*తెల్గు బామ్చను(కవిత )–శ్రీకాట్రగడ్డ

 

 

 

 

నేను తెలుగువాణ్ణి వెలుగు మదుగున
మసలుచున్న వాణ్ణి
తెలివిగలవాణ్ణని
విశ్వాన విశ్వసనీయ
వాక్సమీర చేష్టల
తెలుగు లెస్సయిన
వేర్వేర్భాషల ప్రేమికుణ్ణి
నేను తెలుగువాణ్ణి!
తెలుగు పదబంధం
మధురమన్చెప్పి
పరాయి విదూషకుల
మెప్పొందినవాణ్ణి;
సూర్యచంద్రుల్ని
కొమ్ముకిరీటాల్కొలిచి
తెల్గు సాహిత్యాక్షులుగా
నాసిక సమాంతరంగా
నేత్రదృక్కుల్ని సారించి
తెలుగుకావ్యగానాల్జేసీ
ప్రాతః కవులనిమోసి
భాషామత్తుడనై
ఇంకా నిషాదిగనివాణ్ణి;
నేను తెలుగువాణ్ణి!
విశేషమేమంటే,తెలుగు
సంఖ్యామానం తెల్వదు
ఆంగ్లాక్షర సంఖ్యలనే
సరిపోలుస్తుంటా!
నేను తెలుగువాణ్ణి!!
ఎందరొజ్జలు యిజ్జగాన
నన్బుజ్జగించి సాదారో;
ప్రాచీనభాషాపూతల
కంఠమొరిసేలాకూసి
నన్నయ్నుండి నాదన్క్
నిక్కమని వక్కాణిస్తూ
తెలుగురాణి వేణీభరణ
స్వరూపమ్జూపి సేవించ
నన్నుసిగొల్పారో?!!
తెల్గు పదాలేవో కానక
కన్పించినా నాకానక
నిత్యం తెలుగు వర్ణన్నై
స్వరార్ణవాన మెరుస్తూ
వాక్సభల మురుస్తూ
వాత్సాయనపొందికలో
సాహితీవిందుల్కుడిచి
భుజకీర్తులుమోస్తూ
రోజూ రాస్తున్నా
తెల్గనుకుంటూకూస్తూ
తళుకుసంధ్యల్వల్లిస్తూ
తెలివైన తెలుగువాణ్ణనే
తెలుగు మాధ్యమానికై
ప్రజాప్రాంతాల్లోనూ
శాసనావరణల్లోనూ
చేయెత్తి జైకొడుతూ
తెలుగామరణాన్ని
తెల్లారించజూస్తున్నా!
నేను తెలుగువాణ్ణి
జాతీయభాషలపైటతో
నాఆచ్ఛాదనషాకుతో
యతిప్రాసలయలషోక్తో
మతినిర్మాణగతుడనై
వాక్యాసలభివర్ణితుడనై
వెయ్యేళ్లపైబడిన వారసుడనైవ్యాసుడిలా
తెలుగనుకుని,తృప్తిగా
వెయ్యక్షరాలపైబడిన
తెల్గుభాన్చన్ కవిత్రాశ!!

-శ్రీకాట్రగడ్డ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments