణం కోసం
*మధురమైన* కలలు ఎన్నో
నీ *దరికి* చేరడానికి
*బెదరిన* రోజులు ఎన్నో
నీవు కంట *బడిన* వేళ
*తడబడిన* పలుకులెన్నో
నీ తనువు *గాలులు* సోకి
*మేఘాలుగా* మారే స్వప్నాలెన్నో
నీ జ్ఞాపకాల *దారాలు*
*మందారాలుగా* చేసి
నీ మది *మందిరానికి* అందించా
*దయ* చూపించి
నా *హృదయ* స్పందన వినుమా !!

-బట్టు విజయ్ కుమార్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments